Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
అగరబత్తీల పొగతో ఊపిరితిత్తులకు ముప్పు? డాక్టర్ తీవ్ర హెచ్చరిక!
భారతీయ ఇళ్లల్లో ఉదయం, సాయంత్రం దేవుడి ముందు దీపారాధన చేయడం, అగరబత్తీలు లేదా ధూపం వెలిగించడం ఎంతో కాలంగా వస్తున్న అందమైన దినచర్య. ఆ సుగంధం ఇల్లంతా వ్యాపించినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తుంది.
అయితే భక్తితో మనం రోజూ వెలిగించే ఈ అగరబత్తీలు లేదా ధూపం మనం అనుకున్నంత స్వచ్ఛమైనవి కాకపోవచ్చు. ప్రతిరోజూ మనం పీల్చే ఆ సువాసన వెనుక ఒక అదృశ్య ప్రమాదం దాగి ఉందనే విషయం మీకు తెలుసా?

నిబంధనలు ఏం చెబుతున్నాయి?
భారత ప్రమాణాల సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) అగరబత్తీల తయారీ, వినియోగంపై కొన్ని కీలకమైన కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీనికి ప్రధాన కారణం.. మార్కెట్లో లభిస్తున్న చాలా రకాల అగరబత్తీలు, ధూప్ స్టిక్స్ లో ఇప్పుడు సహజసిద్ధమైన మూలికలకు బదులుగా హానికరమైన రసాయనాలు వాడుతుండటమే.
సువాసనల కోసం కృత్రిమ సుగంధ ద్రవ్యాలు, మంట ఆరకుండా ఉండేందుకు రసాయన పదార్థాలు, బొగ్గు పొడి వంటివి విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇవి కాలినప్పుడు వెలువడే పొగలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషవాయువులు గాలిలో కలుస్తున్నాయి.
డాక్టర్లు ఏమంటున్నారు?
ఈ విషయాన్ని ఒమేగా హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన వంశీ ఒక ఇన్ స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రజలకు స్పష్టంగా వివరించారు. కిటికీలు, తలుపులు మూసివేసి ఉన్న గదుల్లో ఈ పొగను పీల్చడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు.
ఈ కలుషితమైన గాలిని రోజూ పీల్చడం వల్ల శ్వాసనాళాల్లో మంట పుట్టడం, ఆస్తమా (ఉబ్బసం) సమస్యలు తీవ్రం అవ్వడం, రకరకాల అలర్జీలు వస్తాయని.. దీర్ఘకాలంలో ఇది ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు కూడా దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ముందుగానే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ పొగ వల్ల మరింత త్వరగా ప్రమాదానికి గురవుతారన్నారు.
సంప్రదాయం వద్దు అనడం లేదు
పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఎప్పుడో ఒకసారి అగరబత్తీలు వెలిగిస్తే పర్వాలేదు. కానీ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇల్లంతా పొగతో నిండిపోయేలా చేయడం వల్ల ఆ ప్రభావం నెమ్మదిగా మన ఊపిరితిత్తులపై తీవ్రమైన భారాన్ని మోపుతుందన్నారు.
ప్రభుత్వ సంస్థలు తెచ్చిన ఈ కొత్త నియమాలు మన సంప్రదాయాలను, భక్తిని ఆపడానికి ఉద్దేశించినవి కావు.. కేవలం మన ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడటానికి మాత్రమే అని మనం గ్రహించాలన్నారు.
మరి పరిష్కారం ఏమిటి?
-మార్కెట్లో లభించే చౌకబారు అగరబత్తీలకు బదులుగా, BIS నిబంధనలకు అనుగుణంగా తయారైన, రసాయనాలు లేని ఆర్గానిక్ అగరబత్తీలను ఎంచుకోవాలని డాక్టర్ మోహన వంశీ సూచించారు.
-ఇంట్లో ధూపం లేదా అగరబత్తీలు వెలిగించేటప్పుడు గదిలో కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. దీనివల్ల గాలి రాకపోకలు మెరుగ్గా ఉండి పొగ బయటకు వెళ్లిపోతుంది.
-ఒకేసారి గుప్పెడు అగరబత్తీలు కాకుండా, ఒకటి లేదా రెండు మాత్రమే వెలిగించి పొగ శాతాన్ని తగ్గించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











