Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
శరీరంలోని ముఖ్య భాగాలకు కావాల్సిన ఆహార పదార్థాలేంటి ?
మీకు ఆకలేస్తోందని.. ఏది పడితే అది లాగించేస్తున్నారు. అయితే బీ కేర్ ఫుల్. ఇటీవల జరిగిన ఓ రీసెర్చ్ అలా తింటున్న ఆహారం మంచిది కాదని తేల్చింది. 90 శాతం కంటే ఎక్కువ మంది.. సరైన ఆహారం తీసుకోవడం లేదట. వాళ్లు తింటున్న ఆహారం శరీరంపై దుష్ర్పభావం చూపుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తీసుకునే ఆహారం ఏదైనా.. శరీరానికి హాని చేయనిదైతే మంచిది. మనం తీసుకునే ఆహారం బాగుంటే.. మన శరీరంలోని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఎరుపు రంగు ఉన్న ఆహార పదార్థాలు తింటే.. గుండె, రక్తానికి మంచిది. అలాగే ఆకుకూరలైతే కంటికి మంచిది. ఇలా రోజూ తీసుకునే ఆహారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు ఉపయోగపడేలా చూసుకుంటే.. మీ జీవితం పదికాలాలపాటు చల్లగా ఉంటుంది. శరీరంలోని ఏ భాగానికి ఎలాంటి ఆహారం మంచిదో చూద్దాం..

మెదడు
మెదడు పనితీరు సరిగా ఉండాలంటే.. సార్డీన్ చేపలు, సాల్మాన్ చేపలు, ట్యూనా చేపలతో పాటు వాల్ నట్స్ బాగా తీసుకోండి. వీటి వల్ల మెదడుకు రక్తప్రసరణ బాగా జరగడంతో పాటు.. ఏకాగ్రత పెరుగడానికి సహకరిస్తాయి.

కండరాలు
అరటిపండ్లు, మాంసం, కోడిగుడ్లు, చేపలు.. ఈ నాలుగింటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ కండరాలు బలపడతాయి. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కండరాలతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది.

ఊపిరితిత్తులు
ఆకుపచ్చ రంగులో ఉండే ఎలాంటి ఆహారమైనా.. అంటే ఆకుకూరలు, కూరగాయలు.. ఊపిరితిత్తులకు మంచిది. బ్రొకోలి, మొలకెత్తిన గింజలు, క్యాబేజీ వంటి కూరగాయల్లో.. విటమిన్ కే ఉంటుంది. ఇలాంటివి వారానికి రెండుసార్లైనా తీసుకుంటే మంచిది.

చర్మం
చర్మ సంరక్షణకు.. యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. బ్లూబెర్రీస్, సాల్మాన్ చేపలు, గ్రీన్ టీ తీసుకోండం వల్ల చర్మంపై ఉండే మృతకణాలను తొలగింగి... చర్మ కాంతిని పెంచుతాయి.

కళ్లు
క్యారెట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ తో పాటు పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లు, మొక్కజొన్న తీసుకుంటే మంచిది.

గుండె
గుండె ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవాలంటే.. ఎరుపు రంగు ఉండే పండ్లు రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి. గుండెకు రక్తప్రసరణ సరైన క్రమంలో జరగడానికి పండ్లు సహాయపడతాయి. ఎండు ద్రాక్ష రసం, టమోటాలు, ఆలూ కూడా గుండె ఆరోగ్యానికి మంచిది.

బోవెల్స్
పేగుల పనితీరు గాడిలో ఉండాలంటే.. అరటిపండ్లు, ఓట్స్, ఎండు ద్రాక్ష రసం.. వంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. పెరుగు నిత్యం తీసుకోవడం వల్ల మూత్రాశయ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ఎముకలు
ఎముకలు పుష్టిగా, బలంగా ఉండాలంటే.. పాలు, ఆకుకూరలు, విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు నారింజ వంటివి తీసుకోవాలి. చిన్నారులకు క్రమం తప్పకుండా.. ఇలాంటి ఆహారం ఇవ్వడం వల్ల వాళ్ల ఎముకలు బలంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications