For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఫుడ్స్ లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం

By Bharath Reddy
|

ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఆరోగ్య సంర‌క్ష‌ణ దృష్ట్యా కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తూ, పోష‌కాల‌ను అందించే వీటిని అందరూ తీసుకోవాల్సిందే. వీటిని నిత్యం మ‌న ఆహారంలో భాగంగా తీసుకుంటే దాంతో బోలెడు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మనం తీసుకొనే ఆహారాలు, న్యూట్రీషియన్ ఫుడ్స్ ద్వారా మాత్రమే ఫ్యాటీయాసిడ్స్ ను పొందగలం. ఈ ప్యాటీ యాసిడ్స్ శరీరంలో కణాల ఏర్పాటుకు , మెటబాలిక్ రేటు పెంచడానికి మరియు బయోకెమికల్ ప్రొసెస్ కు సహాయపడుతాయి. గుండె, మెదడ్ చురుగ్గా పని చేయాలంటే ఇవి అత్యంత అవసరం. అలాగే గర్భిణులు కూడా వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

ఫ్యాటీ యాసిడ్స్ కడుపులో బిడ్డ పెరుగుదలకు తోడ్పడుతాయి. వీటిని ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్, చమురు, చేపల నుంచి పొందవచ్చు. తక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ యాసిడ్స్ ఉన్న ఆహార పదార్థాలు తగినంత తీసుకోవడం వల్ల ప్రోస్టాగ్లాండిన్స్, సమతుల్య ఉత్పత్తి నిర్వహిస్తుంది. ప్రోస్టాగ్లాండిన్స్ రక్తపోటు, రక్తం గడ్డ కట్టడం, ఇతర అలెర్జీ ప్రతిస్పందనలు సహా ముఖ్యమైన మానసిక విధులు నియంత్రించేందుకు సహాయం చేస్తుంది.

Best Food Sources Of Essential Fatty Acids

ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ను అధిగమించవచ్చు.దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. శరీరంలో కొవ్వును తగ్గించడంతో పాటు హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు. అలాగే మతిమరుపుతో బాధపడే వారికి ఫ్యాటి యాసిడ్స్ లభించే ఫుడ్ చాలా మంచిది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజలు

అవిసె గింజలు

ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజలలో పుష్క‌లంగా ఉంటాయి. చేప‌ల వంటి మాంసాహారం త‌రువాత ఆ యాసిడ్లు అధికంగా ల‌భించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబ‌ర్‌) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ‌ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడ‌వ‌చ్చు. అలాగే అవిసె గింజ‌లలో కొలెస్ట్రాల్‌ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే 'అలసట' నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి మహిళల్లో హార్మోన్ల‌ను సమతుల్యం చేస్తాయి. రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగ‌ర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారిస్తాయి. అవిసె గింజల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెష‌న్‌ను కూడా

సమర్ధవంతంగా నివారించగలుగుతాయి. ఆస్తమా, ఎలర్జీల నుంచి ఉపశమనం అవిసె నూనె వల్ల లభిస్తుంది. 100 గ్రాముల అవిసె గింజల్లో

మొత్తం కొవ్వులు - 40 గ్రా (వీటిలో శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ - 64 %, పాలీ అన్‌శాచురేటెడ్‌ - 18%) ఉంటాయి. కొలెస్టరాల్‌ - 0 మి.గ్రా. సోడియం - 30 మి. గ్రా.

పొటాషియం - 813 మి.గ్రా. కార్బొహైడ్రేట్లు - 29 గ్రా. డైటరీ ఫైబర్‌ - 27 గ్రా. మాంసకృతులు - 18 గ్రా. కాల్షియం - /25%. మెగ్నీషియం - 98%. ఐరన్‌ - 31%.

విటమిన్‌ బి6 - 25% ఉంటాయి.

