For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుకుర్బిట్ పాయిజనింగ్ : కారణాలు, సంకేతాలు, నివారణా చర్యలు

ఈమద్య ఎక్కువగా ప్రచారమవుతున్న విషయాల్లో ఈ “కుకుర్బిట్ పాయిజనింగ్” కూడా ఒకటి. కుకుర్బిట్ అనగా సొరకాయ రకం జాతి పండ్లు . అనగా గుమ్మడికాయ, దోసకాయ, సొరకాయ, పొట్లకాయ వంటివి. ఇది కుకుర్బిటాసీ అనే సాంకేతిక నా

|

ఈమద్య ఎక్కువగా ప్రచారమవుతున్న విషయాల్లో ఈ "కుకుర్బిట్ పాయిజనింగ్" కూడా ఒకటి. కుకుర్బిట్ అనగా సొరకాయ రకం జాతి పండ్లు . అనగా గుమ్మడికాయ, దోసకాయ, సొరకాయ, పొట్లకాయ వంటివి. ఇది కుకుర్బిటాసీ అనే సాంకేతిక నామాన్ని కూడా కలిగి ఉంది.

నిజానికి ఏ ఇద్దరి మహిళల జుట్టు ఒకేసారి రాలిపోవడం ప్రారంభిస్తే, అది పెద్ద విషయం కాజాలదు. కానీ వేరు వేరు ప్రాంతాలకు చెందిన సంబంధమే లేని మహిళలు ఒక ఆహార పదార్ధం వలన ఒకే రకమైన సమస్యకు గురైనప్పుడు, మరియు ఫలితాలలో కారణం కూడా ఒకటే అని తేలినప్పుడు, నిజంగానే చర్చనీయాంశం అవుతుంది . కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుంది ఏమిటంటే వీరిరువురూ కుకుర్బిట్ జాతి కూరగాయల విష ప్రభావాలకు గురయ్యారు అని. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా .. !

cucurbitacin toxicity

అసలు ఏంటి ఈ కుకుర్బిట్ పాయిజనింగ్ :

"కుకుర్బిట్ పాయిజనింగ్" లేదా "టాక్సిక్ స్క్వాష్ సిండ్రోమ్ " అనునది కుకుర్బిటాసిన్ అనే రసాయనిక పదార్ధం వలన వస్తుంది. ఇది సాధారణంగా పండ్లలో లేదా కాయగూరలలో ముఖ్యంగా గుజ్జు లక్షణాలు కలిగిన వాటిలో ఈ రసాయనిక సమ్మేళనం ఉంటుంది. ఈ రసాయనం వలన పండ్లు లేదా కూరగాయలలో శరీరానికి హాని చేసే తత్వాలు పెరుగుతాయి. నిజానికి ఈ కుకుర్బిటాసిన్ అచేతనమైనదే ,మరియు రసాయనిక మూలాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ సంబంధం లేని రసాయనాలతో ఫలధీకరణం చెందడం మూలంగా. ఈ కుకుర్బిటాసిన్ సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. నెమ్మదిగా హానికరంగా తయారవుతుంది.

కుకుర్బిటాసిన్ విష లక్షణాలు:

కొన్ని వైద్య నివేదికల ప్రకారం ఈ కుకుర్బిటాసిన్ రసాయన విష సమ్మేళనాలకు గురైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందువలన ఎక్కువగా ప్రజలలోనికి కూడా రాలేదు.

ఈ ఇద్దరు మహిళలకు కుకుర్బిటాసిన్ వలన ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి ?

ఈ ఇద్దరు మహిళలు ఫ్రాన్స్ లో నివసించు వారు. వీరిద్దరూ చేదుగా ఉన్న గుమ్మడికాయ స్క్వాష్ ను రుచి చూశారు. వీరిలో ఒకరు తమ జుట్టు ఎక్కువగా రాలిపోవడాన్ని మరియు గంటల వ్యవధిలో వాంతులు రావడాన్ని గమనించారు. ఇక రెండవ మహిళ కుటుంబంలోని వ్యక్తులందరూ అతిసారం , వాంతులతో తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఈవిడ జుట్టు మాత్రం ఆ స్క్వాష్ తీసుకున్న వారం రోజుల వరకు బాగానే ఉంది. కానీ తర్వాత రాలడం ప్రారంభమైంది.

ఈ కుకుర్బిట్ పాయిజనింగ్ అనేది చేదుగా ఉన్న కుకుర్భిటాసీ వర్గానికి చెందిన పండ్లు, కూరగాయల వలనే కలుగుతుంది. గుమ్మడి పండు, కీరా దోస, పుచ్చకాయ, స్క్వాష్ , సొరకాయ వంటివి ఈ తెగకు చెందినవిగా ఉంటాయి. ఈ కుకుర్బిట్ పాయిజనింగ్ సమస్యలలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రసాయనాలు ఏ పండులో అధిక నిక్షేపాలలో ఉంటాయో ఇంతవరకు తెలీదు. మరియు దీనిని తొలగించే విధానం కూడా అందుబాటులో లేదు.

