For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బనానా మిల్క్ షేక్ లోని అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

|

ఉదయం అల్పాహారం స్కిప్ చేస్తున్నారా? మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ తయారుచేయడానికి మీకు సమయం సరిపోవడం లేదా తినడానికి సమయం చాలట లేదా అయితే మీకు ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ పరిచయం చేస్తున్నాము. అదే బనానా మిల్క్ షేక్ రిసిపి. ఇది ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఒక బెస్ట్ ఆప్షన్.

బనానా మిల్క్ షేక్ మన శరీరానికి అవసరం అయ్యే పోషకహారాలను అందిస్తుంది . దీన్ని వెంటనే మీరు త్రాగలేకపోయినా, బాటిల్లో మీ వెంట పట్టుకెళ్ళ వచ్చు. ట్రావెలింగ్ లోనో...లేదా ఆఫీస్ లోనో సమయం ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా తాగేవయచ్చు.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

బనానా మిల్క్ షేక్ ను తయారుచేయడం చాల సులభం. బనానా మిల్క్ షేక్ తయారుచేయడానికి కేవలం రెండు పదార్థాలు చాలు. అంతే కాదు మీకు అవసరం అనిపిస్తే కొద్ది ప్రోటీన్ పౌడర్, ఫ్లేవర్ ను జోడించుకోవచ్చు . అలాగే ఎవరైతే వర్కౌట్స్ చేస్తుంటారో అలాంటి వారు కూడా దీన్ని వ్యాయామం తర్వాత తీసుకోవచ్చు. బనానా మిల్క్ షేక్ లో ఉండే ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ మజిల్స్ ను బలోపేతం చేస్తాయి. ఎనర్జీని అందిస్తాయి.

బనానా మిల్క్ షేక్ లో ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, మరియు ఇతర మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి బనానా మిల్క్ షేక్ లో ఉండే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

బెనిఫిట్ 1:

బెనిఫిట్ 1:

బానానా మిల్క్ షేక్ లో ఉండే పెక్టిన్ అనే సోలబుల్ ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థకు గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు మలబద్దకాన్ని నివారిస్తాయి.

బెనిఫిట్ 2:

బెనిఫిట్ 2:

రోజంత యాక్టివ్ గా ఉండాలన్నా మరియు చురుకుగా పనిచేయాలన్నా తగినంత శక్తిసామర్థ్యాలు అవసరం అవుతాయి . అందుకు అవసరం అయ్యే పోషకాలన్నీ బనానా మిల్క్ షేక్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ ఎనర్జీని అందిస్తాయి.

బెనిఫిట్ 3 :

బెనిఫిట్ 3 :

పాలలో ఉండే క్యాల్షియం కంటెంట్ బోన్ డెన్సిటిని ప్రమోట్ చేస్తుంది.

బెనిఫిట్ 4 :

బెనిఫిట్ 4 :

బనానా మిల్క్ షేక్ లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంది. ఈ న్యూట్రియంట్ శరీరంలో న్యూక్లియిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డిఎన్ ఎ అభివ్రుద్దికి చాలా సహాయపడుతుంది. అంతే కాదు హెల్తీ బ్లడ్ సర్క్యులేషన్ ను ప్రోత్సహిస్తుంది.

బెనిఫిట్ 5 :

బెనిఫిట్ 5 :

పాలలో ఫాస్పరస్ కంటెంట్ అధికంగా ఉంటుంది . శరీరంలో కణాలకు తగిన శక్తిని అందివ్వడానికి ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . మరియు బోన్స్ స్ట్రాంగ్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బెనిఫిట్ 6 :

బెనిఫిట్ 6 :

పాలలో విటమిన్ ఎ కూడా అధికం. కాబ్టటి వ్యాధినిరోధకశక్తి పెంచడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది . దాంతో హెల్తీ స్కిన్ మరియు మంచి కంటి చూపును పొందవచ్చు.

బెనిఫిట్ 7 :

బెనిఫిట్ 7 :

హెల్తీ బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేస్తుంది. హెల్తీ బోన్స్ మరియు హెల్తీ లెవల్స్ ఎలక్ట్రోలైట్స్, శరీరానికి పొటాసియం మరియు మెగ్నీషియం అధికంగా అవసరం అవుతుంది .ఈ డ్రింక్ వల్ల శరీరానికి ఎక్కువగా మినిరల్స్ అందుతాయి.

English summary

Health Benefits Of Banana Milkshake

Do you have the habit of skipping breakfast? If you don't have enough time to prepare your morning meal or eat it, then banana milkshake can be the best option for you.
Story first published: Monday, February 22, 2016, 15:23 [IST]
Desktop Bottom Promotion