For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైరల్ ఫీవర్ పై పోరాడి ఉపశమనాన్ని కలిగించేందుకు తోడ్పడే పది హోమ్ రెమెడీస్ ఇవే

వైరల్ ఫీవర్ పై పోరాడి ఉపశమనాన్ని కలిగించేందుకు తోడ్పడే పది హోమ్ రెమెడీస్ ఇవే

|

అనేక వైరల్ ఇన్ఫెక్షన్స్ సమూహం అనేది శరీరంపై ప్రభావం చూపడం వలన వైరల్ ఫీవర్ సమస్య తలెత్తుతుంది. వైరల్ ఫీవర్ కి గురయినప్పుడు హై ఫీవర్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కళ్ళల్లో మంటలు, వాంతులు అలాగే వికారం సమస్యలు వేధిస్తాయి. కొన్ని సందర్భాలలో, ఈ వైరల్ ఫీవర్ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ప్రభావవంతమైన హోమ్ రెమెడీస్ తోడ్పడతాయి. ఆ రెమెడీస్ గురించి ఇప్పుడు చర్చిద్దాం.

పిల్లల్లో అలాగే పెద్దల్లో వైరల్ ఫీవర్ అనేది సర్వసాధారణమైపోయింది. శ్వాసకోశకు, లంగ్స్ కు, పెద్దప్రేగుకు గాని లేదా శరీరంలోని ఏదైనా భాగానికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే వైరల్ ఫీవర్ సమస్య తలెత్తుతుంది. వైరస్ లపై శరీరంలోని ఇమ్మ్యూన్ సిస్టమ్ పోరాటం సాగించే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. హై టెంపరేచర్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ను సూచిస్తుంది.

These Are 10 Home Remedies For Viral Fever That Actually Work

ఈ వైరల్ ఫీవర్ సాదరణంగా ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సోకుతుంది. వైరల్ ఫీవర్ కి గురయిన వ్యక్తి యొక్క శరీరం నుంచి వెలువడిన ద్రవాలతో మరొక వ్యక్తి కాంటాక్ట్ కి గురయినప్పుడు వైరస్ సోకుతుంది. ఇది ఇన్ఫెక్షన్ గా మారడానికి దాదాపు 16 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది.

వణుకు, తలనొప్పి, బలహీనత, ఒళ్ళు నొప్పులు, రన్నింగ్ నోస్ వంటివి వైరల్ ఫీవర్ కి చెందిన కొన్ని లక్షణాలు.

కాబట్టి, ఈ సమస్య నుంచి ఉపశమనం లభించేందుకు తోడ్పడే కొన్ని ప్రభావవంతమైన హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ధనియాలు:

1. ధనియాలు:

ధనియాలలో ఎసెన్షియల్ విటమిన్స్ తో పాటు ఫైటో న్యూట్రియెంట్స్ లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరిచేందుకు తోడ్పడతాయి. ధనియాలలో యాంటీ బయోటిక్ కాంపౌండ్స్ లభ్యమవుతాయి. అలాగే కొన్ని ప్రత్యేక సామర్థ్యంగల నూనెలు కూడా లభిస్తాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ ను రూపుమాపడానికి తోడ్పడతాయి. ఈ హోమ్ రెమెడీను పాటించి వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం పొందండి. తక్షణ ఫలితాన్ని పొందండి.

ఒక కప్పుడు ధనియాల టీను తయారు చేయండి. లేదా ధనియాల నీటి మిశ్రమాన్ని తయారుచేయండి. వీటిని తీసుకోవడం వలన వైరల్ ఫీవర్ వలన కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. అల్లం మరియు తేనే:

2. అల్లం మరియు తేనే:

అల్లంలో యాంటీ ఇంఫ్లేమేటరీ, అనాల్జేసిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు కలవు. ఇవి వైరల్ ఫీవర్ లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలిగించేందుకు శక్తివంతంగా పనిచేస్తాయి. తేనెలో లభించే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీలు శరీరంలో పొంచి ఉన్న హానికర బాక్టీరియాను నశింపచేస్తాయి. ఎండిన అల్లాన్ని కొంత తేనెతో కలిపి తీసుకుంటే వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. తులసి ఆకులు:

3. తులసి ఆకులు:

తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ బయోటిక్, జెర్మీసైడల్ మరియు ఫంగైసైడల్ ప్రాపర్టీలు కలవు. ఇవన్నీ వైరల్ ఫీవర్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

కొన్ని తులసి ఆకులను శుభ్రమైన నీటిలో మరగబెట్టండి.

అర టీస్పూన్ లవంగాల పొడిని ఇందులో జోడించండి. లేదా లవంగాలను కూడా ఈ నీటిలో జోడించండి.

ఈ నీరు సగానికి చేరేవరకు మరిగించండి.

ఈ సొల్యూషన్ ను క్రమం తప్పకుండా తాగుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడవచ్చు.

4. మెంతి నీళ్లు:

4. మెంతి నీళ్లు:

మెంతులలో డయోసజనిన్, ఆల్కలాయిడ్స్ మరియు సపోనిన్స్ వంటి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. మెంతులలో వైరల్ ఫీవర్ తో పాటు ఇతర లక్షణాలతో పోరాడే శక్తివంతమైన మెడిసినల్ ప్రాపర్టీలు కలవు.

