For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిరంతరంగా వచ్చే తుమ్మలను అరికట్టే 11 రకాల ఇంటి చిట్కాలు

|

మీరు ఒక్కసారి నిరంతరంగా తుమ్మడం మొదలుపెట్టాకా వాటిని ఆపలేక మీరు చాలా సమయాలలో చిరాకు పడి ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది మిమ్మల్ని బాధపెట్టేది కావచ్చు. కానీ ఇది ఇలా జరగడం వల్ల మీ శరీరాన్ని అలర్జీలను నుండి మరియు, చికాకులకు కలుగజేసే పరిస్థితులకు గురి కాకుండా సంరక్షించేందుకు మీకు సహాయపడే ఒక రక్షిత యంత్రాంగము వంటిది.

తుమ్ములు, బహిరంగంగా ఉన్న క్రీములు (లేదా) మరేదైనా అవాంచిత కణాల నుండి మిమ్మల్ని రక్షించేందుకు ముక్కు ద్వారా జరిగే ఒక భౌతిక చర్య. సాధారణంగా వచ్చే తుమ్ములు, మానవ శరీరంలో ఉన్న వివిధ కండరాల కదలికల వల్ల కలిగే శారీరక ధర్మ ప్రక్రియని చెప్పవచ్చు.

పొగ, దుమ్ము, ధూళి, అలర్జీలు, కలప (చెక్క) వల్ల వచ్చే పొగ, గాలిలో ఎగిరే పుప్పొడులు మరియు బాధించే (చికాకును పెట్టే) ఇతర అంశాల కారకాలు అనేవి తుమ్ములకు ప్రధాన కారణాలవుతాయి. అలాగే చల్లని వాతావరణం, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, వాడే ఔషధాలు మరియు వర్షపు నీరు వల్ల కూడా మీకు నిరంతరమైన తుమ్ములు కలగటానికి దారితీయవచ్చు.

నిరంతరంగా వచ్చే తుమ్ములు మీ ముక్కును మరియు గొంతును విసుగు చెందేలా చేస్తాయి. ఇది తీవ్రమైన సమస్య మాత్రం కాదు, కానీ తుమ్ములు మిమ్మల్ని నిరాశపరిచేలా చేస్తాయి. ఇక్కడ నిరంతరంగా వచ్చే తుమ్మలను అరికట్టే 11 రకాల ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేమిటో మీరు చదివి తెలుసుకోండి.

1. వెల్లుల్లి :

1. వెల్లుల్లి :

వెల్లుల్లిలో సహజమైన యాంటీబయోటిక్ మరియు యాంటీ వైరస్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఎక్కువ శ్వాసనాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను పోగొట్టడంలో ఇది చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. సాధారణ జలుబు కారణంగా వచ్చే తుమ్ముల నుండి ఉపశమనం పొందేందుకు, వెల్లుల్లిని బాహ్యంగా (లేదా) అంతర్గతంగా అయినా సరే ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి, సాధారణ జలుబు వలన సంభవించే తుమ్ముల నుండి ఉపశమనమును కలిగిస్తుంది. 5 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తని పేస్ట్ లా తయారు చేసి, దాని నుండి వచ్చే బలమైన వాసనను పీల్చాలి. ఇది మీ నాసిక మార్గంలో తుమ్ములకు కారణంగా ఉన్న అడ్డంకులను క్లియర్ చేయడానికి మీకు సహాయం చేస్తుంది.

2. అల్లం :

2. అల్లం :

నిరంతరంగా వచ్చే తుమ్మలను అరికట్టడంలో అల్లం అనేది మరొక ఉపయుక్తమైన ప్రభావవంతమైన పదార్ధము. ఇది పూర్వకాలం నుండి ఆచరించబడుతున్న నివారణ మార్గాలలో ఒకటి మరియు తుమ్ములతో సహా వివిధ రకాల హానికరమైన వైరస్లకు మరియు ముక్కు సమస్యల నివారణ చికిత్సగా దీనిని ఉపయోగిస్తారు.