కుకుర్బిట్ పాయిజనింగ్ యొక్క సంకేతాలు:

1.ఒకవేళ మీరు కుకుర్బిటాసిన్ వర్గానికి చెందిన పండ్లను కానీ, కూరగాయలను కానీ రుచి చూసినప్పుడు, అవి చేదుగా అనిపిస్తే వెంటనే తినడం ఆపివేసి నోటిని బ్రష్ చేయండి. చేదు అనేది మొదటి సంకేతం.

2.ఒకవేళ ఈ రసాయన ప్రభావానికి గురైతే, వికారం, అతిసారం , వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కన్పించే అవకాశాలు ఉన్నాయి. దీనిని ముఖ్యంగా విషాహారంగా భావించవలసి ఉంటుంది. ఈ విష రసాయనాలు శరీరం లోని రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుంది. తద్వారా మనిషి నీరసానికి గురవడం పరిపాటి.

3.శరీరంలో ని వెంట్రుకలు వచ్చే ప్రతి చోటా దీని ప్రభావం ఉంటుంది. తద్వారా, శరీరం మొత్తం వెంట్రుకలు రాలడం కనిపిస్తుంది . మరలా 4-6 నెలల తర్వాత తిరిగి వెంట్రుకలు రావడం జరుగుతుంది.

ముందు జాగ్రత్త:

రైతులు పండించిన లేదా , ఒకరి పర్యవేక్షణలో పెరిగిన పండ్లు, కాయగూరలలో సమస్యలు పెద్దగా ఉండవు. కానీ అడవుల్లో లేదా ఎక్కడపడితే అక్కడ పెరిగే పండ్లు మరియు కాయగూరలకు ఒకరి పర్యవేక్షణ ఉండే అవకాశమే లేదు. కావున అడవుల్లో దొరికే పండ్లను తొందరపడి తినరాదు. రైతులు పండించే వాటిలో చేదు తత్వాలు లేని పండ్లనే మార్కెట్ కి పంపిస్తారు. చేదుగా ఉండే పండ్లను ఎవరూ తినరు కాబట్టి. కావున కుకుర్బిటాసిన్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ అడవుల్లో దొరికే పండ్ల గురించి ఎవరు చెప్పగలరు.

రైతుల పర్యవేక్షణ లేని పండ్లలో జాగ్రత్త లేని కారణంగా ఎక్కువ మోతాదులో కుకుర్బిటాసిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి అని భావించేవారు లేదా ఈ సమస్య మీ దగ్గరలో కనిపిస్తుందని మీ మనసుకు తోచినప్పుడు, ఈ కుకుర్బిటాసీ తెగకు చెందిన వాటన్నిటికీ పూర్తిగా దూరంగా ఉండడమే మంచిది. కానీ రెండవది ఎప్పటికీ పరిష్కారం కాదు కదా. కావున మొదటి పద్దతే సరైనది. కానీ మంచి దానికి విషపూరితమైన వాటికి తేడాలు కనుక్కోవడం ఇప్పటికీ సాధ్యపడడం లేదు.

కానీ ఈ వ్యాధికి ఎటువంటి వైద్యం తీసుకున్నారో మాత్రం ప్రశ్నార్ధకంగానే ఉంది. దీనికి కారణం ఎటువంటి ఆధారాలు బయట ప్రపంచానికి దొరకకపోవడమే. మరియు వారి జుట్టు 6 నెలల వ్యవధిలో మరలా పెరగడం ప్రారంభించింది.

కావున ఈ కుకుర్బిట్ పాయిజనింగ్ అనేది అరుదుగా వచ్చే సమస్య గా చెప్పబడినది. మరియు దీని మీద ప్రయోగాలు కూడా అంత స్థాయిలో జరగలేదు. కొన్ని అనుమానిత నివేదికలు తప్ప ఆధారాలు కూడా అంతంత మాత్రమే. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు ప్రభావాల కారణం వలన కూడా బాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదల ఉంటుంది. కావున పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్త తప్పని సరి.

ఇదొక్కటే కాదు, ఏ పదార్ధాలైనా కొనేటప్పుడు తాజాగా ఉన్నవాటినే ఎంచుకోండి. నిలువ ఉంచిన పండ్లు కాయగూరల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అన్నిటా ఆరోగ్యమే ముఖ్యం,ఆ ఆరోగ్యాన్ని అజాగ్రత్తతో నాశనం చేసుకోవడం మంచిది కాదు.

English summary

Cucurbit Poisoning: Causes, Symptoms And Prevention Of The Rare Condition

Two women lately suffered from cucurbit poisoning and lost all the hair on their body as well as the scalp. Cucurbit poisoning or toxic squash syndrome is caused when someone consumes bitter squash. Presence of a chemical called cucurbitacin in fruits and veggies gives them a bitter taste, presence of this chemical in excess harms cells in humans.
Story first published:Saturday, April 14, 2018, 16:40 [IST]
Desktop Bottom Promotion