For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ కిడ్నీ డే: కిడ్నీ స్టోన్స్ ను నివారించే నేచురల్ జ్యూసులు

|

మార్చి 10న వరల్డ్‌ కిడ్నీ డే--ప్రతి ఏటా మార్చి 2వ గురువారం దీన్ని జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ (మూత్రపిండాల) జబ్బులు పెరుగు తున్నాయి. దానికి సంబంధించిన చికిత్సా విధానాల్లో అత్యాధునిక మార్పులు వస్తున్నాయి. ప్రజల్లో వ్యాధుల గురించి అవగాహన పెంచి, కిడ్నీ మరణాలు తగ్గించడం, జీవనశైలిని మెరుగుపరచడం 'కిడ్నీ డే' ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా మార్చి నెల రెండో గురువారం నాడు దీన్ని నిర్వహిస్తారు. 2006వ సంవత్సరం నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు.

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. మూత్ర పిండాలు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ 'డయాలసిస్‌' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

మూత్రపిండాల్లో రాళ్ళను నివారించడానికి సహజ పద్దతులు

మారుతున్న జీవనశైలి కారణంగా.. అనారోగ్య సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటం అనేది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న సమస్య. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల కొన్ని సందర్భాల్లో మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా కూడా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు కొన్ని రసాయనాల వల్ల ఉత్పన్నం అవుతాయిన నిపుణులు చెబుతున్నారు. ఆ రసాయనాలు అంటే యూరిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, మరియు ఆక్సాలిక్ యాసిడ్ వంటివి యూరిన్ లో కనుగొన్నప్పుడు ఇలా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతాయని కనుగొన్నారు. కిడ్నీ స్టోన్ కు మరో సాధారణ కారణం, అత్యధికంగా విటమిన్ డి, పోషకాల లేమితో బాధపడే వారిలో, డీహైడ్రేషన్, గౌట్ పెయిన్ మరియు సరైన సమయంకు ఆహారం తీసుకోని వారిలో ఈ సమస్య ఏర్పడుతుందని నిపుణుల చెబుతున్నారు.

కిడ్నీలో స్టోన్స్ కు మీరు తీసుకొనే ఆహారమే కారణమా...

మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్ళ సైజును బట్టి, కడుపు ఉదరభాగంలో (ఆబ్డామినల్)నొప్పి తీవ్రంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల భరించలేనంత నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, మూలికా చికిత్స చాలా అవసరం. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. చిన్నవిగా ఉన్నప్పుడు మందులతోనే నయం అవుతుంది. కానీ.. మందులతో అవసరం లేకుండా.. ఇంట్లోని వస్తువులతోనే.. కిడ్నీల్లో స్టోన్స్ ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంట్లో తయారుచేసుకొనే కొన్ని నేచురల్ డ్రింక్స్ తో కిడ్నీస్టోన్స్ ను కరిగించుకోవడం లేదా తొలగించుకోవచ్చు . కిడ్నీలో స్టోన్స్ చిన్నగా ఉన్నట్లైతే వాటిని నేచురల్ పదార్థాలతో యూరిన్ రూపంలో బయటకు విసర్జింపచేస్తాయి . మరి కిడ్నీస్టోన్స్ ను ఫ్లష్ అవుట్ చేసే నేచురల్ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

తులసి టీ:

తులసి టీ:

తులసి టీ లేదా తులసి టీ కిడ్నీలను బలోపేతం చేయడం మరియు కిడ్నీలకు శుభ్రం చేయడం జరుగుతుంది. తులసి టీ బ్లడ్ లో యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తుంది. ఇందులో ఎసిటిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. తులసి ఆకులను రెగ్యులర్ గా తీసుకుంటే నొప్పి కూడా తొలగిస్తుంది.

దానిమ్మ జ్యూస్ :

దానిమ్మ జ్యూస్ :

దానిమ్మను అలాగే తీసుకోవడం కానీ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం కానీ జరిగితే కిడ్నీస్టోన్స్ సులభంగా తొలగిపోతాయి . అంతే కాదు, యూరిన్ లో అసిడిక్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. మరియు టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేయడానికి సహాయపడుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

కిడ్నీస్టోన్స్ పచ్చి యాపిల్ సైడర్ వెనిగర్ ను వాటర్లో మిక్స్ చేసి త్రాగడం వల్ల కిడ్నీస్టోన్స్ కరిగిపోతాయి. మరియు శరీరంలోని ఫ్లూయిడ్స్ ఆల్కలైజ్ చేసి యూరిన్ రూపంలో కిడ్నీ స్టోన్స్ బయటకు తొలగిపోతాయి. కిడ్నీస్టోన్స్ తొలగిపోయినా కూడా తీసుకోవడం వల్ల తిరిగి కిడ్నీస్టోన్స్ ఏర్పడకుండా చేస్తుంది.

గ్రేప్ జ్యూస్ :

గ్రేప్ జ్యూస్ :

గ్రేప్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్ మరియు కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 బీట్ రూట్ జ్యూస్ :

బీట్ రూట్ జ్యూస్ :

బీట్ రూట్ జ్యూస్ రక్తంలో ఆక్సిజన్ ప్రసరణను పెంచుతుంది . మరియు ఇది గ్లూటాథియోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టాక్సిన్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అన్ని రకాల టాక్సిన్స్ ను యూరిన్ రూపంలో విసర్జిస్తుంది.

ఆపిల్ జ్యూస్:

ఆపిల్ జ్యూస్:

ఆపిల్ జ్యూస్ ను రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను దూరం చేసుకోవచ్చు .

జింజర్ టీ:

జింజర్ టీ:

అల్లం టీ లో గ్రేట్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు మెగ్నీషియంకు మంచి మూలం . అల్లం టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను నివారించుకోవచ్చు.

వాటర్ మెలోన్ జ్యూస్:

వాటర్ మెలోన్ జ్యూస్:

వాటర్ మెలోన్ ను తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం, ఏ రూపంలో తీసుకొన్నా కిడ్నీ స్టోన్స్ ను చాలా ఎఫెక్టిగా నివారిస్తుంది . వాటర్ మెలోన్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది యూరిన్ అసిడిక్ లెవల్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రేట్ అనే కంటెంట్ ఉండటం వల్ల ఇది కిడ్నీ స్టోన్స్ ను కరిగించడంలో మరియు యూరిన్ రూపంలో ఫ్లష్ అవుట్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

Story first published: Thursday, March 10, 2016, 16:35 [IST]
Desktop Bottom Promotion