Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
ఫ్రూట్ జ్యూసుల కన్నా, వెజిటేబుల్ జ్యూస్ లు ఉత్తమైనవి...
సహజంగా కూరగాయలను మిక్సీలో బ్లెడ్ చేయడం ద్వారా వెజిటేబుల్ జ్యూస్ తయారవుతుంది . వెజిటేబుల్స్ లో పండ్లలో కంటే షుగర్ తక్కువగా ఉంటుంది. వెజిటేబుల్ ను జ్యూస్ ను త్రాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఫ్రూట్ జ్యూసులతో పోల్చితే కూరగాయల జ్యూస్ లు చాలా విభిన్నమైన టేస్ట్ తో ఉంటాయి. అన్ని రకాల కాయగూరలతో చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల అనేకరకాల పోషకాలు ఒకేసారి పొందవచ్చు. కూరగాయల రసం ద్వారా పుష్కలంగా ఫైబర్ అందుతుంది. ఇందులో ఫైటోకెమికల్స్, కలర్, ఫ్లేవర్, పోషకాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!
ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడానికి ముందు వెజిటేబుల్ జ్యూస్ త్రాగడం మంచిది. ఆరోజతంగా ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా కేల్ లేదా ఆకుకూరలను ఎంపిక చేసుకోవడం ద్వారా శరీరం హెల్తీ గా ఉండటానికి సహాయపడుతుంది. నిజానికి క్యారెట్ జ్యూస్ లేదా పొటాటో జ్యూస్ లేదా బీట్ రూట్ జ్యూస్ లేదా ఆకుకూరల రసం ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . వీటిని బయట తాగడం కంటే ఇంట్లో తయారుచేసుకొని తాగడం చాలా మేలు జరుగుతుంది. వీటికి షుగర్ లేదా సాల్ట్ ను జోడించడం వల్ల మరిన్ని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
శరీరంలో అధనపు కొవ్వును కరిగించి.. వేగంగా బరువు తగ్గించే నేచురల్ జ్యూసులు
సాధారణంగా మనం ఇలాంటి జ్యూస్ లను మనం అనారోగ్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తుంటాము. ఇది మనం అలవాటు చేసుకోండం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు . లిక్వడ్ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కొలెస్ర్టాల్ లెవెల్ తగ్గించడానికి, ఆందోళన నుంచి బయటపడటానికి ఇలా రకరకాల సమస్యలకు రకరకాల వెజిటబుల్ జ్యూస్ లు ఉపయోగపడతాయి. అయితే ఏ జ్యూస్ వల్ల ఎలాంటి లాభం పొందుతారో తెలుసుని ఫాలో అయిపోండి.

ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి
ఇమ్యాజిన్ చేసుకోండి: మిమ్మల్ని రెండు క్యాబేజ్ లను తినమన్నప్పుడు మీరు తింటారా? ఖచ్చితంగా తినలేరు, కానీ రెండు క్యాబేజీల రసాన్ని సులభంగా తాగగలరు. ఈ జ్యూస్ వల్ల మరిన్ని ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందగలరు.

శరీరానికి తగిన హైడ్రేషన్ ను అంధిస్తాయి
కొన్ని వెజిటేబుల్స్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మరియు జ్యూసులు ఫ్లూయిడ్స్ . ఎప్పుడైతే వీటిని తీసుకుంటామో అప్పుడు శరీరం పూర్తిగా హైడ్రేషన్ కు గురి అవుతుంది.ఇది ఆరోగ్యానికి చాల మేలుచేస్తుంది.

మీరు ఎనర్జిటిక్ గా ఫీలవుతారు :
వెజిటేబుల్ జ్యూస్ అన్ని రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ పొందడం వల్ల శరీరం పూర్తి పోషింపబడుతుంది మరియు ఎనర్జిటిక్ గా ఫీలవుతారు.

న్యూట్రీషియన్స్ ను బెటర్ గా గ్రహిస్తుంది:
వెజిటేబుల్ జ్యూస్ ను తాగినప్పుడు . వాటిలోని పోషకాలు చాలా వేగంగా శరీరం గ్రహిస్తుంది. అదే విధంగా వెజిటేబుల్ ను నేరుగా తిన్నప్పుడు, శరీరంలో ఉన్న న్యూట్రీషియన్స్ ప్రొసెస్ చేయడానికి , మరియు శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. ఇది కొంత సమయం తీసుకొన్నా, ఫాస్ట్ గా గ్రహిస్తుంది.

