గర్భాశయ ఇన్ఫెక్షన్ లక్షణాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

గర్భాశయ ఇన్ఫెక్షన్ ను ఎండోమెట్రైటిస్ అని కూడా అంటారు. ఇది గర్భాశయ గోడలపై వచ్చే వాపు లేదా మంట వలన కలుగుతుంది. ఈ గర్భాశయ గోడపై పొరను శాస్త్రీయంగా ఎండోమెట్రియం అంటారు.

ఎండ్రోమెట్రైటిస్ గర్భాశయం లేదా ఎండోమెట్రియంకి వచ్చే ఇన్ఫెక్షన్ వలన కలుగుతుంది. ఇది అనేక రకాల లైంగిక వ్యాధులు అనగా క్లమైడియా, గనేరియా వంటివి లేదా వివిధ వెజైనా ఇన్ఫెక్షన్లు మరియు క్షయ వంటి వాటి వలన వస్తుంది.

symptoms of uterus infection

ఇది సాధారణం అప్పుడే జన్మనిచ్చిన తల్లుల్లో లేదా గర్భస్రావం అయిన వారిలో కన్పిస్తుంది. ఎండోమెట్రైటిస్ వచ్చే రిస్క్ పెల్విస్ ప్రొసీజర్ జరిగిన వెంటనే ఎక్కువగా పెరుగుతుంది.

మీకు సహజ ప్రసవం కన్నా సిజేరియన్ జరిగినా దీని రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఎండోమెట్రైటిస్ యొక్క కొన్ని లక్షణాలు ఇవిగోః

#1 కడుపు వాచటం

#1 కడుపు వాచటం

ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్ కు మొదటి లక్షణం. కడుపు వాచిపోయి, అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది. నొప్పికి ప్రత్యేక కారణం లేనప్పుడు, మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

#2 అసాధారణ వెజైనల్ రక్తస్రావం

#2 అసాధారణ వెజైనల్ రక్తస్రావం

వెజైనా నుంచి రక్తస్రావం మీ గర్భాశయంలో ఏదో తప్పు జరిగిందనటానికి పెద్ద గుర్తు. పీరియడ్స్ సమయంలో, గర్భాశయ గోడ చిరిగి రక్తం స్రవించడం సాధారణమే;కానీ ఇతర రోజుల్లో మీ యోని నుండి స్రావం జరుగుతున్న లక్షణాలు కన్పిస్తే అది గర్భాశయ ఇన్ఫెక్షన్ వలన కావచ్చు.

#3 అసాధారణ వెజైనల్ డిశ్చార్జి

#3 అసాధారణ వెజైనల్ డిశ్చార్జి

అసాధారణ, పసుపురంగులో వెజైనల్ డిశ్చార్జి, ఘాటైన వాసన లోపలేదో ఇన్ఫెక్షన్ ఉందనటానికి సూచన. మీరు అది సాధారణ ఈస్ట్ ఇన్ఫెక్షనో లేదా తీవ్రమైన అనారోగ్యానికి కారణమో పరీక్ష చేయించుకుని తెలుసుకోవచ్చు.

#4 మలబద్ధకం

#4 మలబద్ధకం

మీరు ఆరోగ్యకరమైన డైట్ పాటిస్తున్నా మలబద్ధకంగా ఉంటే, మీ శరీరం లోపల ఆహారం జీర్ణమవటానికి సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. ఇది గర్భాశయ ఇన్ఫెక్షన్ కి సూచన కావచ్చు.

#5 ఎక్కువ జ్వరం

#5 ఎక్కువ జ్వరం

ఏ కారణం లేకుండా అధిక జ్వరం ఉంటే అది కూడా మీ శరీరం ఇస్తున్న వార్నింగ్ గుర్తు కావచ్చు. జ్వరం మన శరీరం ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములతో పోరాడటానికి ప్రయత్నించినప్పుడు వస్తుంది.

