For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పి వస్తుందా? ఇలా చేస్తే ఇంకెప్పుడూ రాదు

|

ఒత్తిడితో కూడిన ప్రస్తుత జీవన శైలి దృష్ట్యా, ఒత్తిడి & టెన్షన్ల వంటి వాటిని ఎదుర్కొనేటప్పుడు మనకు తరచుగా తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి అనేది మీ శరీరము ఏదో కోల్పోయినట్లుగా సూచిస్తుంది. పోషకాహార లోపము, తగినంత నీరును తాగకపోవటం వంటి ఇతర పరిస్థితులవల్ల మీకు ఈ తలనొప్పి ఏర్పడుతుంది. ఇలా ఎదురయ్యే తలనొప్పులలో మైగ్రేన్ అనేది మరొక తలనొప్పి. ఈ వ్యాసం ద్వారా మైగ్రేన్ తలనొప్పిని ఏవిధంగా నియంత్రించాలో మనము పూర్తిగా తెలుసుకుందాం.

ఒక్కసారి ప్రారంభమైన ఈ మైగ్రేన్ తలనొప్పి కొన్ని గంటల వరకూ, కొన్నిరోజుల వరకూ (లేదా) కొన్ని నెలల వరకు సంభవించేవిగా ఉంటాయి. ఈ మైగ్రేన్ తో బాధపడేవారు వికారం, వాంతులు, ఆకలి మందగించడం, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి ఇతర లక్షణాలను కలిగి ఉంటారు.

మైగ్రేన్ మాత్రమే కాకుండా ఇతర రకాల తలనొప్పులు కూడా ఉన్నాయి :-

టెన్షన్తో వచ్చే తలనొప్పి అనేది అత్యంత సాధారణమైనది. దీనినే ఒత్తిడితో కూడిన తలనొప్పి, రోజువారీగా సంభవించే దీర్ఘకాల తలనొప్పి (లేదా) దీర్ఘకాలికంగా ఉండే అప్రయోజకమైన తలనొప్పిగా కూడా పిలుస్తారు.

సైనస్ అనే తలనొప్పి ముఖ్యంగా మీ నుదురు, బుగ్గలు, ముక్కు వంటి భాగాలను తీవ్రమైన నొప్పిని కలుగజేసే లక్షణాలతో నిండి ఉంటుంది. ఈ సైనస్ అనేది జ్వరం, ముక్కు నుంచి నీరు కారటం, చెవులలో భారం, ముఖము వాపుకు గురవటం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

క్లస్టర్ తలనొప్పి అనేది చాలా తీవ్రమైన తలనొప్పి. ఈ నొప్పి కారణంగా మీ కంటి వెనుక భాగంలో మంటలు కలుగుతున్నట్లుగా భావనను కలిగి ఉంటారు. ఈ మైగ్రేన్ తలనొప్పిని ఏవిధంగా నియంత్రించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం !

1. గ్లూటెన్-ఫ్రీ డైట్ :-

1. గ్లూటెన్-ఫ్రీ డైట్ :-

గ్లూటెన్ కారణంగా సున్నితమైన వ్యక్తులు & గ్లూటెన్ ఆహార పదార్థాలు తినే వ్యక్తులు మైగ్రేన్ తలనొప్పి కారణంగా ఎక్కువగా బాధపడతారు. అందుకోసం మీరు 3 వారాలపాటు మీ ఆహారంలో గ్లూటెన్ను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించాలి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ సెలియక్ అవేర్నెస్ ప్రకారం, మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారు తీసుకునే ఆహారం నుంచి గ్లూటెన్ను మినహాయించడం వల్ల, మీకు మైగ్రేన్ తలనొప్పి నుంచి సత్వరమే ఉపశమనం కలుగుతుంది.

