For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిఫైన్డ్ ఆయిల్ హార్ట్ హెల్త్ కు మంచిదా? చెడ్డదా? సమాధానం ఇక్కడ ఉంది!!గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోండి!!

|

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే (ప్రపంచ హృదయ దినోత్సవం) జరుపుకుంటారు. నూనెలకు గుండె ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. నూనె లేకుండా కూరలు, వినడానికి బాగానే వుంటాయి... తినడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అస్సలు నూనె లేకుండా ఎలా తినలేమో నూనె ఎక్కవయినా తినలేం. వంటలలో ఎంత నూనె వాడాలి అన్నదానికి ఇప్పటి వరకూ కచ్చితమైన కొలమానం ఏదీ లేదు. ఏ సరుకుల దుకాణాలు, షాప్స్ లో వివిధ రకాల నూనెలు ఎంపిక చేసుకోవడానికి కూడా వీలుపడన్ని పేర్లు గల నూనెలు ప్రస్తుత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఎవరి అలవాట్లను బట్టి వాళ్ళు నూనె ఎంపిక చేసుకుని, ఇంటికి తెచ్చుకుని కూరుల్లో నూనె వేస్తుంటారు.మనం రోజూ వంటలకు వినియోగించే నూనెలు నిజంగా నూనేలేన అని మనకు సందేహం?ఎందుకంటే గతంలో నూనెలు ఆయిల్ మిల్లుల నుండి తీసుకొచ్చి వాడే వారు. అలా ఆయిల్ మిల్లులు, గానుగల్లో వండిన నూనెల నుండి మంచి వాసన వచ్చేవి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇప్పుడో కేజీ పల్లి కి కేజీ ఆయిల్ ఎట్లా సాధ్యం ?టెక్నాలజీ కావచ్చు అదే అండి రసాయనాలు కలిపే టెక్నాలజీ తయారు చేసిన నూనె 2 ఇయర్స్ నిల్వ ఉంటదట

!

అసలు స్వచ్యమైన నూనె 2నెలల కంటే ఎక్కువ సమయం నిల్వ ఉంచకూడదు, ఎప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఓ మూలలో ఉంచాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధం, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక లాభం ఏముంటుంది?ఈ రోజు శుద్ది చేసిన నూనెకు మరియు గుండె ఆరోగ్యానికి మద్య సంబంధాన్ని తెలుసుకుందాం.

రిఫైండ్ ఆయిల్ లేదా శుద్ది చేసిన నూనె అంటే ఏమి?

రిఫైండ్ ఆయిల్ లేదా శుద్ది చేసిన నూనె అంటే ఏమి?

శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనె.భారతదేశంలో 50 సంవత్సరాలకు పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడ‌తారు. హెక్సేన్ వంటి రసాయనాలు ముందుముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ ఆయిల్‌లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ ఉండవు.

వరల్డ్ హార్ట్ డే:

వరల్డ్ హార్ట్ డే:

ప్రపంచ హృదయ దినోత్సవం కనోలా లేదా రాప్సీడ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కనోలా ఆయిల్, మొక్కజొన్న నూనె, పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనె మరియు వేరుశెనగ నూనెతో సహా వివిధ రకాల శుద్ధి చేసిన కూరగాయల ఆధారిత నూనెలు ఉన్నాయి. శుద్ధి చేసిన నూనెలు అధిక ఉష్ణోగ్రతల వద్ద స్థిరంగా ఉంటాయి.

శుద్ధి చేసిన నూనెలు వంట నూనెగా ఉపయోగించడం సురక్షితమా

శుద్ధి చేసిన నూనెలు వంట నూనెగా ఉపయోగించడం సురక్షితమా

శుద్ధి చేసిన నూనె వంట నూనెలో ఎక్కువగా ఉపయోగించే రకం అని వివిధ అధ్యయనాలు సూచించాయి, ఎందుకంటే ప్రజలు దీనిని 'శుద్ధి చేసిన' స్వభావం కారణంగా వంట కోసం ఎంచుకుంటారు. శుద్ధి చేసిన నూనెలు వంట నూనెగా ఉపయోగించడం సురక్షితమని ఫుడ్స్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సైంటిఫిక్ ప్యానెల్ చెప్పినప్పటికీ, నూనె యొక్క ప్రతికూల ప్రభావాలు దాని ఆమోదయోగ్యమైన సానుకూల ప్రభావాలను అణచివేస్తాయి.