#6 సాధారణంగా కూడా ఒంట్లో బాలేకపోవటం

#6 సాధారణంగా కూడా ఒంట్లో బాలేకపోవటం

మీకు అన్ని సమయాలలోనూ అలసటగా, బలహీనంగా అన్పిస్తుంది. మీరు ఇన్ఫెక్షన్ వలన అసౌకర్యంగా ఉండటం వలన ఎవరితో హాయిగా ఎంజాయ్ కూడా చేయలేరు. మీ శరీరం మెల్లగా బలహీనంగా అన్పిస్తుంది ఎందుకంటే లోపల మంచి మరియు చెడు బ్యాక్టీరియా మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

#7 టాయిలెట్ కు వెళ్ళినపుడు అసౌకర్యం

#7 టాయిలెట్ కు వెళ్ళినపుడు అసౌకర్యం

ప్రేగుల కదలిక టాయిలెట్ కి వెళ్ళినపుడు మలాన్ని బయటకి పంపడానికి జరిగే కదలిక. ఇన్ఫెక్షన్ బాగా పెరిగి గర్భాశయ కణాలు లోపలనుండి పెరిగిపోవటం మొదలుపెడితే ఇది చాలా అసౌకర్యంగా, నొప్పిగా ఉంటుంది

#8 బిడ్డకి జన్మనివ్వటంతో ఎండోమెట్రైటిస్

#8 బిడ్డకి జన్మనివ్వటంతో ఎండోమెట్రైటిస్

అప్పుడే జన్మనిచ్చిన తల్లులు సాధారణంగా 24 గంటల తర్వాత ఇన్ఫెక్షన్ కి గురైనట్టు గుర్తించబడతారు. నొప్పి మరియు జ్వరం సాధారణ లక్షణాలు. మూత్రానికి వెళ్ళేటప్పుడు నొప్పి కూడా చాలా సాధారణ లక్షణం. దీంతో పాటుగా వెజైనా నుండి భరించలేని వాసనతో రక్తస్రావం కూడా జరుగుతుంది.

#9 సెప్టిక్ షాక్

#9 సెప్టిక్ షాక్

గర్భాశయ ఇన్ఫెక్షన్ మరియు సెప్టిక్ షాక్ ఒకదానితో ఒకటి కలిసే వస్తాయి. గర్భాశయ ఇన్ఫెక్షన్ ను చికిత్స చేయకుండా వదిలేస్తే, వివిధ సమస్యలకి దారితీసి, ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.ఇవి చాలా ప్రాణాంతకంగా మారతాయి. సెప్టిక్ షాక్స్ కూడా లోపలి గర్భాశయ ఇన్ఫెక్షన్ ను సూచిస్తాయి. లక్షణాలు ముఖం పాలిపోవడం, తలంతా తేలిపోతూ ఉండటం, అయోమయం వంటివి.

#10 నొప్పితో కూడిన సెక్స్

#10 నొప్పితో కూడిన సెక్స్

గర్భాశయ ఇన్ఫెక్షన్ ఉన్న స్త్రీలు సాధారణంగా సెక్స్ సమయంలో నొప్పి వస్తుందని తెలుపుతారు. కొంతమంది స్త్రీలు సాయం కోసం డాక్టర్ దగ్గరకి వెళ్తే, కొంతమంది దీన్ని వివరించటానికి సిగ్గుపడి వెళ్ళరు. అవసరమైనప్పుడు వైద్యసాయం తీసుకోడం చాలా మంచిది.

ఇన్ఫెక్షన్ ఆరంభ దశల్లోనే కనుగొనటం చాలా ముఖం, దాని వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా పాకకుండా ఉంటుంది. తమ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఆడవారు సిగ్గుపడకూడదు లేకపోతే ఇతర అవయవాలకు కూడా ఈ సమస్యలు పాకుతాయి. ఎండోమెట్రైటిస్ ను సాధారణంగా యాంటీబయాటిక్స్ తో చికిత్స చేస్తారు.

అలాగే ఆ వ్యక్తికి ఇతర లైంగిక వ్యాధులు ఉన్నాయో లేదో తెలుసుకోటానికి ఇతర పరీక్షలు కూడా చేస్తారు. తరచుగా తన భాగస్వామిని కూడా పరీక్షిస్తారు, దాని ద్వారా వారు సురక్షిత శారీరక బంధాన్ని కొనసాగించే వీలు ఉంటుంది. డాక్టర్ సూచించిన మందులన్నీ సమయానికి వాడి దానికి పూర్తిగా చికిత్స తీసుకోవడం మంచిది.

English summary

Symptoms Of Uterus Infection

These are the symptoms of uterus infection and one should seek proper medical help before self-diagnosis and take proper medicines to get rid of the infection.
Subscribe Newsletter