జనపనార గింజలు

జనపనార గింజలు

వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి. అలాగే ఇవి మన శరీరానికి కావాల్సిన ఇరవై అమినో ఆమ్లాలను అందిస్తాయి. ఫైబర్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటుంది. అమోఘమైన మినరల్స్ ను కలిగి ఉంటాయి. మెదడ్, గుండె పనితీరును మెరుగుపరచడానికి ఇవి సహాయం చేస్తాయి. రక్త సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడమే కాకుండా, అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తాయి. శరీరాన్ని బలోపేతం చేసేందుకు సహాయపడతాయి. కండరాలను, ఎముకలను గట్టిపరుస్తాయి. జీవక్రియ సక్రమంగా కొనసాగేలా చేస్తాయి. ఇందులో ఉంటే ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని హానికర యాసిడ్స్ బయటకు వెళ్లేలా తోడ్పడుతాయి. యాంటీ ఇన్ ఫ్లమేటరీ, అమినో ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు రాలే సమస్యను కూడా అధిగమించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి మంచి పోషక పదార్థాలు. అధిక ఒత్తిడి నుంచి బయపడొచ్చు. మతిమరుపును పోగొడతాయి. లివర్ ను ఆరోగ్యంగా మారుస్తాయి.

వాల్ నట్స్

వాల్ నట్స్

వాల్ నట్స్ ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుప్పెడు వాల్ నట్స్ తీసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం తొక్క తీసి తినాలి. లేదంటే.. ఈ తొక్క ద్వారా ఎక్కువ హాని కలుగుతుంది. వాల్ నట్స్ ని నానబెట్టి తినడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి. వాల్ నట్స్ ల్లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వాల్ నట్స్ ని ప్రతి రోజూ తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో గుండె వ్యాధుల రిస్క్ ఉండదు. అలాగే డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని అడ్డుకుంటాయి. వీటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, డిప్రెషన్ ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇక మెటబాలిజం వాల్ నట్స్ లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, జింక్ ఉంటాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలు, పళ్లను బలంగా మార్చడానికి సహాయపడుతుంది. మెదడు ఆరోగ్యానికి వాల్ నట్స్ ని మెదడు ఆరోగ్యానికి మంచిది.

బాదం

బాదం

బాదం తింటే మంచిది. వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయి. బాదం ఎక్కువగా మోనో సాకరైడేటేడ్ ఫాట్, ఆరోగ్యాన్ని పెంచే ఫాట్ ని కలిగి ఉంటుంది. ఒక రోజుకి 7 గ్రాముల బాదం తినటం వల్ల LDL- కొవ్వు స్థాయిలు 15 శాతం తగ్గుతాయి. బాదం ఎక్కువగా కాల్షియమ్, మేగ్నేషియం, ఫాస్ఫరస్'ను కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. దంతాలు, ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి ఈ పోషకాలు తప్పనిసరి. బాదం ఎక్కువగా ఫ్యాట్ యాసిడ్స్ కలిగి ఉన్నందున గర్బిణులకి ప్రసవ సమయంలో వచ్చే ఇబ్భందులను తగ్గిస్తుంది. బాదం, కణాలు ఏర్పడటాన్ని, కణాల పెరుగుదలలో ఉపయోగపడును. అలాగే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే బాదం తొక్కలో ఉండే టానిన్లు అందులోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అదే నానబెట్టి ఆ తొక్కను తీసేసి తినడంవల్ల అందులోని పోషకాలన్నీ పూర్తిగా ఒంటపడతాయి. నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్‌ అనే ఎంజైమ్‌ విడుదల వల్ల కొవ్వులు త్వరగా జీర్ణవుతాయి. వీటిల్లోని మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. నానబెట్టిన బాదంలో విటమిన్‌ బి7 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. ఫోలిక్‌ఆమ్లం పుట్టబోయే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె

కొలెస్ట్రాల్ కారణంగా వచ్చే సమస్యలు అధికమించడానికి ఆలివ్ నూనెను ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కొన్ని రకాలున్నాయి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది అత్యుత్తమ క్వాలిటీ నూనె. దీన్ని కెమికల్స్ వాడకుండా తయారు చేస్తారు దీన్ని.ఇందులో ఫ్యాటీ యాసిడ్ శాతం 0.8 శాతానికి మించదు. మరిగిస్తే చాలా నూనెలు వాసనను, రుచిని కోల్పోతాయి. దీనితో ఆ సమస్య రాదు. స్మోకింగ్ పాయింట్ తక్కువ ఉండటం వల్ల ఈ నూనెను మళ్లీ మళ్లీ వాడినా ప్రమాదం ఉండదు. ఇది అంత త్వరగా పాడవదు కూడా. అయితే ఆలివ్ జ్యూస్ నుంచి చేయడం వల్ల దీనికి ఘాటైన వాసన ఉంటుంది. రుచి కూడా కొంచెం వగరుగా అనిపిస్తుంది. ఇక వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో యాసిడ్ లెవెల్స్ రెండు శాతానికి మించవు. తర్వాత ప్యూర్ ఆలివ్ ఆయిల్ దే స్థానం. దీన్ని ప్రాసెసింగ్ చేయరు. కెమికల్స్ వాడరు. కాబట్టి ఈ నూనె కూడా మంచిదే.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

