For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇతర నూనెల కంటే వేరుశెనగ నూనెలో గొప్ప ప్రయోజనాలు...

|

సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ దేశంలో ఎక్కువగా పండించే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. వేరు శెనగ చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్నశాకాహారము. ఒక కిలో మాంసములో లబించే మాంసకృత్తులు అదే మోతాదు వేరుశెనగలో లభిస్తాయి. ఒక కోడి గుడ్డుకి సమానము వేరుశెనగ పప్పును తీసుకొని అంచనవేస్తే .. గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి.

వేరుశెనగ నూనె, వేరుశెనగ పేరును సూచిస్తుంది. వేరుశెనగ నుండి ఉద్భవించిన ఈ రకమైన వెజిటబుల్ నూనెను వంటలలో సాదారణంగా ఉపయోగిస్తారు. ఇవి అపరాలుగా ఉన్నాయి. వీటిలో శుద్ధి,శుద్ది చేయని,బెక్ చేసిన, కోల్డ్ఒత్తిడి వంటి అనేక రకాలు ఉంటాయి. శనగ నూనెలో వాటి పోషక విలువ మరియు ఆరోగ్య ప్రయోజనాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. సాధారణంగా ప్రజలు ఆసక్తికరమైన రుచి కోసం వంటలలో వేరుశెనగ నూనెను ఉపయోగిస్తారు. ముఖ్యంగా అనేక రకాలను బేక్ చేయటానికి, ఇతర నూనెల కంటే ఈ నూనె మంచిది మరియు ఆరోగ్యకరమైనది.

పిల్లల్లో అనేక సమస్యలకు పరిష్కారం పీనట్ బటర్

సాదారణంగా వేరుశనగ నూనెను చైనా యొక్క వంటకాలు మరియు వియత్నాం,లావోస్, కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాలతో సహా అన్ని ఆసియా సంస్కృతుల్లో ఉపయోగిస్తారు.

వేరుశెనగ నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిలో ఒలిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం,పల్మిటిక్ ఆమ్లం మరియు లినోలెనిక్ ఆమ్లం వంటి కొవ్వు ఆమ్లాలు దాని విభిన్న రకాల నుండి వస్తాయి. కొవ్వు ఆమ్లాలు యొక్క అసమతుల్య స్థాయిలు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు. వివిధ రకాల వేరుశెనగ నూనె మీ ఆరోగ్యం పెంచడానికి చాలా సురక్షితంగా సంతులనం చేస్తుంది. వేరుశెనగలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజాలు మరియు కర్బన సమ్మేళనాలు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ రుచికరమైన వంట నూనెలో ఆకట్టుకొనే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

వేరుశెనగ నూనెలో ఇతర కూరగాయల్లో వుండే విధంగా ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. వేరుశెనగ నూనెలో ఉండే ధాతువులు ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

క్యాన్సర్ నివారణి:

క్యాన్సర్ నివారణి:

వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వేరుశెనగ నూనెలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి.

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది:

ఇందులో ఉండే రెస్వెట్రాల్‌ ఆకట్టుకునే స్థాయిలో రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్‌ ప్రత్యేకించి వైరల్‌ అంటువ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

రక్తపోటు రెస్వెట్రాల్ శరీరం లో మరొక ముఖ్యమైన ఫంక్షన్ ను చేస్తుంది. ఇది రక్త నాళాలను ప్రభావితం చేసే శరీరంలో వివిధ హార్మోన్లు సంకర్షణకు యాంజియోటెన్సిన్ వంటి హార్మోన్ ను కలిగి ఉంటుంది. ఇది నాళాలు మరియు ధమనులను బిగుతుగా ఉంచుతుంది. ఈ హార్మోన్ యొక్క ప్రభావాలను తటస్థం చేయటం ద్వారా, సేకరించే రెస్వెట్రాల్ హృదయనాళ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

 రక్తపోటును తగ్గించడానికి

రక్తపోటును తగ్గించడానికి

రెస్వెట్రాల్ శరీరం లో మరొక ముఖ్యమైన ఫంక్షన్ ను చేస్తుంది. ఇది రక్త నాళాలను ప్రభావితం చేసే శరీరంలో వివిధ హార్మోన్లు సంకర్షణకు యాంజియోటెన్సిన్ వంటి హార్మోన్ ను కలిగి ఉంటుంది. ఇది నాళాలు మరియు ధమనులను బిగుతుగా ఉంచుతుంది. ఈ హార్మోన్ యొక్క ప్రభావాలను తటస్థం చేయటం ద్వారా, సేకరించే రెస్వెట్రాల్ హృదయనాళ వ్యవస్థ మీద ఒత్తిడి తగ్గించి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ధమనులకు రక్తంను సరఫరా చేస్తుంది.

