For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

world sleep day 2020 : మీరు 8 గంటలకు పైగా నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోండి!

మీరు 8 గంటలకు పైగా నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాధాల గురించి తెలుసుకోండి!

|

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకుంటారు. అందుకు తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం అవుతుంది. మనిషికి రోజుకు సగటున కనీసం7- 8 గంటల నిద్ర అవసరం అవుతుంది.

మనష్యులందరూ పగలంతా కష్టపడి పనిచేసి అలసిపోవడంతో రాత్రి పూట విశ్రాంతి కోసం నిద్ర అవసరం అవుతుంది. ఈ విశ్రాంతి మీ ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. రోజుకు సరిపడా నిద్రలేకపోతే. జీవితమే తల్లక్రిందులైనట్లు అనిపిస్తుంది. రోజంతా నిస్సత్తువతో, అలసటగా కనబడటమే కాదు ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. సరిగా నిద్రపోవడం వల్ల శరీరంలో జీవక్రియలు మెరుగ్గా పనిచేస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి పనిచేయడానికి తగిన శక్తి, మేధస్సు పొందుతారు.

రాత్రి నిద్రపోవడం శరీరానికి మంచిది, అంటే దీర్ఘ నిద్ర మరియు "చిన్న నిద్ర" ఆరోగ్యకరమైన జీవితానికి విశ్రాంతి తీసుకోవడం అవసరం. అదే విధంగా పగటి పూట ఎలాంటి పనిపాట లేకుండా జీవిస్తూ రాత్రి పగలు నిద్రించే వారు కూడా ఉంటారు. మనిషికి నిద్ర ఎంత అవసరమో..అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. రోజులో ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాసంలో మీరు 8 గంటలకు మించి నిద్రపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

శరీర బరువు పెరుగుతుంది

శరీర బరువు పెరుగుతుంది

మీరు 8 గంటలకు మించి నిద్రపోతే మొట్ట మొదటగా శరీరంపై ప్రభావం చూపుతుంది. దాంతో బరువు పెరుగుతారు. అధిక నిద్ర మీ బరువును పెంచుతుంది. చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల డయాబెటిస్ మరియు ఊబకాయంతో సంబంధం కలిగి ఉంటుంది. లేటుగా నిద్రలేవడం వల్ల ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి సమయం ఉండదు. దాంతో క్రమంగా బరువు పెరుగుతారు. బరువు పెరిగితే క్రమం ఇతర శరీర సమస్యలు పెరుగుతాయి.

వెన్ను నొప్పి:

వెన్ను నొప్పి:

ఎక్కువ సేపు బెడ్ పై నిద్రించడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల లేటుగా లేస్తారు. దాంతో వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. దాంతో వెన్ను నొప్పిని కలిగి ఉంటుంది.

హృదయ సంబంధ వ్యాధులు

హృదయ సంబంధ వ్యాధులు

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్వల్పకాలంలో మీకు అనారోగ్యం కలుగుతుంది. నిద్రపై చేసిన అధ్యయనంలో ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని మరియు 34 శాతం మరణాలు సంభవిస్తుందని అధ్యయనం ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి, నిద్రను 8 గంటలకు మించకుండా తగ్గించండి.

మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది

మెదడు సామర్థ్యం తగ్గిపోతుంది

ఎక్కువ నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది, మొదడు సామర్థ్యం తగ్గుతుంది. అలాగే మెమరీ సామర్థ్యం కొద్ది కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. అలా జరిగితే తెలివితేటలను కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

తలనొప్పి

తలనొప్పి

8 గంటలకు మించి ఎక్కువ సేపు నిద్రపోయేవారికి ఖచ్చితంగా తలనొప్పి సమస్య ఉంటుంది. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మెదడుకు సంబంధించిన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దాంతో తలనొప్పి మరియు చాలా సమస్యలను కలిగిస్తుంది.

డయాబెటిస్

డయాబెటిస్

8 గంటలకు మించి నిద్రపోయేవారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది హార్మోన్ల నష్టాన్ని కలిగిస్తుంది. మీరు నిద్రపోతున్నప్పుడు అవయవాలు ప్రమాదకరంగా మారతాయి.

డిప్రెషన్

డిప్రెషన్

ఇది మూడ్ డిజార్డర్స్ మరియు నిద్రతో ముడిపడి ఉందని వైద్యులు అంటున్నారు. 8 గంటలకు మించి నిద్రపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది రకరకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది.

నిద్రలేమి:

నిద్రలేమి:

ఇది కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా దారితీస్తుంది, అనారోగ్యకరమైన అలవాట్లు, పనులు మరియు నిద్రవల్ల నిద్రలేమి బాధిస్తుంది. ఒక రోజు ఎక్కువ సేపు నిద్రమేల్కోవడం వల్ల తర్వాత రోజు ఎక్కువ నిద్రపోవల్సివస్తుంది. దాంతో ఎక్కువ మేల్కొంటారు.

మరణం :

మరణం :

కొన్ని పరిశోధన ప్రకారం, సాధారణంగా 7-8గంటల సేపు నిద్రించే వారితో పోల్చితే 9 గంటలు మరియు దానిపైన ఎక్కువ గంటలు నిద్రించే వారిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. అయితే ఇందుకు ప్రత్యేకమైన కారణం అంటూ లేదంటున్నారు. కానీ, పరిశోధనల్లో డిప్రెషన్ మరియు లో సోషియోఎకనామిక్ స్టేటస్ దీర్ఘసమయ నిద్రకు సంబంధం ఉందని హెచ్చరిస్తున్నారు.

English summary

Problems Faced By People Who Sleep For More than 8 Hours

Here we listed some of the problems faced by people who sleep for more that 8 hours.
Desktop Bottom Promotion