జొన్నలు, రాగులు, సజ్జలు, ఉదాలు, కొర్రలు, అరికెలు, వరిగెలు, సామలు, అవిసెలులాంటివి తృణధాన్యాలు. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అల్పాహారంలో ఈ తృణధాన్యాలను తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. వీటిలో ఎటువంటి కొవ్వు మూలకాలు ఉండవు. విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే ఫ్రోస్టెడ్ గోధుమలో ప్రోటీన్లు , ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే బెబ్బెర్లు ఉడకబెట్టి తినడం వలన బాలింతలకు శక్తి చేకూరుతుంది. ఇవి అసిడిటీ (ఆమ్లపిత్తం)ను తగ్గించి, ఆకలిని వృద్ధి పరుస్తాయి. అనుములను తినడం వలన వర్షాకాలంలో వచ్చే

రోగాలను అరికట్టవచ్చు. బాలింతల్లో పాలు వృద్ధిచెందుతాయి. సజ్జలు చాలా పౌష్టికరమైనవి. సజ్జలను నేతిలో వేయించి పొడి చేసి పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి పాలలో కలిపి తాగిస్తే దేహదారుఢ్యాన్ని, మనోబుద్ధి పెంపొందుతుంది. బెల్లంలో కలిపి తింటే రక్తహీనత తగ్గుతుంది. ఉలవలలో తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగులు ఉంటాయి. నల్ల ఉలవలు శ్రేష్టమైనవి. ఇవి మూత్రరోగాలను తగ్గిస్తాయి. మూత్రాశయంలో పెరిగే రాళ్లను కరిగించే గుణం వీటిలో ఉంటుంది. అవిశెలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. జలుబు, వాతాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, రేచీకటిని హరింపజేస్తాయి.

గుడ్డులోని పచ్చసొన

గుడ్డులోని పచ్చసొన

చాలామంది గుడ్డులో పచ్చసొనను తినరు. అది తింటే కొవ్వు భారీగా పెరుగుతుందని అనుకుంటారు. నిజమే... గుడ్డులో పచ్చసొనలో కొవ్వులు వుంటాయి. 50 గ్రాముల బరువున్న గుడ్డులో 5 గ్రాముల కొవ్వు లభిస్తుంది. కానీ అందులో శాచ్యురేటెడ్ కొవ్వులు 27 శాతమే. మిగిలినవన్నీ ఆరోగ్యకరమైన ఒమేగా ప్యాటీ 3 ఆమ్లాలే. కెరోటినాయిడ్లూ ఎ,ఇ,డి,కె విటమిన్లు కూడా అచ్చంగా పచ్చసొనలోనే వుంటాయి. విటమిన్ బి5, బి6, బి12, ఫోలేట్, కోలీన్లు, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, ఐరన్లలో 90 శాతం పచ్చసొనలో దొరుకుతుంది. ప్రోటీన్లు 40 శాతం వుంటాయి. డి విటమిన్ సహజంగా దొరికే ఆహారం గుడ్లు పచ్చసొన ఒకటి.