క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ అనారోగ్యకరమైనది . ఇది ఇంటర్నల్ ఆర్గాన్స్ మరియు టిష్యులను డ్యామేజ్ చేస్తుంది. మరియు ఇది హార్ట్ సమస్యలు, మధుమేహం, మరియు ఓబేసిటికి దారితీస్తుంది . కాబట్టి రెగ్యులర్ డైట్ లో పీనట్ ఆయిల్ చేర్చుకోవాలి.

తగిన ఎనర్జీని అందిస్తుంది:

తగిన ఎనర్జీని అందిస్తుంది:

పీనట్ ఆయిల్లో ఉండే మంచి ఫ్యాట్స్ శరీరంలోని ఇతర బాగాలకు కూడా అందిస్తుంది. దాంతో అధిక బరువు పెరగకుండా నివారిస్తుంది. ఎనర్జీ పెరుగుతుంది.

స్టొమక్ ప్రాబ్లెమ్స్:

స్టొమక్ ప్రాబ్లెమ్స్:

పీనట్ ఆయిల్ వివిధ రకాల డిజార్డర్స్, మలబద్దకం, జీర్ణ సమస్యలు మరియు డయోరియా వంటి సమస్యలను నివారిస్తుంది.

బరువు మరియు శరీసౌష్టం పెంచుకోవడానికి:

బరువు మరియు శరీసౌష్టం పెంచుకోవడానికి:

వేరుశనగలో ఉన్న అధిక ప్రోటీన్స్, మినిరల్స్, యాంటియాక్సిడెంట్ మరియు విటమిన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడుతాయి.

యాంటిఆక్సిడెంట్స్:

యాంటిఆక్సిడెంట్స్:

వేరుశెనగలను తినడం వల్ల అతి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం స్టొమక్(కడుపు) క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాలీ ఫినోల్ యాక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ:

ఇందులో విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంటి. ఇది చర్మ రక్షించడమే కాకుండి ఆక్సిజన్ ప్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది.

న్యూట్రిషియన్స్:

న్యూట్రిషియన్స్:

వేరుశెనగలో బి కాంప్సెక్స్ విటమిన్స్ అధికంగా ఉండటం చేత అందులో రిబోఫ్లెవిన్, థైమిన్, విటమిన్ బి మరియు ఫాంటోథెనిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి ఇవి మెదడును చురుకుగా ఉంచడంతో పాటు, రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకల నిర్మాణానికి కావల్సిన క్యాల్షియం, ఐరన్ ను అందిస్తుంది.

గుండె జబ్బు, క్యాన్సర్:

గుండె జబ్బు, క్యాన్సర్:

వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.

హెచ్చరిక

హెచ్చరిక

సాధారణంగా వేరుశనగ నూనెలో కొవ్వు ఆమ్లాల రకాలు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, వాటిని తగు మొత్తాలలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్యకరముగా ఉంటాయి. వాటిలో కొవ్వులు మరియు కేలరీలు అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వేరుశెనగ నూనెతో వంట చేసేటప్పుడు, ఎక్కువగా వాడితే అది బరువు పెరుగుటకు దారితీస్తుంది. ఊబకాయ సంబంధ ఆరోగ్య సమస్యల పరిధిని కలిగి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతంగా వాడి ఆనందించండి.

English summary

Amazing Health Benefits Of Peanut Oil

Amazing Health Benefits Of Peanut Oil,Peanut oil is a natural edible, sweet-flavoured oil. It is light yellow in colour and has a neutral taste. Peanut oil is extracted from pressing the peanut kernels.
Story first published: Wednesday, March 2, 2016, 17:58 [IST]
Desktop Bottom Promotion