ఒక టేబుల్ స్పూన్ మెంతులను కప్పుడు నీటిలో రాత్రంతా నానబెట్టండి.

ఆ నీటిని మరుసటి ఉదయాన్నే వడగట్టి తాగండి.

ఈ నీటి ప్రభావం పెరిగేందుకు అర నిమ్మ చెక్క నుంచి సేకరించబడిన నిమ్మరసాన్ని గాని లేదా తేనెను గాని ఈ నీటిలో జోడించవచ్చు.

5. దాల్చిన చెక్క:

5. దాల్చిన చెక్క:

వైరల్ ఫీవర్ నుంచి విముక్తి ఏ విధంగా లభిస్తుందోనన్న సందేహంలో ఉన్నారా? దాల్చిన చెక్క ఈ విషయంలో మీకు అత్యద్భుతంగా తోడ్పడుతుంది. ఇది నేచురల్ యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. ఇది జలుబును అలాగే దగ్గును తగ్గించి గొంతు నొప్పిని మటుమాయం చేస్తుంది.

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని అలాగే రెండు ఏలకులను ఒక కప్పుడు మరిగే నీటిలో జోడించండి.

ఐదు నిమిషాల పాటు సిమ్ లో మరిగించండి.

నీటిని వడగట్టి తాగండి.

6. వెల్లుల్లి:

6. వెల్లుల్లి:

జలుబు అలాగే ఫీవర్ కు వెల్లుల్లి అనేది ప్రభావవంతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తుంది. ఈ స్పైస్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు కలవు. ఇందులో ఉండే అలిసిన్ అనే పదార్థం వలన ఈ స్పైస్ కు ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ లభించాయి.

రెండు వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేయండి.

రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను జోడించి ఈ మిశ్రమాన్ని లో హీట్ పైన కొద్ది సేపటి వరకు వేడి చేయండి.

ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు అప్లై చేయండి.

దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రపరచుకోండి.

7. ఎండుద్రాక్ష:

7. ఎండుద్రాక్ష:

ఎండుద్రాక్షలో వైరల్ ఫీవర్ ను తరిమికొట్టే అద్భుత సామర్థ్యం దాగి ఉందన్న విషయం మీకు తెలుసా? ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఏ రకమైన ఇన్ఫెక్షన్ ని అయినా తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల ఎండుద్రాక్షలను ఒక కప్పుడు నీటిలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టండి.

ఎండుద్రాక్షను క్రష్ చేసి వడగట్టండి.

ఈ జ్యూస్ లో అరచెక్క నిమ్మ నుంచి సేకరించబడిన జ్యూస్ ను జోడించి తాగండి.

8. అల్లం:

8. అల్లం:

అల్లంలో జెర్మ్స్ తో పోరాడే ఫైటో కెమికల్ అజియోన్ లభిస్తుంది. ఇది అప్పర్ రెస్పిరేటరీ వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నయం చేసేందుకు అద్భుతంగా తోడ్పడుతుంది. ఈ స్పైస్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు అనాల్జేసిక్ ప్రాపర్టీస్ కలవు. ఇవి జలుబును, దగ్గును అలాగే ఫీవర్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

ఒక అంగుళం అల్లాన్ని పీల్ చేసి తురిమి దాన్ని గ్లాసుడు నీటిలో జోడించండి.

పదినిమిషాల పాటు సిమ్ లో ఉంచండి.

వడగట్టి, అరచెక్క నిమ్మరసం జ్యూస్ ను ఇందులో జోడించండి.

9. డిల్ సీడ్:

9. డిల్ సీడ్:

వైరల్ ఫీవర్ ను తగ్గించేందుకు డిల్ సీడ్స్ అద్భుతంగా తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరచడంతో పాటు ఇవి శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు తోడ్పడతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వీటిలో ఫ్లెవనాయిడ్స్ కలవు. ఇవి యాంటీ బయోటిక్స్ లా పనిచేసి వైరల్ ఫీవర్ నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

ఒక టీస్పూన్ డిల్ సీడ్స్ ను అలాగే ఒక టీస్పూన్ దాల్చిన చెక్కను ఒక కప్పుడు మరిగే నీటిలో జోడించండి.

ఐదు నిమిషాల పాటు బాయిల్ చేయండి.

నీటిని వడగట్టి తాగండి.

10. రైస్ స్టార్చ్:

10. రైస్ స్టార్చ్:

ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించేందుకు ప్రభావవంతంగా తోడ్పడే అత్యద్భుతమైన హోమ్ రెమెడీ. ఇది డైయూరేటిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. యురినేషన్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంపొందిస్తుంది. వైరల్ ఫీవర్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

These Are 10 Home Remedies For Viral Fever That Actually Work

Viral fever is a group of viral infections that affect the body and is characterized by high fever, headaches, body aches, burning in the eyes, vomiting, and nausea. There are home remedies for viral fever that can treat you instantly. And we will be discussing that here.
Story first published:Tuesday, July 3, 2018, 6:43 [IST]
Desktop Bottom Promotion