For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంచే 13 బెస్ట్ ఫుడ్స్

|

సాధారణంగా పిల్లలు చిన్నప్పటి నుండి తల్లులు వారి పిల్లలకు ప్రత్యేకమైన ఆహారాలు అందిస్తుంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, వారిపెరుగుదలకు సహాయపడే ఎముకలు బలంగా ఉండాలని హెల్తీ ఫుడ్ అందిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది పెరిగే పిల్లలతో పాటు, పెద్దలు కూడా ఎముకలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతన్నట్లు అనేక అద్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ ఎముకల ఆరోగ్యానికి సంబంధించినంత వరకూ సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడమే అందుకు కారణం అని చెబుతున్నారు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచే కొన్నిముఖ్యమైనటువంటి ఆహారాలను తమ రెగ్యులర్ డైట్ లో శరీరంలో ఎముకలో స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎముకల అభివ్రుద్దికి, మరియు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడే కొన్ని ఆహారాలను బోల్డ్ స్కై మీకోసం అందిస్తోంది.

మీ వయస్సు ప్రకారం, వయస్సు పెరిగే కొద్ది, ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల కూడా బోన్ కు సంబంధించి సమస్యలు అధికం అవుతాయి. కాబట్టి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెద్దవారు కొన్ని ముఖ్యమైన ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరిగా గుర్గించుకోవాలి. అలా చేసినప్పుడు, వయస్సు పెరిగేకొద్ది ఎటువంటి అనారోగ్య సమస్యలుండవు.

శరీరంలో జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి కాల్షియం చాలా అవసరం. మరియు కాల్షియం ఎముకల్లో నిల్వచేరడం చాలా అవసరం. అలా ఎముకల్లో కాల్షియం చేరాలంటే, అందుకు మనశరీరానికి విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో క్యాల్షియం ఉన్నటువంటి ఆహారాలు సరైనా మోతాదులో తీసుకోకపోతే, ఎముకలు చిట్లడం, ఎముకలు అరిగిపోవడం వంటి బోన్ సమస్యలు ఎర్పడుతాయి. మరి ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ఈక్రింది స్లైడ్ లో కొన్ని బోన్ బిల్డింగ్ ఫుడ్స్ లిస్ట్ ను అంధిస్తున్నాం. ఈ క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

పాలు:

పాలు:

కాఫీ మరియు టీ లను తాగడం సాధ్యమైనంత వరకూ తగ్గించాలి. కాఫీ, టీలకు బదులుగా ఒక గ్లాసు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మరియు పాల వల్ల కాల్షియం అందుతుంది. మరియు ఎముకలకు అవసరమయ్యే ఇతర విటమిన్ డి తో పాటు, ప్రోటీన్, ఫాస్పరస్, మరియు పొటాషియం వంటివి పుష్కలంగా అందుతాయి.

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

ముదురు రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు, కూరగాయలు, బ్రొకోలీ, డైరీ ఉత్పత్తులు వంటి వాటిల్లో ‘విటమిన్ డి' అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది.

సాల్మన్ ఫిష్:

సాల్మన్ ఫిష్:

ఫ్యాటీ ఫిష్ సాల్మన్ వంటి చేపల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఒక సారి తినే సాల్మన్ ఫిష్ నుండి రోజంతా మీకు అవసరం అయ్యే విటమిన్ డి అందుతుంది.

చీజ్:

చీజ్:

చీజ్ ను పాలతో తయారుచేస్తారు. పాలలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. అందుకే ఇది బోన్ హెల్త్ కు చాలా అవసరం అవుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో దాదాపు 42శాతం కాల్షియం కలిగి ఉంటుంది. మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా పెరుగును చేర్చుకోవాలి.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి విత్తనాల్లో మెగ్నీషయం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల బలానికి చాలా అవసరం. గుప్పుడు గుమ్మడి గింజలను తినడం వల్ల ఓస్టిప్రోసిస్ ను నివారించవచ్చు.

ఆప్రికాట్:

ఆప్రికాట్:

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి . ఈ ఆప్రికాట్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారానికొకసారైనా వీటిని తినడం మంచిది.

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ప్రోటీన్ ఎముకల బలంగా మార్చడానికి సహాయపడుతుంది.

ఓట్స్:

ఓట్స్:

ఒట్స్ లో 25శాతం విటమిన్ డి ఉంటుంది. కాబట్టి, ఓట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఎంతో అవసరం.

ఆరెంజ్:

ఆరెంజ్:

కమలాఫలం, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ద్రాక్షలలో ఉండే సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్రీన్‌ టీలో ఉండే ఒక గ్రూపు రసాయనాలు ఎముకల నిర్మాణాన్ని ఉత్తేజితం చేస్తాయి. దీంతో ఎముకలు విరగడం నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆస్టియోపోరోసిస్‌ రావడాన్ని, చికిత్సను గ్రీన్‌టీ నివారిస్తుంది. అంతేకాక ఇతర ఎముకల సంబంధ వ్యాధులను అరికట్టే వీలుంది.

తున ఫిష్:

తున ఫిష్:

తున ఫ్యాటీ ఫిష్. ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది . అంతే కాదు ఎక్కువ ప్రయోజనాలను అందించే న్యూట్రీషియన్స్ పొటాషియం, మెగ్నీషియం, మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి,ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచతుంది.

ఎగ్ :

ఎగ్ :

గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఈ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్ సి, ఫైబర్, మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. అందువల్ల ఇది బోన్ హెల్త్ కు చాలా మేలు చేస్తుంది.

English summary

13 Best Foods For Your Bones

Mothers make it a point to feed their children with dairy products so that their bones are strong. Today, with the growing number of people facing problems related to their bones, experts have stated that the food we eat is not enough to keep our bones healthy.
Story first published: Thursday, April 17, 2014, 16:09 [IST]
Desktop Bottom Promotion