For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్స్ హార్ట్ డే స్పెషల్.. పదిలంగా పదికాలాలపాటు.. గుండె ఆరోగ్యం

By Nutheti
|

గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే... మంచి ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలి. గుండె జబ్బులు రాకుండా అవగాహన కల్పించడంతోపాటు.. హార్ట్ పేషంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ.. సెప్టెంబర్ 29ని వరల్డ్స్ హార్ట్ డేగా నిర్వహిస్తున్నారు. గుండె ఆరోగ్యం పదిలంగా.. పదికాలాలపాటు ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..

సాల్మన్

సాల్మన్

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు తీసుకోవాలి. ఈ చేపను తరచుగా తీసుకోవడం వల్ల మనుషుల గుండెకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వారానికి రెండుసార్లు ఈ చేపను తీసుకుంటూ ఉంటే.. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. సాల్మన్ చేప వండుకోవడం ఈజీనే కాదు.. తినటానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది.

బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్

విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండే.. బ్లూ బెర్లీలను తీసుకోవడం వల్ల గుండె పనితీరు సజావుగా ఉంటుంది. అల్పాహారంగా గానీ, మధ్యాహ్న భోజనంలో గానీ.. ఫ్రూట్ సలాడ్ రూపంలోగానీ.. బ్లూబెర్రీస్ ని తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.

వాల్ నట్స్

వాల్ నట్స్

వారానికి 5 ఔన్సుల వాల్ నట్స్ తీసుకుంటూ ఉండాలి. ఇందులో మోనో స్యాచురేటెడ్ ఫ్యాట్స్ తోపాటు.. కొలెస్ర్టాల్ ని కంట్రోల్ చేసే గుణం ఉంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో

ఒమేగా 3 ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

ఓట్ మీల్

ఓట్ మీల్

శరీరానికి పోషకాలను, శక్తిని అందించడానికి ఓట్ మీల్ ఉపయోగపడుతుంది. కొలెస్ర్టాల్ ని అదుపుచేయడానికి కూడా ఓట్ మీల్ ఉపయోగపడతాయి. ఒకటిన్నర కప్పు ఉడికించిన ఓట్ మీల్ లో.. గుండె ఆరోగ్యానికి కావాల్సిన మోతాదులో బీటా గ్లూకాన్ ఉంటుంది.

డార్క్ చాకొలెట్

డార్క్ చాకొలెట్

బీపీని అదుపులో ఉంచడానికి.. బ్లడ్ క్లాటింగ్ ని నివారించడానికి బ్లాక్ చాకొలెట్ ఉపయోగపడుతుంది. యాంటీయాక్సిడెంట్స్ గా పనిచేస్తుంది డార్క్ చాకొలెట్. హృదయ సంబంధ వ్యాధులను అరికట్టడానికి డార్క్ చాకొలెట్ తరచుగా తీసుకుంటూ ఉండాలి.

English summary

Healthy Foods For Healthy Heart

People who are diagnosed with diabetes and a heart issue should watch what they eat. Too much sugar in the blood will cause damage to many parts of the body, including blood vessels which is why experts state that consuming foods that are less in sugar is important.
Desktop Bottom Promotion