2. మెగ్నీషియం :-

2. మెగ్నీషియం :-

శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉండటంవల్ల కూడా ఈ పార్శ్వపు నొప్పులు ఎదురవడానికి కారణమవుతాయి. మరి కొన్ని అధ్యయనాలు, మెగ్నీషియంను తక్కువ స్థాయిలో కలిగి ఉన్న వ్యక్తులలో పార్శ్వపు నొప్పి తీవ్రతను తగ్గించవచ్చని సూచించాయి. చాలామంది వ్యక్తులు మధుమేహం, గుండె జబ్బులు (లేదా) తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారు. మైగ్రేన్ల తీవ్రతను తగ్గించడానికి రోజుకు 200 - 600 mg మెగ్నీషియంను తీసుకోండి.

3. హెర్బ్స్ :-

3. హెర్బ్స్ :-

ఫీవర్ఫ్యూ & బట్టర్బెర్ అనేవి సహజంగానే ఒత్తిడిని సడలించే అపూర్వమైన హెర్బ్స్ (మూలికలు). ఫీవర్ఫ్యూ అనే హెర్బ్ను ఉపయోగించడం వల్ల తలనొప్పి, వికారం, వాంతులు, తలపైన సున్నితమైన పోటు వంటి మైగ్రేన్ల లక్షణాల తీవ్రతను తగ్గిస్తుందని అధ్యయనం చేసిన కొన్ని పరిశోధనలో పేర్కొంది. మరొక వైపు, బట్టర్బెర్ అనేది హెర్బ్, తలనొప్పికి కారణమయ్యే రసాయనాల శోథ ప్రభావ తీవ్రతను తగ్గిస్తుంది.

4. హైడ్రేషన్ :-

4. హైడ్రేషన్ :-

మీ శరీరం డీహైడ్రేషన్కు గురైనప్పుడు, అది కూడా మైగ్రెయిన్ను ప్రేరేపిస్తుంది. తగినంత నీరును తాగకపోవటం, ఎక్కువగా కాఫీలను & చక్కెర పానీయాలను & మద్యమును తాగడం వల్ల అవి మీ శరీరాన్ని కచ్చితంగా డీహైడ్రేషన్కు గురిచేయగలవు. మీరు మీ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడం కోసం పుష్కలంగా పండ్లను, దోసకాయలు, సెలరీ, రాడిస్, క్యాబేజీ, గుమ్మడికాయ, కాలీఫ్లవర్, స్పినాచ్, పుచ్చకాయ మొదలైన కూరగాయల వినియోగాన్ని కలిగి ఉండటం ద్వారా మీ శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేడ్గా ఉంచవచ్చు.

5. బి కాంప్లెక్స్ విటమిన్స్ :-

5. బి కాంప్లెక్స్ విటమిన్స్ :-

B విటమిన్లు న్యూరోట్రాన్స్మిటర్లను ఏర్పరుస్తాయి, వీటిలో ఉండే సెరోటోనిన్ వంటి సమ్మేళనాలు మైగ్రేన్తో బాధపడుతున్న వ్యక్తుల్లో కనిపించవు. థియామిన్, విటమిన్ B12, ఫోలేట్, బోయోటిన్, విటమిన్ B6, పాంతోతేనిక్ ఆమ్లం, నియాసిన్, రిబోఫ్లేవిన్ వంటి సమ్మేళనాలు అన్నీ కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్లుగా ప్రసిద్ధి చెందాయి. విటమిన్లన్ని సంయుక్తంగా కలిసి మెదడు కణాలను పెంపొందిస్తూ, గుండె ఆరోగ్యమును, రోగనిరోధక వ్యవస్థ పనితీరును & శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచేవిగా పనిచేస్తాయి.