మెదడు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. అందకే పాలిచ్చే తల్లులు , గర్భవతులు పచ్చసొనతో కూడిన గుడ్డును తినడం మంచిది. గుడ్డు పచ్చసొన నుంచి 60 క్యాలరీలు లభిస్తే తెల్లసొన నుంచి 15 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్

సమ్మర్లో సాల్మన్ ఫిష్ లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. హెల్తీ స్కిన్ పొందాలంటే సాల్మన్ ఫిష్‌ను కూడా రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. సాల్మన్ చేప, సార్డైన్, ట్రాట్ మరియు మాకేరాల్ వంటి చేపలు విటమిన్ 'D' మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉంటాయి. ఈ మూలకాలు వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మన శరీరం స్వతహగా ఫాటీ ఆసిడ్'లను తయారు చేసుకోలేదు. ఈ ఆసిడ్'ల వలన జుట్టు రాలే ప్రక్రియ 3 శాతం వరకు తగ్గించబడుతుంది. కావున, వీలు దొరికినపుడు చేపలను తినటానికి ప్రయత్నించండి.

ఆకు కూరలు

ఆకు కూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి రక్షక కవచాలుగా నిలుస్తాయి. వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవిఅన్నీ అన్ని రకాల జబ్బులకు నివారణా మార్గాలుగా నిలుస్తాయి. తోట కూర, గోంగూర, చుక్క కూర,మెంతికూర, తీగ బచ్చలి ఆకు, పుదీనా ఆకు, కరివేపాకు, బచ్చలి కూర, పాల కూర, కాబేజీ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. కరివేపాకు కేన్సర్ ను నివారిస్తుంది. అంతేకాక మలబద్దక సమస్యతో పాటు కాలేయాన్ని ఉత్తేజపరచి,రక్తపోటును అదుపులో పెడుతుంది. పుదీనాను తింటే మెదడు చురుకు గా పనిచేస్తుంది.పుదీనా ఆకులు నీటిలో కలిపి స్నానం చేస్తే రక్త ప్రసరణ బాగుంటుంది.ఉదయం పూట దీనిని తింటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది. పాలకూర లో బీ కాంప్లెక్స్ విటమిన్ల వల్ల చర్మవ్యాధులు రావు. రక్తపోటు తగ్గి,కంటి చూపు మెరుగుపడుతుంది. గొంగూరలో ఐరన్ ఉంటుంది. కొలెస్ట్రాల్,రేచీకటి,అధిక రక్తపొటు, నిద్రలేమి బట్టతల సమస్యలకు గొంగూర తింటే చాలు. కొత్తమీర శరీర ఉష్ణ్రోగ్రతను తగ్గిస్తుంది. విరోచనాలను నియత్రిస్తుంది. ముల్లంగి ఆకులను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెంతికూర తింటే రక్తపోటును కంట్రోల్ లో పెట్టుతుంది.అలాగే మధుమేహంను కూడా నియంత్రిస్తుంది.

సార్డైన్

సార్డైన్

సార్డైన్ ఫిష్ లో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ లో ఇందులో ఫుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయనాలాల వ్యాధులను తగ్గిస్తాయి. అలాగే అల్జీమర్స్ వ్యాధిని దూరం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే విటమిన్ డి, కాల్షియం, విటమిన్ B12 ఇందులో ఎక్కువగా ఉంటాయి. విటమిన్ B2 యొక్క 13 శాతం ఉంటుంది. అన్ని B విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరును మెురుగుపరచడానికి ఉపయోగపడతాయి. జీవక్రియ మెరుగుపడేందుకు తోడ్పడుతాయి. అలాగే, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, ఇనుము సెలీనియంతో సహా కొన్ని ఖనిజాలు సార్డైన్ లో ఎక్కువగా ఉంటాయి.

హెర్రింగ్

హెర్రింగ్

హెర్రింగ్ చేప ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉంటే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు క్యాన్సర్ ను తగ్గిస్తాయి. గర్భిణీలు వీటిని తింటే చాలా మంచిది. వీటిలో 173 కేలరీలు, 19.6 గ్రాముల ప్రోటీన్, 9.9 గ్రాముల కొవ్వు, కేవలం 2.2 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. అలాగే హెర్రింగ్ B విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. మీ జుట్టు, కాలేయం, చర్మం, కల్ల ఆరోగ్యానికి ఈ చేపలు సహాయపడతాయి. హెర్రింగ్ చేప విటమిన్ డి 46 శాతం కలిగి ఉంటుంది .ఇది వాపును తగ్గిస్తుంది, బలమైన ఎముకలను ఏర్పరుస్తుంది. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా ఒమేగా -3 ఫ్యాట్స్ డోకోసాహెక్సాయియోనిక్ యాసిడ్, లేదా డిహెచ్ఏ ఎకోసపెంటెనోయిక్ యాసిడ్ లేదా ఇపిఎకి రోజుకు 500 మిల్లీగ్రాములని తినాలి. కానీ ఎవరూ తినరు. హెర్రింగ్ చేపల ద్వారా ఇవన్నీ మీకు లభిస్తాయి. అల్జీమర్స్ వ్యాధిని తగ్గించడానికి ఇవి సహాయపడతాయి.

