For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంచదార లేకుండా రోజూ ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ తాగితే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

సాధారణంగా జ్యూస్ లు తాగకూడదు అని చెబుతుంటారు. పండ్లను డైరెక్ట్ గా తీసుకోవడమే మంచిదని సూచిస్తుంటారు. ఎందుకంటే.. జ్యూస్ లలో మిక్స్ చేసే పంచదార వల్ల అది ఆరోగ్యానికి హానికరమని అలా సూచిస్తారు. అయితే.. పంచదార లేకుండా జ్యూస్ తాగితే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చట.

ముఖ్యంగా ద్రాక్ష పండ్ల రసంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలున్నాయి. రోజూ ఓ గ్లాసు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చట. అయితే ప్రతిరోజూ తీసుకోవాలి కాబట్టి పంచదార మిక్స్ చేసుకోకుండా.. ఒట్టి ద్రాక్ష పండ్ల రసాన్ని మాత్రమే తీసుకుంటే మంచిదని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి పంచదార లేకుండా ప్రతిరోజూ గ్లాసు ద్రాక్ష జ్యూస్ తాగడం వల్ల పొందే బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

వ్యాధినిరోధక శక్తి

వ్యాధినిరోధక శక్తి

ద్రాక్షలో ఉండే విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల ద్రాక్ష ఇమ్యునిటీ సిస్టమ్ కు బలం చేకూరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పంచదార మిక్స్ చేయని గ్రేప్ జ్యూస్ తీసుకోవడం మంచిది.

మెటబాలిజం

మెటబాలిజం

ద్రాక్ష రసంను పంచదార లేకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని మెటబాలిజం స్థాయి పెరుగుతుంది. ఎర్రద్రాక్ష రసం.. మెటబాలిజంను వేగంగా పెంచుతుంది.

హైబీపీ

హైబీపీ

పంచదార మిక్స్ చేయకుండా గ్రేప్ జ్యూస్ తీసుకోవడం వల్ల హైబీపీ కంట్రోల్ అవుతుంది.

రక్తప్రసరణ

రక్తప్రసరణ

ద్రాక్షలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్లు గుండె కండరాలను రిలాక్స్ చేసి, రక్తప్రసరణను మెరుగుపరిచి.. రక్తపోటును నియంత్రించే గుణం ఉంటుంది. దీనివల్ల గుండెపోటు వంటి సమస్యలు దూరంగా ఉంటాయి.

క్యాలరీలు కరగడానికి

క్యాలరీలు కరగడానికి

వ్యాయామం చేసిన వెంటనే ఒక గ్లాసు గ్రేప్ జ్యూస్ ని పంచదార కలపకుండా తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. దీనివల్ల కొవ్వు, క్యాలరీలు కరిగిపోతాయి. ఇలా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తలనొప్పి

తలనొప్పి

ద్రాక్ష రసాన్ని పంచదార చేర్చకుండా తీసుకుంటే తలనొప్పి కూడా వెంటనే తగ్గిపోతుంది.

టాక్సిన్స్

టాక్సిన్స్

ద్రాక్ష రసం రక్తంలోని హానికారక టాక్సిన్‌లను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరచి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

English summary

Health Benefits of Grapes Juice without Sugar

Health Benefits of Grapes Juice without Sugar. Flavonoids found in grape juice raise the level of HDL (good) cholesterol. This prevents blockage of arteries and the heart remains healthy.
Story first published:Tuesday, September 13, 2016, 12:08 [IST]
Desktop Bottom Promotion