6. పెప్పర్మిట్ & లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ :-

6. పెప్పర్మిట్ & లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ :-

పెప్పర్మిట్ & లావెండర్ ఆయిల్స్ అనేవి స్వస్థత చేకూర్చే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పెప్పర్మిట్ ఆయిల్, మీ చర్మం మీద దీర్ఘకాలిక శాశ్వత శీతల ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల, నుదుటికి మెరుగైన స్థాయిలో రక్త సరఫరా పెరుగుదలను ప్రేరేపిస్తుంది. లావెండర్ ఆయిల్, మూడ్ స్టెబిలైజర్గా ఉంటూ & అది పార్శ్వపు తలనొప్పి ఉపశమనం కోసం మరింత సురక్షితంగా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ఆయిల్స్ కూడా మైగ్రేన్లను నివారించడంలో చాలా ప్రభావవంతమైన గృహ చికిత్సగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

7. కటినమైన వ్యాయామాలు :-

7. కటినమైన వ్యాయామాలు :-

ఎక్కువ సమయం ఒకే స్థితిలో ఉండటం వల్ల మీ శరీరము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది తద్వారా అది తలనొప్పి లక్షణాలను సృష్టిస్తుంది. దానికి బదులుగా, మీ శరీరమును ఒక స్థిరమైన స్థానంలో వంచడానికి బదులుగా కదిలించటానికి ప్రయత్నిస్తే మరింత ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రతి 30-60 నిమిషాలకొకసారి విరామంగా తీసుకుంటూ, మీ తలని క్లాక్వైజ్ గా - యాంటీ క్లాక్వైజ్ గా కదిలించండి. ఇలా చేయడంవల్ల మీకు ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

8. కాయెన్నె పెప్పర్ (కారపుపొడి) :-

8. కాయెన్నె పెప్పర్ (కారపుపొడి) :-

మీరు కారపుపొడిని ఉపయోగించడంవల్ల, మీ శరీర రక్త ప్రసరణను ప్రేరేపించి, అది మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి ఇది ఒక మంచి గృహ చికిత్సగా ఉందని మీకు తెలుసా ? ఇది కాయెన్నె పెప్పర్లో ఉన్న "క్యాప్సైసిన్" సమ్మేళనం కారణంగా నొప్పి & వాపు వంటి చికిత్సల ఉపశమనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పెప్పర్ ఎక్కువగా మసాలాగా వాడబడుతున్నప్పటికీ, ఇది కేవలం ఆహారాన్ని సువాసనా భరితంగా చేయగలదు.

9. హాట్ / కోల్డ్తో ఉపశమనం కలిగించడం :-

9. హాట్ / కోల్డ్తో ఉపశమనం కలిగించడం :-

హాట్ & కోల్డ్ అనే ఈ రెండూ మీ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కొంతమంది వేడితోనూ, మరి కొందరు చల్లదనంతో ను మైగ్రేన్ తలనొప్పిని కుదించుటకు ఇష్టపడతారు. మీరు వేడి నీటితో స్నానం చేయడంవల్ల కూడా సహజంగానే మైగ్రేన్ తలనొప్పిని చికిత్స చేయవచ్చు.

10. డిటాక్స్ బాత్ :-

10. డిటాక్స్ బాత్ :-

ఈ డిటాక్స్ బాత్ అనేది మీ శరీరాన్ని శుభ్రపర్చడానికే కాకుండా, మీ శరీరం నుంచి విష వ్యర్ధాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు బేకింగ్ సోడా, ఆపిల్ సైడర్ వినెగార్ వంటి ముఖ్యమైన ఆయిల్స్ను మీ స్నానపు నీటిలో జోడించి ఉపయోగించవచ్చు. ఆపిల్ సైడర్ వినెగార్ అనేది యూరిక్ యాసిడ్ను బయటకు తరలించడంలో సహాయపడుతుంది, అలాగే ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు & తలనొప్పుల నుంచి మీకు ఉపశమనాన్ని అందిస్తుంది.

English summary

Home Remedies To Treat Migraine Headache

You are all aware of the nagging pain of migraine headache that can pierce right through you, isn't it? Those who are under the spell of migraine headaches will face a hard time coping up with the pain that bites into their skin.Fortunately, things like changing your diet and your lifestyle can actually take care of this pesky headache.
Story first published: Monday, June 4, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more