తుమ్ములు ఆగే వరకు రోజుకు 3 సార్లు చెప్పున అల్లం రసాన్ని తీసుకోవాలి. ఒక కప్పు నీటిలో చిన్నచిన్న ముక్కలుగా చేసిన అల్లాన్ని వేసి, స్టౌ మీద పెట్టి బాగా మరగకాచాలి. అలా తయారయిన పానీయానికి కొంత తేనెను కలిపి, రాత్రి నిద్రపోయే ముందు త్రాగాలి.

3. చమోమిలే టీ :

3. చమోమిలే టీ :

నిరంతరంగా వచ్చే తుమ్ములను నివారించటంలో "చమోమిలే టీ" అనేది మరొక సమర్థవంతమైన గృహ ఔషధ చికిత్సగా చెప్పవచ్చు. అలెర్జీల వలన సంభవించే నిరంతర తుమ్ములు నుండి మిమ్మల్ని కాపాడేటందుకు అందుబాటులో వున్న ఇంటి చిట్కాలలో ఇది చాలా ఉత్తమమైన నివారిణిగా పరిగణించబడుతుంది. ఈ 'టీ' లో మీకు తక్షణ ఉపశమనమును కలిగించే అద్భుతమైన యాంటిహిస్టామైన్ అనే ప్రత్యేక లక్షణమును కలిగి ఉన్నది.

బాగా ఎండిన 1 స్పూన్ చమోమిలే పువ్వులను తీసుకొని, 1 కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. అలా తయారు కాబడిన తేనీరుకు - కొంత తేనెను వేసి త్రాగాలి. ఇలా రోజుకు 2 సార్లు త్రాగాలి.

4. ఫెన్నెల్ టీ :

4. ఫెన్నెల్ టీ :

ఫెన్నెల్ (సోపు) గింజలు, సహజ సిద్ధమైన యాంటిబయోటిక్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి ఏదైనా ఎగువ శ్వాసకోశ సంక్రమణకు వ్యతిరేకంగా ఉన్న అలర్జీలపై పోరాడగలవు. దీర్ఘకాలంగా ఉన్న తుమ్ముల సమస్యకు ఈ ఫెన్నెల్ (సోపు) గింజలు చాలా బాగా పనిచేస్తాయి.

2 టేబుల్ స్పూన్ల సోపు గింజల పొడిని ఒక కప్పు వేడి నీటిలో కలుపుకోవాలి. అలా తయారైన పానీయాన్ని వడకట్టి 10-15 నిమిషాలు వరకూ చల్లారనివ్వాలి. ఇలా తయారైన తేనీరు (టీ) ను ప్రతిరోజు 2 సార్లు త్రాగాలి.

5. తులసి ఆకులు :

5. తులసి ఆకులు :

అనేక ఆరోగ్యప్రయోజనాలను కలుగజేసేదిగా తులసి మొక్కను ఆయుర్వేదంలో పేర్కొనబడిన కారణంగా దీనిని పవిత్రమైన మొక్కగా పరిగణించబడుతుంది. తులసీలో చాలా శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది ప్రమాదకరమైన అంటురోగాల వ్యాప్తిని ఆపుతుంది. 3-4 తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ప్రతి రోజూ నిద్రించేముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి. ఇలా 2-3 రోజులు వరకూ ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

6. హనీ-లెమన్ టీ :

6. హనీ-లెమన్ టీ :

హనీ (తేనె) అనేది ముక్కులో ఉన్న బ్యాక్టీరియాతో పోరాడగలిగే యాంటీ-బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. లెమన్ (నిమ్మకాయ) లో విటమిన్-C పుష్కలంగా ఉంటుంది, తేనె మరియు నిమ్మకాయల కలయిక కారణంగా నిరంతర వచ్చే తుమ్ములను తగ్గించగలవు. ఒక టీ కప్పులో తేనె మరియు నిమ్మరసం జోడించండి. అలా తయారు అయిన మిశ్రమంలో వేడి నీటిని చేర్చి, త్రాగాలి.

