For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు తినడం తప్పనిసరి

|

పెద్ద ప్రేగును ప్రక్షాళన (శుభ్రం)చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. పెద్దప్రేగు శుభ్రపడటం వల్ల శరీరంలోని మలినాలు మరియు విషాలు శరీరం నుండి బయటకు స్రవించబడుతుంది. దాంతో డిటాక్సిఫికేషన్ వల్ల చర్మం అందం పెరుగుతుంది. పెద్దప్రేగు సరిగా పనిచేయనట్లైతే మీరు మలబద్ధకం మరియు జీర్ణ మరియు పొట్టకు సంబంధించిన రోగాల భారీన పడేలా చేస్తుంది.

కాబట్టి పెద్దపేగు సక్రమంగా పనిచేయాలన్నా.. మలబద్దకం మరియు జీర్ణ సమస్యలను నివారించాలన్నా ఫైబర్ రిచ్ ఫుడ్స్ బాగా సహాయపడుతాయి. వీటితో పాటు కొన్ని కోలన్ క్లీనింగ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పెద్ద పేగులో వచ్చే మలబద్దకం వంటి చాలా సాధారణ సవుస్యలను మంచి ఆహారంతోనే నివారించవచ్చు.

READ MORE: పురుషుల్లో లైంగిక సామర్థ్యంను పెంచే ఆహారాలు

అంతేకాదు... ఇదే ఆహారంతో పెద్ద పేగుకు వచ్చే తీవ్రమైన సవుస్య అయిన క్యాన్సర్‌ లాంటి వాటినీ సవుర్థంగా నివారించవచ్చు. పెద్దపేగులో జీర్ణమైన ఆహారం తేలిగ్గా ముందుకు కదిలేందుకు ఉపయోగపడేది ఈ పీచు పదార్థాలే. పొట్టుతో ఉండే గోధుమ, ఓట్స్, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి వంటి తృణధాన్యాల్లో, రాజ్మా, శనగలు, పెసలు, సోయూబీన్ వంటి పప్పుధాన్యాల్లో (పల్సెస్), తొక్కతో పాటే తినదగ్గ తాజా పళ్లు, తాజా కూరగాయుల్లో ఈ పీచుపదార్థాలు ఎక్కువ.

READ MORE: పెద్ద ప్రేగు, జీర్ణాశయంను శుభ్రం చేసే 10 ఉత్తమ హోం రెమెడీస్

వీటితో పాటు కొన్ని కోలన్ క్లీనింగ్ రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.ఈ ఫుడ్స్ తో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా అనుసరించాలి . కోలన్ శుభ్రపరచడం వల్ల చిన్న ప్రేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది . ఇది ఎనర్జీ ని అందిస్తుంది. కాబట్టి కోలన్ శుభ్రపరచాలనుకుంటే, డాక్టర్ ను సంప్రదించాలి. అంతకు ముందుగా మనం తినాల్సిన హెల్తీ కోలన్ క్లెన్సింగ్ ఫుడ్స్ ...

గార్లిక్:

గార్లిక్:

వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే గుండె ఆరోగ్యాన్నిఆరోగ్యంగా ఉంచుతుంది, అంతే కాదు పెద్దప్రేగు ను శుభ్రపరచేటటువంటి ఆహారాల్లో ఇది ఒకటి.

తృణధాన్యాలు:

తృణధాన్యాలు:

వీటిలో లోక్యాలరీస్, లో కొలెస్ట్రాల్ కలిగి మరియు సులభంగా జీర్ణ అవ్వడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

లివర్ ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీ ని తప్పని సరిగా త్రాగాలి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.

 గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. డైజిస్టివ్ ట్రాక్ (జీర్ణ కోశాన్ని) శుభ్రంగా ఉంచడానికి

సహాయపడతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

సిట్రస్ పండ్లు, ముఖ్యంగా నిమ్మ కోలన్ (పెద్ద ప్రేగును)శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేసి మరియు శుభ్రపరుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్సీడ్స్ ల ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఫ్లాక్ సీడ్స్ నీటిని గ్రహించి కోలన్ ను విస్త్రుతపరుస్తుంది. దాంతో టాక్సిన్ మరియు మ్యూకస్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది. దాంతో పాటు, క్యాన్సర్, గుండె జబ్బులను మరియు డయాబెటిస్ ను నివారిస్తుంది.

 అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికం. ఇవి కోలన్ ను శుభ్రం చేస్తుంది. మరియు జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది. ఓమేగా 3 ఫ్యాటీ ఆయిల్స్ పెద్ద ప్రేగు గోడకు ఒక లూబ్రికెంట్ వలే పనిచేస్తుంది. అన్ని ఆహారపు అణువులను మరియు వ్యర్థాలను మరియు విషాలను బయటకు విసర్జింపబడుతుంది.

English summary

Best Foods For Colon Cleansing : Health Tips in Telugu

Best Foods For Colon Cleansing , To improve your overall body's health colon cleansing is very important as it can reduce the risk of colon cancer. Getting rid of all the colon wastes and toxins help you to feel better and light. It improves the strength and overall good health.
Story first published: Tuesday, August 11, 2015, 17:20 [IST]
Desktop Bottom Promotion