Latest Updates
-
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.! -
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.? -
పిల్లల ఫేవరెట్ ‘ఆలూ’.. రెస్టారెంట్ టేస్ట్‌తో అదరగొట్టే దమ్ బిర్యానీ.! -
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.! -
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.!
పుష్కలంగా ప్రొటీన్స్ ఉన్న రాగులు తీసుకుంటున్నారా ?
రాగులు పూర్వం నుంచి ఆరోగ్యాన్ని అందిస్తున్న తృణ ధాన్యాలు. వీటినే మిల్లెట్స్ అని పిలుస్తారు. రాగి జావ, రాగి సంగటి, రాగులతో చేసిన రకరకాల పిండివంటలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ.. ఎంతో బలవర్థకమైన ఆహారం రాగులు. విభిన్న రూపాల్లో రాగులను.. ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Read more: రాగి బాల్/రాగి ముద్దలోని ఆశ్చర్యకర ప్రయోజనాలు
దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా ఆంధ్రాలో రాగులకున్న ప్రత్యేకతే వేరు. రాగులతో ఎన్నో వంటకాలు తయారు చేసుకుంటారు. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి. ఇందులో ప్రొటీన్స్, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. రాగులలో లో ఫ్యాట్ తక్కువగా ఉండటమే కాదు.. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. రాగుల ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

బరువు తగ్గడానికి
రాగుల్లో అమినోయాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. రాగిపిండితో తయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలు గ్రహించకుండా చూస్తుంది. రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది.

ఎముకల ఆరోగ్యానికి
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలానికి తోడ్పడతాయి. పిల్లల ఎదుగుదలకు సహకరిస్తాయి. వయస్సు పెరుగుతున్న వారికి సరైన మోతాదులో కాల్షియం అందించడానికి రాగులు సహాయపడతాయి. మహిళల ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ తాగడం మంచిది.

మధుమేహానికి
మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగి గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కర స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.

హై కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి
రాగుల్లో అమినో యాసిడ్ లెసిథిన్ మరియు మేథినోన్ కలిగి ఉండి, కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి సహాయపడతాయి.

రక్తహీనత
సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని అందించడానికి రాగులు బాగా ఉపయోగపడతాయి. రాగులు తరచుగా తీసుకోవడం వల్ల అనీమియా రక్తహీనతను అరికట్టవచ్చు.

వయస్సును తగ్గించడానికి
మిల్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల వయస్సు తక్కువగా కనపడుతూ.. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. రాగులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

బీపీ ని కంట్రోల్ చేస్తుంది
హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవాళ్లు, కరోనరీ వ్యాధులతో బాధపడేవాళ్లు ఫైబర్ ఫుష్కలంగా ఉన్న రాగులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోస్ట్ చేసిన రాగులను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో బాధపడేవారికి టానిక్ లా పనిచేస్తుంది.

గుండె ఆరోగ్యానికి
కాలేయవ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే.. మీ డైట్ లో రాగులను తప్పనిసరిగా జోడించాలి. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి బలం, శక్తి అందుతాయి.

కిడ్నీల్లో రాళ్లు
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే శక్తి రాగులకు ఉంది. కిడ్నీల్లో స్టోన్స్ వేధిస్తుంటే.. రాగులతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. రాగులు కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది.

ఆందోళన
రాగుల్లోని ట్రిప్టోథాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అందువల్ల ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి వంటి సమస్యల నివారణకు రాగులకు ఫ్రిఫర్ చేయడం మంచిది.



Click it and Unblock the Notifications