For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దగ్గునుంచి ఉపశమనమందించే టర్మరిక్ మిల్క్ ను తయారుచేయడమెలా + టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

దగ్గునుంచి ఉపశమనమందించే టర్మరిక్ మిల్క్ ను తయారుచేయడమెలా + టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

|

అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం వంటింట్లోనే దాగుంటుంది. మనం కాస్త శ్రద్ధ పెడితే ఈ విషయం స్పష్టమవుతుంది. దగ్గు నుంచి ఉపశమనం అందించేందుకు అనేక వంట ఇంటి పదార్థాలు ఉపయోగకరంగా ఉంటాయి. వాటిలో, పసుపు అనేది ముఖ్య స్థానాన్ని పొందుతుంది. పాలలో పసుపును జోడించి తీసుకోవడం ద్వారా దగ్గు జలుబుల నుంచి ఉపశమనం అందుతుంది. అంతేకాక ఇది ఆర్తరైటిస్ వంటి సమస్యలకు కూడా పరిష్కారంగా పనిచేస్తుంది.

టర్మరిక్ మిల్క్ టేస్ట్ అనేది కాస్తంత వెగటుగా అనిపించవచ్చు. కానీ, దీని ద్వారా దగ్గునుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గును కేవలం కొద్ది రోజులలోనే తగ్గించేందుకు ఈ రెమెడీ తోడ్పడుతుంది. పూర్వీకుల దగ్గర నుంచి ఈ రెమెడీ ప్రాచుర్యంలో ఉంది.


ఈ ఆర్టికల్ లో దగ్గు నుంచి ఉపశమనాన్ని అందించే టర్మరిక్ మిల్క్ రెసిపీను వివరించాము.

కావలసిన పదార్థాలు:

కావలసిన పదార్థాలు:

1 కప్పుడు పాలు

అర టీస్పూన్ టర్మరిక్ పౌడర్

1 టీస్పూన్ తేనె

ఈ పదార్థం తయారీకి పట్టే సమయం : 5 నిముషాలు

సెర్వ్స్ - 1

స్టెప్ 1: పాలు + తేనె

స్టెప్ 1: పాలు + తేనె

ఒక సాస్ ప్యాన్ ను తీసుకోండి. దాన్ని మీడియం ఫ్లేమ్ లో హీట్ చేయండి. ఇప్పుడు అందులోకి పాలను జోడించండి. ఆ తరువాత ఒక టీస్పూన్ తేనెను జోడించి బాగా కలపండి.

స్టెప్ 2: టర్మరిక్ ను జోడించండి

స్టెప్ 2: టర్మరిక్ ను జోడించండి

ఇప్పుడు అర టీస్పూన్ టర్మరిక్ పౌడర్ ను పాలకి జోడించండి. ఈ పాలు గోల్డెన్ ఎల్లో కలర్ లోకి మారేవరకు బాగా కలపండి.

స్టెప్ 3: మరిగించండి

స్టెప్ 3: మరిగించండి

ఈ మిశ్రమాన్ని బాగా మరిగించండి. ఆ తరువాత సిమ్మర్ లో ప్యాన్ పై మరో మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉంచండి.

స్టెప్ 4: వేడిగా తీసుకోండి

స్టెప్ 4: వేడిగా తీసుకోండి

ఈ టర్మరిక్ మిల్క్ ను ఒక కప్ లోకి తీసుకోండి. కొద్ధి సేపు చల్లారనివ్వండి. నోరు కాలేటంతటి వేడిని తీసుకోకూడదు. సాధారణ వేడిగా మారాక దీన్ని తీసుకోవాలి. ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

అదనపు సూచన: మూడురోజుల పాటు రోజుకు రెండు సార్లు ఈ టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన ఉత్తమ ఫలితాలను గమనించగలుగుతారు.

టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రాచీన కాలం నుంచి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించే సామర్థ్యం టర్మరిక్ మిల్క్ కు ఉన్నదని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూ వస్తోంది. సైన్స్ ద్వారా నిరూపితమైన ఈ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. దగ్గు మరియు జలుబుల నుంచి ఉపశమనం ;

టర్మరిక్ లో యాంటీ మైక్రోబయాల్ మరియు యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇందులో లభించే కుర్కుమిన్ అనే పదార్థం అనేది టర్మరిక్ లోని ఔషధగుణాలకు మూలం. ఈ విషయాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేసాయి.

నిజానికి, ఇండియాలో టర్మరిక్ మిల్క్ అనేది దగ్గుకు విరివిగా వాడే వంటింటి చిట్కా. ఎందుకంటే, ఈ డ్రింక్ కి మ్యూకస్ ప్రొడక్షన్ ను తగ్గించే సామర్థ్యం కలదు. అలాగే టాక్సిన్స్ ను మైక్రోబ్స్ ను రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి తొలగించే గుణం కలదు. తద్వారా జలుబు దగ్గులను అదుపు చేయగలుగుతుంది.

2. జనరల్ ఇమ్యూనిటీను పెంపొందిస్తుంది:

2. జనరల్ ఇమ్యూనిటీను పెంపొందిస్తుంది:

ప్రతి రోజూ ఖాళీ కడుపున ఒక వెచ్చటి కప్పుడు టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి అనేది మెరుగవుతుంది. ముఖ్యంగా మీరు స్విమ్మర్ అయినా, రోజూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడే వారైనా అనేక రకాల వ్యాధులను కలిగించే బాక్టీరియా, వైరస్ మరియు మైక్రోబ్స్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి, అలాంటివారికి ఈ మిల్క్ అనేది మరింత ఉపయోగం.

3. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది- పేగుపురుగులను తగ్గిస్తుంది

3. జీర్ణ క్రియను పెంపొందిస్తుంది- పేగుపురుగులను తగ్గిస్తుంది

బ్లోటింగ్, అపానవాయువు మరియు హార్ట్ బర్న్ వంటి సింపుల్ డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ నుంచి ప్రేగు పురుగుల వంటి కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ ను తగ్గించేందుకు టర్మరిక్ మిల్క్ తోడ్పడుతుంది. గ్యాస్ట్రోఇంటస్టినల్ ట్రాక్ట్ ను మెరుగుపరిచేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది.

4. లివర్ మరియు బ్లడ్ నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

4. లివర్ మరియు బ్లడ్ నుంచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

టర్మరిక్ లో లభించే మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి లివర్ సామర్థ్యాన్ని పెంచుతాయి. లివర్ లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించి ఆల్కహాల్ వలన అలాగే మెడిసిన్స్ ని వాడడం వలన ఏర్పడిన లివర్ డేమేజ్ ను తగ్గిస్తుంది. దీని వలన రక్తం శుద్ధి అవుతుంది.

5. ఏజింగ్ ను అరికట్టడంతో పాటు స్కిన్ కండిషన్ ను మెరుగుపరుస్తుంది

5. ఏజింగ్ ను అరికట్టడంతో పాటు స్కిన్ కండిషన్ ను మెరుగుపరుస్తుంది

టర్మరిక్ లో లభ్యమయ్యే కుర్కుమిన్ అనే యాక్టివ్ మెడికల్ కాంపౌండ్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లా వ్యవహరిస్తోంది. అందువలన, ఏజింగ్ సైన్స్ ను అరికట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఫైన్ లైన్స్, ముడతలు, లివర్ స్పాట్స్, స్కిన్ ట్యాగ్స్ మరియు యాక్నే వంటివి తగ్గుముఖం పడతాయి.

6. ఆటో ఇమ్మ్యూన్ డిసీజ్ లపై పోరాడుతుంది:

6. ఆటో ఇమ్మ్యూన్ డిసీజ్ లపై పోరాడుతుంది:

ర్యుమటాయిడ్ ఆర్తరైటిస్ మరియు ఎగ్జిమా వంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ లనేవి శరీరం యొక్క రోగనిరోధక శక్తి వలెనే సాధారణంగా ఎదురవుతాయి. టర్మరిక్ మిల్క్ ను తాగడం వలన ఈ ఇబ్బందులు తొలగిపోతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచే సామర్థ్యం టర్మరిక్ లో ఉంది. అందువలన, శరీరంపై అటాక్స్ ని తగ్గిస్తుంది.

7. సైనసైటిస్ తలనొప్పిని తగ్గిస్తుంది :

7. సైనసైటిస్ తలనొప్పిని తగ్గిస్తుంది :

సైనసైటిస్ సమస్య ద్వారా ఎదురయ్యే తలనొప్పిని తగ్గించేందుకు టర్మరిక్ మిల్క్ అమితంగా తోడ్పడుతుంది. సైనసైటీస్ వలన ఎదురయ్యే ఫ్లూ వంటి లక్షణాలను తగ్గిస్తుంది. టర్మరిక్ మిల్క్ అనేది సైనసైటిస్ తలనొప్పిని తగ్గించేందుకు అద్భుతమైన రెమెడీ. కుర్కుమిన్ అనేది సైనసైటిస్ సమస్యను తగ్గించేందుకు సహాయకారిగా ఉంటుంది. అందువలన, టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం వలన అయి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

8. మంచి నిద్రను అందిస్తుంది:

8. మంచి నిద్రను అందిస్తుంది:

నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి టర్మరిక్ మిల్క్ అనేది అద్భుతమైన పరిష్కారంగా వ్యవహరిస్తుంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్స్ అయిన సెరోటోనిన్ మరియు మెలటోనిన్ ను ఉత్పత్తి చేసేందుకు తోడ్పడుతుంది.

9. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది:

9. స్త్రీలలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది:

గర్భం దాల్చాలనుకునే మహిళలు టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం ద్వారా వారిలో ఫెర్టిలిటీ అనేది మెరుగవుతుంది. అంతేకాక, ఇది మెన్స్ట్రువల్ పెయిన్ ను తగ్గించేందుకు కూడా తోడ్పడుతుంది.

అయితే, గర్భం దాల్చిన తరువాత మాత్రం టర్మరిక్ మిల్క్ ను అవాయిడ్ చేయడం మంచిది. లేదంటే, గర్భస్రావం జరిగే ప్రమాదం తలెత్తవచ్చు.

10. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగినది:

10. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగినది:

అనేక అధ్యయనాలు టర్మరిక్ లో దాగున్న యాంటీ క్యాన్సరస్ గుణాలను వెల్లడించాయి. ట్యూమర్ గా మారక ముందే ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం టర్మరిక్ లో కలదు. ముఖ్యంగా, కొలోన్, స్కిన్, బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ మరియు లంగ్ క్యాన్సర్స్ బారి నుంచి రక్షణ లభిస్తుంది.

క్యాన్సర్ మొదటి లేదా రెండవ స్టేజ్ లో ఉన్నవారు టర్మరిక్ మిల్క్ ను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ తీవ్రస్థాయిలో మారే ప్రమాదాన్ని కొంతవరకు అరికట్టవచ్చు.

English summary

How To Make Haldi Doodh For Cough + Health Benefits Of Turmeric Milk

It's the season of joy and cheer, and the season of cold and cough. So stack up your defenses against the microbes in the air with this simple and easy recipe of turmeric milk. Just remember: best results are observed only when this drink is consumed twice a day for three days.
Desktop Bottom Promotion