శుద్ధి చేసిన నూనెలు హైడ్రోజనేషన్ ప్రక్రియకు

శుద్ధి చేసిన నూనెలు హైడ్రోజనేషన్ ప్రక్రియకు

శుద్ధి చేసే విస్తృతమైన ప్రక్రియలో నూనెను ఆక్సిడైజేషన్ ద్వారా ట్రాన్స్ ఫ్యాట్ గా మారుస్తుంది, తరువాత ట్రాన్స్ ఫ్యాట్ తీవ్రమైన వాసన తొలగించడానికి డీడోరైజ్ చేయబడుతుంది. అవోకాడో, నువ్వులు లేదా ఆలివ్ అయినా, శుద్ధి చేసిన నూనె ఏరకమైన నూనెలు అయినప్పటికీ, శుద్ధి సుదీర్ఘ ప్రక్రియకు లోబడి ఉండటం వల్ల, ఈ ప్రక్రియలో నూనె నాణ్యతను దెబ్బతీస్తుంది. కొన్ని శుద్ధి చేసిన నూనెలు హైడ్రోజనేషన్ ప్రక్రియకు లోనవుతాయి, ఇది నూనెలలోని కొవ్వు ఆమ్లాలను మరింత దెబ్బతీస్తుంది, ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలను సృష్టిస్తుంది.

శుద్ధి చేసిన నూనెతో దుష్ప్రభావాలు

శుద్ధి చేసిన నూనెతో దుష్ప్రభావాలు

నూనెలు శుద్ధి చేయడంలో ఉపయోగించే ఇంటెన్సివ్ కెమికల్స్ మరియు యాంత్రిక ప్రక్రియలో నూనెల్లో నాణ్యతను తగ్గిపోతుంది. శుద్ధి చేసిన నూనెలలో ఇన్ఫ్లమేటరీ ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి మరియు టాక్సిక్ కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్య పరంగా ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి, రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి మరియు ఇన్సులిన్ ప్రతిస్పందనను మరింత బలహీనంగా దిగజార్చుతాయి. అధ్యయనాల ప్రకారం శుద్ధి చేసిన నూనె వినియోగం వల్ల డయాబెటిస్, క్యాన్సర్ మరియు గుండె జబ్బులతో సంబంధం ఉన్నట్లు నిర్థారించాయి.

నూనెలు శుద్ధి ప్రక్రియలో ఉపయోగించే సోడియం హైడ్రాక్సైడ్ అల్సర్స్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ మరియు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. ఈ రసాయనాలు కూడా శ్వాసకోశ వ్యాధుల బారిన పడేలా చేస్తాయి మరియు మెదడుకు రక్త ప్రసరణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తాయి.

శుద్ధి చేసిన నూనె మీ హృదయానికి మంచిదా?

శుద్ధి చేసిన నూనె మీ హృదయానికి మంచిదా?

శుద్ధి చేసిన నూనెలను ద్రావకాలను ఉపయోగించి వాటి ద్వారా సంగ్రహిస్తారు, తరువాత ఇది బ్లీచింగ్, డీయోడోరైజింగ్ మరియు మొదలైన యాంత్రిక ప్రక్రియ వల్ల నూనెల్లో వాసన కోల్పోతుంది. ఈ ప్రక్రియలో నూనె యొక్క అసలైన రుచి, రంగు మరియు వాసనను తగ్గిస్తుంది మరియు కొన్ని ప్రయోజనకరమైన యాంటీఆక్సిడెంట్లను కూడా తగ్గిస్తుంది. శుద్ధి చేసిన నూనెలు వినియోగించడం వల్ల గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న విషయంలో చాలా అధ్యయనాలు జరిపారు. మరియు అనిమల్ ఫ్యాట్ తో పోల్చితే, ఈ శుద్ధి చేసిన కూరగాయల నూనెలు గుండె జబ్బులకు కారణమవుతాయని నొక్కి చెప్పబడింది. ఒక అధ్యయనంలో వెన్న వినియోగాన్ని శుద్ధి చేసిన కూరగాయల నూనెతో పోల్చారు. దాని తరువాతి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరిగినట్లు కనుగొన్నారు.

ప్రపంచ హృదయ దినోత్సవం

ప్రపంచ హృదయ దినోత్సవం

ట్రాన్స్ ఫ్యాట్ పుష్కలంగా ఉన్న శుద్ధి చేసిన నూనె గుండెపోటు మరియు గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. ఏదేమైనా శుద్ధి చేసిన నూనెను గుండె-ఆరోగ్యకరమైనదిగా వివిధ కంపెనీలు లేబుల్ పెట్టడంతో ఈ అభిప్రాయం విరుద్ధంగా ఉంది. అధ్యయనాల ప్రకారం సంతృప్త కొవ్వుతో(శాచురేటెడ్ ఫ్యాట్) పోల్చితే బహుళ అసంతృప్త కొవ్వు(పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాట్) గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఏదేమైనా, అనేక అధ్యయనాలు ప్రకారం శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా -6 కొవ్వు కారణంగా గుండె జబ్బుల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నల్లు తెలుపుతున్నాయి.

శుద్ధి చేసిన కూరగాయల నూనె మరియు గుండె ఆరోగ్యంపై

శుద్ధి చేసిన కూరగాయల నూనె మరియు గుండె ఆరోగ్యంపై

శుద్ధి చేసిన కూరగాయల నూనె మరియు గుండె ఆరోగ్యంపై విరుద్ధమైన అభిప్రాయాలు ఆందోళన కలిగిస్తాయి, శాస్త్రీయ అభిప్రాయాల ప్రకారం గుండె ఆరోగ్యంపై దాని సానుకూల మరియు ప్రతికూల ప్రభావాల మధ్య నడుస్తున్నది. అటువంటి అధ్యయనం ప్రకారం సంతృప్త కొవ్వును పాలిఅన్‌శాచురేటెడ్ కొవ్వుతో భర్తీ చేయడం వల్ల గుండె సమస్యల ప్రమాదాన్ని 17 శాతం తగ్గిస్తుంది, అయితే ఇది గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదంపై గణనీయమైన ప్రభావాలను చూపదు.

సాంప్రదాయ వంట నూనె మంచి ఎంపిక!

సాంప్రదాయ వంట నూనె మంచి ఎంపిక!

శుద్ధి చేసిన నూనె మరియు సాంప్రదాయ వంట నూనె మధ్య ఉన్న సంబంధంపై ఇటీవలి ఒక అధ్యయనంలో శుద్ధి చేసిన నూనెకు బదులుగా నెయ్యి, కొబ్బరి నూనె మరియు ఆవ నూనె ఆరోగ్యకరమైనవని మరియు మంచి ఎంపికలు అని పేర్కొంటున్నాయి. ఇండియన్ హార్ట్ జర్నల్ (IHJ) లో ప్రచురించబడిన ఒక అధ్యయనం శుద్ధి చేసిన నూనెను నివారించడం మంచిది అని పేర్కొంది - ఇది దాని నాణ్యతను కోల్పోతుంది మరియు శుద్ధి చేసేటప్పుడు టాక్సిక్ రసాయాల ద్వారా తయారుచేయబడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ శుద్ధి చేసిన నూనెలు సులభంగా క్షీణించే స్వభావం ఉండటం వల్ల హృదయ ఆరోగ్యానికి, అలాగే మొత్తం ఆరోగ్యానికి అనారోగ్యకరమైనదని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

గమనిక ...

గమనిక ...

ఇతర రకాల నూనెతో పోలిస్తే, శుద్ధి చేసిన నూనెలు గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతాయి. అయితే, మితంగా వాడుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఎక్కువ హాని కలిగించకపోవచ్చు. కానీ, సురక్షితంగా ఉండటానికి, EVOO (ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్), ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, వేరుశెనగ నూనె, సోయాబీన్ ఆయిల్ మరియు ఆర్గానిక్ బట్టర్ వంటి ఆరోగ్యకరమైనవి ఎంపిక చేసుకోండి. మరియు ఎలాగైనా సరే హైడ్రోజనేటెడ్ నూనెల వాడకాన్ని పూర్తిగా నివారించండి. అన్నింటికంటే ముఖ్యంగా, ఏవైనా సరే ఎక్కువగా వినియోగించడం మీ ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది కాదు!

రిఫైన్డ్ ఆయిల్ & హార్ట్ హెల్త్ పై తరచుగా అడిగే ప్రశ్నలు

రిఫైన్డ్ ఆయిల్ & హార్ట్ హెల్త్ పై తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర) మీ గుండెకు ఆరోగ్యకరమైన వంట నూనె ఏమిటి?

జ) న్యూట్రీషియన్లు మరియు కుకింగ్ ఎక్స్పర్ట్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం తినడానికి మరియు వంటలకు బహుముఖ ప్రయోజనాలను అందించేది మరియు ఆరోగ్యకరమైన నూనెలలో ఒకటి ఆలివ్ నూనె, సాధ్యమైనంత ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్. ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ మరియు సన్ ఫ్లర్ ఆయిల్స్ డీఫ్ ఫ్రైకి అనుకూలంగా ఉంటాయి. షాలో ఫ్రై చేయడానికి ఆలివ్ ఆయిల్ ఉత్తమ ఎంపిక.

ప్ర) హార్ట్ పేషంట్స్ కు ఆలివ్ ఆయిల్ సురక్షితమేనా?

జ. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కు గొప్ప మూలం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ప్ర) సన్ ఫ్లవర్ ఆయిల్ మీ గుండెకు చెడ్డదా?

ఇది కొన్ని మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ను (20 శాతం) సరఫరా చేస్తుంది మరియు సంతృప్త కొవ్వు (11 శాతం) తక్కువగా ఉంటుంది, ఇది మొత్తానికి హార్ట్ హెల్తీ ఆప్షన్.

English summary

World Heart Day 2019: Is Refined Oil Good For Heart Health?

World Heart Day is observed on 29 September every year. Cooking with the right kind of oil is critical, as it makes all the difference to the food in terms of taste, flavour and its health quotient. With the endless choices on the store shelves, it can become difficult to choose the right one. One of the right (and easy) ways to choose the right kind of cooking healthy (that is healthy too) is by choosing a liquid that remains liquid instead of solid at room temperature.