For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మష్రుమ్ (పుట్టగొడుగుల)ను రెగ్యులర్ గా తింటున్నారా...?

|

పుట్టగొడుగులు మీరు వినే ఉంటారు. పుట్టగొడులు మంచి పౌష్టికాహారం ఎందుకంటే వీటిలో అపారమైన పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతాయి. అంతే కాదు ఫైబర్ కు అద్భుతమైన మూలం. పుట్ట గొడుగులు ప్రాచీనకాలం నుండి ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలున్న ఆహారం పదార్థం.

READ MORE: వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..!

పుట్టగొడుగుల్లో ఉండే హెల్తీ ఫైబర్ వల్ల దీన్ని రెగ్యులర్ గా ప్రతి రోజూ తీసుకోవడానికి దోహదపడుతున్నాయి. ఇంకా ఇందులో అనేక మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ మరే ఇతర ఆహారాల్లో అంతగా లేవు. మష్రుమ్ లో విటమిన్ బి, డి, పొటాషియం, కాపర్, ఐరన్ మరియు సెలీనియం అనే మినిరల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి . ఇందులో కోలిన్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ ముఖ్యమైన న్యూట్రీషియన్స్ కండరాల కదలికలకు, అభ్యాసనకు మరియు మెమరికి సహాయపడుతాయి.

READ MORE: శీఘ్ర స్ఖలన సమస్య? నయం చేయటానికి 15 పవర్ ఫుడ్స్

పుట్టగొడుగులు మంచి రుచిని కలిగి ఉండటం మాత్రమే కాదు, ఖచ్చితంగా ఆరోగ్యానికి పలు విధాలుగా సహాయపడుతుంది. మీ డైలీ డైట్ లో మష్రుమ్ ను చేర్చుకోవడం వల్ల ఇది అనేక వ్యాధులను దరిచేరనివ్వకుండా పోరాడటానికి సహాయపడుతుంది. మరి వీటి గురించి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఈక్రింది స్లైడ్ చూడాల్సిందే...

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి:

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి:

మష్రుమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మష్రుమ్ లో ఒకే విధమైన యాంటీఆక్సిడెంట్స్ ఎర్గోథైయోనిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉన్నాయి. ఇవి వయస్సు మీదపడకుండా నివారిస్తాయి, ఇన్ల్ఫమేషన్ మరియు బరువును తగ్గిస్తాయి.

వ్యాధినిరోధకతను పెంచుతాయి:

వ్యాధినిరోధకతను పెంచుతాయి:

హెల్తీ ఫుడ్ మష్రుమ్ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు ఇది చిన్న చిన్న జబ్బులను జలుబు మరియు ఫ్లూ వంటి వాటిని నివారిస్తుంది. ఇందులో ఉండే సెలీనియం వ్యాధినిరోధకతను పెంచే బాధ్యత కలిగి ఉంటుంటి. టి సెల్స్ యొక్క ఉత్పత్తిని క్రమబద్దం చేస్తుంది.

విటమిన్ డికి మంచి మూలం :

విటమిన్ డికి మంచి మూలం :

మనం సాధారణంగా ఎండలో ఉండటం వల్ల మన శరీరంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది . అదే క్రమంలో బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. మనం ప్రతి రోజూ తీసుకొనే మష్రుమ్ క్వాంటిటీలో 20 శాతం డి విటమిన్ కలిగి ఉంటుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది:

మష్రుమ్ లో చాలా తక్కవు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కాబట్టి, ఇది షుగర్ లెవల్స్ ను పెంచదు . రీసెర్చ్ ప్రకారం మష్రుమ్ లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.

బాడీ వెయిట్ తగ్గిస్తుంది :

బాడీ వెయిట్ తగ్గిస్తుంది :

మష్రుమ్ ను రెగ్యులర్ గా తీసుకుంటుంటే బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వీటిలో చాలా తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కనుక. మరియు ఫ్యాట్ పూర్తిగా ఉండదు . మష్రుమ్ ఆకలికోరికలను తగ్గిస్తుంది మరియు చాల తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది.

చర్మం మరియు జుట్టుకు చాలా మేలు చేస్తుంది :

చర్మం మరియు జుట్టుకు చాలా మేలు చేస్తుంది :

రెగ్యులర్ డైట్ లో మష్రుమ్ చేర్చుకోవడం వల్ల ఇది మొటిమల యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. మష్రుమ్ చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. మష్రుమ్ ను ఉడికించిన నీటిని వివిధ రకాల కాస్మోటిక్స్ లో ఉపయోగిస్తున్నారు . మష్రుమ్ లో ఉండే సెలీనియం అనే మినిరల్స్ చుండ్రు నివారిస్తుంది. జుట్టు రాలకుండా రక్షణ కల్పిస్తుంది.

హార్ట్ హెల్తీగా:

హార్ట్ హెల్తీగా:

మష్రుమ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు హార్ట్ డిసీజ్ నివారిస్తుంది. మష్రుమ్ లో ఉండే ఫైబర్, పొటాషియం, మరియు విటమిన్ సి కార్డియో వ్యాస్కులర్ హెల్త్ ను మరింత మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ ప్రమాధం ఉండదు:

క్యాన్సర్ ప్రమాధం ఉండదు:

మష్రుమ్స్ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ ప్రమాధాల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది . వీటిలో ఉండే పోషకాలు, మినిరల్స్, విటమిన్స్, కెమికల్స్ క్యాన్సర్ ప్రమాధం నుండి రక్షణ కల్పిస్తాయి.

English summary

Eight Reasons To Eat Mushrooms: Health Tips in Telugu

Mushroom has immense amounts of essential nutrients. It is also an excellent source of fiber. Mushrooms have been used as a medicine from times immemorial. It is a low calorie food.
Story first published: Tuesday, September 1, 2015, 17:03 [IST]
Desktop Bottom Promotion