For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసే ఎండు ద్రాక్ష..!!

By Sindhu
|

ఎండుద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని తీసుకుంటే.. చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా వెలివేసినవారమవుతాం. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీల కు ఇది ఎంతో ఉపయోగం.

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిఅయ్యే ద్రాక్షలో 80 శాతం పంటను వైన్‌ తయారీలో వాడుతారు. ఏడు శాతాన్ని ఎండు ద్రాక్షగా మలుస్తారు. మిగిలిన, శాతాన్ని మాత్రమే తాజాగా తినడానికి గాని జ్యూస్‌ తీసి వాడుకోవటానికి గాని వాడుతారు. మంచి పోషకాహర విలువలు కలిగి ఉం టాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి.

వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే.. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్‌, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.వీటితో మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

హైబిపి , క్యాన్సర్ తగ్గిస్తాయి..

హైబిపి , క్యాన్సర్ తగ్గిస్తాయి..

వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి.

రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్‌ బి కాంప్లెక్‌‌స, ఐరన్‌ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌

సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్‌ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగి సంతానము కలుగుతుంది.

మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినుటవలన

మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినుటవలన

మహిళలు ప్రతిరోజూ కిస్‌మిస్‌ పండ్లు తినుటవలన యూరినల్‌లో ఆమోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

కిస్‌మిస్‌ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రానీయకుండా చేస్తుంది. 200 మిల్లిగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్‌ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి

రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి

అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలము చేకూరటానికి పది కిస్‌మిస్‌ పండ్లను నీళ్ళలోవేసి బాగా వుడకబెట్టి గుజ్జుగా వేసి తాగడం చేయాలని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే వారికి వారంపాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్ష పొలుకులను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటునుంచి ఉపశమనం కలుగుతుంది.

గొంతు వ్యాధితో బాధపడేవారు

గొంతు వ్యాధితో బాధపడేవారు

గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది.

 మలబద్దకంతో బాధపడేవారు

మలబద్దకంతో బాధపడేవారు

మలబద్దకంతో బాధపడేవారు ప్రతిరోజూ రాతప్రూట పడుకునేముందు ఎండుద్రాక్షతోబాటు సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకంనుంచి ఉపశమనం కలుగుతుంది.

ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో

ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో

ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతా యి.

రక్త హీనతకు

రక్త హీనతకు

వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తం లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం.

English summary

Raisins can help lower blood pressure ..!

Aside from being a tasty little addition to banana bread and oatmeal cookies, raisins could also have benefits for blood pressure, according to a small new study.
Story first published: Monday, December 26, 2016, 19:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more