వెరైటీ చాలా సులభం:
కొన్ని రకాల వెజిటేబుల్స్ ను ఇష్టపడుతారు, అలాగే కొన్ని రకాల వెజిటేబుల్స్ రుచిలేకుండుట వల్ల వీటిని తినడానికి ఇష్టపడరు.అలాంటి వెజిటేబుల్స్ ను జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది . దాంతో మరింత ఉత్తమ వెరైటీ జ్యూస్ ను మీ ఆరోగ్యానికి అందించిన వారవుతారు.

జీవక్రియలను డిటాక్సిఫై చేస్తుంది:
వెజిటేబుల్ జ్యూసుల వల్ల శరీరం డిటాక్సిఫై చేస్తుంది. దాంతో శరీరం తేలికగా మరియు ఎనర్జిటిక్ గా ఉంటుంది. నిజానికి మీ రెగ్యులర్ డైట్ తో పాటు వెజిటేబుల్ జ్యూస్ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

షుగర్ ఉండదు:
ఫ్రూట్ జ్యూస్ లు కూడా ఆరోగ్యకరమే, కానీ వాటిలో షుగర్స్ ఉంటాయి . కానీ వెజిటేబుల్ జ్యూసుల్లో షుగర్స్ ఉండవు , అలాగే వీటిలో క్యాలరీలు కూడా తక్కువే.,.

క్యారెట్ జ్యూస్
పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉన్న క్యారెట్ జ్యూస్ బ్లడ్ కొలెస్ర్టాల్ తగ్గించడానికి సహకరిస్తుంది. అంతేకాదు రక్త పీడనం అంటే బీపీని కంట్రోల్ చేయడానికి, రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మధుమేహం, బీపీ ఉన్న వాళ్లు రెగ్యులర్ గా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్
బీట్ రూట్, క్యారెట్, కీర దోసలతో కలిపి జ్యూస్ తయారు చేసి తీసుకోవడం వల్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. రక్తంలో యురిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే.. జాయింట్ పెయిన్స్, చర్మంపై దురదలకు కారణమవుతుంది. కాబట్టి బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.

స్లిమ్మింగ్ జ్యూస్
10 గ్రాముల కేల్, 5 గ్రాముల బచ్చలి, 5 గ్రాముల కీరదోస, 5 గ్రాముల పాలకూర తీసుకుని అన్నీ కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. ఈ జ్యూస్ తొడల భాగంలో ఉండే ఫ్యాట్ ని కరిగిస్తుంది. ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక నెల రోజులు ఈ ట్రీట్ మెంట్ ఫాలో అయితే స్లిమ్ గా తయారవుతారు.

క్యాబేజ్ జ్యూస్
చర్మంపై ముడతలు, నల్లటి మచ్చలు, నిర్జీవంగా మారిన చర్మం.. ఇవన్నీ వయసు పెరుగుతున్న ఛాయలు తెలుపుతాయి. ఈ లక్షణాలన్నింటి నుంచి బయటపడాలంటే.. 5 గ్రాముల క్యాబేజ్, 4 గ్రాముల క్యారెట్, 3 గ్రాముల రెడ్ పెప్పర్ తీసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ హెల్తీ డ్రింక్ ని రోజూ మూడు వారాలపాటు తీసుకోవడం వల్ల యంగ్ లుక్ సొంతం చేసుకుంటారు.

కీరదోస, పాలకూర జ్యూస్
ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారం వెజిటబుల్ జ్యూస్. కీరదోస, పాలకూర కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

కేల్, గ్రీన్ గ్రేప్స్ జ్యూస్
కేల్, గ్రీన్ గ్రేప్ జ్యూస్ ని రుతుక్రమ సమయంలో, ప్రెగ్నెన్సీ సమయంలో తాగడం మంచిది. ఎందుకంటే దీనిలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సరిగా జరగడానికి, ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