7. ఒరెగానో ఆయిల్ :

7. ఒరెగానో ఆయిల్ :

ఒరెగానో ఆయిల్లో - యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పారసిటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ను కలిగి ఉండి, నిరంతరంగా వచ్చే తుమ్మలకు కారణమైన వైరస్లను మరియు బ్యాక్టీరియాలను నిరోధిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి "ఒరెగానో నూనె" చాలా కూడా అవసరం.

మీరు ఎంపిక చేసుకున్న జ్యూస్లో ఈ నూనెను 3 చుక్కలుగా వేసి కలపండి. మీ తుమ్ములు పూర్తిగా నిలిచి పోయే వరకు ప్రతిరోజూ దీనిని త్రాగండి.

8. మెంతులు :

8. మెంతులు :

నిరంతరముగా వస్తున్న తుమ్ముల నుండి ఉపశమనం కలిగించే యాంటీవైరల్ లక్షణాలను మెంతులు కలిగి ఉంటాయి. ఇది ముక్కులో మ్యూకస్ పొర మీద ఉన్న చికాకును శాంతపరచి ఉపశమనమును కలిగించేలా చేస్తుంది. 3 టీ స్పూన్ల మెంతులను నీటిలో వేసి బాగా మరిగించాలి. అలా తయారైన ఈ మిశ్రమాన్ని రోజులో 2-3 సార్లు త్రాగాలి.

9. విటమిన్-సి :

9. విటమిన్-సి :

విటమిన్-సి అనేది శరీరంలో ఉన్న హిస్టామిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, అందుకే చాలా త్వరగా తుమ్ములను నియంత్రించగలుగుతుంది. విటమిన్-సి కలిగి ఉన్న ఇతర పండ్లు నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష మొదలైనవి. ఇవి తుమ్ములను ఆపడానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ను (అనామ్లజనకాల) ను కలిగి ఉన్నాయి.

10. పెప్పర్మిట్ ఆయిల్ :

10. పెప్పర్మిట్ ఆయిల్ :

నిరంతరంగా వచ్చే తుమ్మలను నివారించడంలో పెప్పర్మిట్ ఆయిల్ అత్యంత ప్రభావవంతమైన మందులలో ఒకటి. ఈ ఆయిల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా శరీరంలో వైరస్ యొక్క పెరుగుదలను ఆపి, త్వరగా తుమ్ములను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో పిప్పరమింట్ నూనె యొక్క కొన్ని చుక్కలను కలపండి. ఈ మిశ్రమం ద్వారా బాగా ఆవిరిని పీల్చుకోండి.

11. బిట్టర్ గోర్డ్ :

11. బిట్టర్ గోర్డ్ :

మీరు దీని యొక్క చేదు రుచిని ఇష్టపడకపోవచ్చు, కానీ ఇందులో చాలా రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తుమ్ముల నివారణ చికిత్స కోసం అత్యంత ప్రభావవంతమైన గృహ చిట్కాలలో ఒకటిగా ఉంటూ, ముక్కులో చికాకుకు కారణమైన అడ్డంకులను తొలగించి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

5 బిట్టర్ గోర్డ్ (చేదుగూడి) ఆకులను వేసిన నీటిని ముంచి బాగా మరిగించాలి. అలా ఎవరైనా రసం నుండి ఆకులను తొలగించి, కాస్త చల్లార్చాలి. ఈ రసాన్ని రోజువారీ తేనెతో కలిపి త్రాగాలి.

ఈ వ్యాసాన్ని మీరు ఇష్ట పడినట్లయితే మీ మిత్రులకు షేర్ చెయ్యండి.

English summary

Top 11 Home Remedies For Continuous Sneezing

Sneezing might be annoying, but it is actually a protective mechanism that helps expel allergens and irritants out of your body. Some of the most common causes of sneezing are allergies, smoke, dust, wood dust, pollen and other such irritants. Also, cold weather, food allergies, certain drugs and rain water can also cause sneezing.
Story first published: Monday, January 8, 2018, 15:13 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more