For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తోపాటు ఎలాంటి తలనొప్పి రాకుండా.. నివారించే ఆహారాలు..!!

By Swathi
|

తరచుగా మైగ్రేన్ తో బాధపడుతున్నారా ? మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. లైటింగ్, శబ్ధం ఏమీ భరించలేక.. చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మైగ్రేన్ తో బాధపడేటప్పుడు.. పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో.. మైగ్రేన్ పేషంట్స్ ని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యేలా చేస్తుంది.

తీవ్రమైన తలనొప్పి, వికారం వంటి లక్షణాలు ఇబ్బందిపెడతాయి. మెడ నొప్పి, ముఖంలో నొప్పి, అలసట, నీరసం, చూపు మందగించడం, ముక్కులో సమస్య వంటి లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తాయి. మైగ్రేన్ ఒక్కరికి ఒక్కోలా ఉంటుంది.

సాధారణంగా మైగ్రేన్ తలనొప్పి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెరిడిటీ, డిప్రెషన్, ఆందోళన, అసమతుల్య ఆహారం, కాంట్రాసెప్టివ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, మెనోపాజ్ వంటివి కారణాలు. చాలామంది మైగ్రేన్ తో బాధపడేవాళ్లు పెయిన్ కిల్లర్స్ తో ఉపశమనం పొందుతారు.

కానీ.. పెయిన్ కిల్లర్స్ ఉపశమనం కలిగించినా.. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కి కారణమవుతాయి. కాబట్టి.. మైగ్రేన్ తగ్గించుకోవడానికి కొన్ని ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మైగ్రేన్ ని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చట.

ఆకుకూరలు

ఆకుకూరలు

స్పినాచ్, పుదీనా వంటి ఆకు కూరల్లో విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. రక్త ప్రసరణను తలలో మెరుగుపరుస్తాయి. దీనివల్ల మైగ్రేన్ కి దూరంగా ఉండవచ్చు.

నట్స్

నట్స్

మైగ్రేన్ తలనొప్పి.. మెగ్నీషియం డెఫీసియన్సీ వల్ల వస్తుంది. నట్స్, డ్రై ఫ్రూట్స్ లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి.. ఎఫెక్టివ్ గా మైగ్రేయిన్ ని తగ్గిస్తాయి.

రెడ్ మీట్

రెడ్ మీట్

రెడ్ మీట్ గుండెకు మంచిది కాదు. కానీ.. మెగ్రేన్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో బి12, CoQ10 ఉంటుంది.

ఎగ్

ఎగ్

పోషకాలు ఉండటమే కాకుండా ఎగ్స్ హెల్తీ. వీటిల్లో బి 2 ఉంటుంది. ఇది ఎఫెక్టివ్ గా మైగ్రేన్ ని తగ్గిస్తుంది. బ్రెయిన్ కి బ్లడ్ ఫ్లోని మెరుగుపరుస్తుంది.

చేపలు

చేపలు

చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉంటాయి. ఈ రెండూ.. మైగ్రేన్ కి సంబంధించిన తలనొప్పులు నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

ధాన్యాలు

ధాన్యాలు

బార్లీ, ఓట్స్, క్వినోవా వంటి ధాన్యాలు.. హైపోగ్లిసిమియా, మైగ్రేన్ నివారించడంలో సహాయపడతాయి. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. మైగ్రేన్ ఎటాక్స్ ని అడ్డుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని రెగ్యులేట్ చేసి.. మైగ్రేన్ రాకుండా అడ్డుకుంటాయి.

English summary

These Kitchen Ingredients Can Prevent Migraines Effectively!

These Kitchen Ingredients Can Prevent Migraines Effectively! If you are someone who is prone to getting migraine attacks, you would know all about the excruciating pain it causes!
Story first published:Friday, August 12, 2016, 17:11 [IST]
Desktop Bottom Promotion