కాడ్ లివర్ ఆయిల్

కాడ్ లివర్ ఆయిల్

కాడ్ లివర్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మధుమేహాన్ని తగ్గించుకోవొచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడొచ్చు. హై కొలెస్ట్రాల్స్ ను తగ్గించుకోవొచ్చు. అధిక రక్త పోటు నుంచి ఉపశమనం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరం కావొచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్, డిప్రెషన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు కాడ్ లివర్ ఆయిల్ ఎంతో ఉపయోగపడుతుంది.

చియా విత్తనాలు

చియా విత్తనాలు

ఈ సూపర్ ఫుడ్స్ హోల్ గ్రైన్స్ యొక్క ఆహారాలు అని చెప్పవచ్చు. ఈ శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఫ్యాటీ యాసిడ్ లను అధికంగా కలిగి ఉండి, బరువు తగ్గించుటలో సహాయపడతాయి. ఈ రకం ఆహార పదార్థాలను తప్పక ఆహార ప్రణాళికలో చేర్చుకోవాలి. చియా లేదా సబ్జా గింజల శాస్త్రియ నామం సాల్వియా హిస్పనికా. ఇది పుదీనా కుటుంబం లో పుష్పించే మొక్క. దీని జన్మ స్థలం కేంద్రం దక్షిణ మెక్సికో గ్వాటెమాల. అధిక ప్రోటిన్లతో కూడిన సూపర్ ఫుడ్ ఇది. ఈ గింజల్లో అధిక మొత్తం లో ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా -3 & ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం, భాస్వరం, జింక్ విటమిన్లు A, B, E & డి యాంటీ-అక్సిడెంట్స్ కలిగి కెలోరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్ల ను తక్కువుగా ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇవి ఉపయోగపడతాయి. కండరాల గట్టితనానికి సహాయపడతాయి. బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమబద్ధీకరిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలను నూరి లేదా సుమారు 2 గంటలు నీటిలో నానబెట్టి తర్వాతనైనా తినవచ్చును. చియా విత్తనాల 2-3 టీ-స్పూన్స్ వరకు రోజూ తినవచ్చును.

ట్యూనా చేపలు

ట్యూనా చేపలు

ట్యూనా చేపలు ప్రోటీన్ మాత్రమే కాకుండా, గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచే ఫ్యాటీ యాసిడ్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా, విటమిన్ 'B12','D' నియాసిన్, సెలినియం వంటి పోషకాలను కలిగి ఉంటుంది. అయితే ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. వీటిలో వీటిలో ఎ , డి , ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికము గా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. వీటిని తరచుగా తింటే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. కొలస్ట్రాల్స్ లెవెల్స్ కూడా అధిగమించకుండా ఉండొచ్చు.

వైట్ ఫిష్

వైట్ ఫిష్

వైట్ ఫిష్స్ ఎక్కువగా సముద్రాల్లో లభిస్తాయి. వీటిలో ఎ , డి , ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలల్లో ఏర్పడే బ్లాకులను తొలగించేందుకు సహకరిస్తాయి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ చేపల్లో అధికంగా కేలోరీలుంటాయి.

కేలరీలు: 265

కొవ్వు (గ్రా): 11.60

కార్బోహైడ్రేట్లు (గ్రా): 0

ఫైబర్స్ (జి): 0

ప్రోటీన్ (జి): 37.80

కొలెస్ట్రాల్ (mg): 119.

English summary

15 Best Food Sources Of Essential Fatty Acids

Adding more Essential Fatty Acids to your daily diet is a great way to support your health. EFAs support cardiovascular health, brain function and development, skin health, and offer many other benefits for your body. Let’s look at the most common food sources for Omega-3 and Omega-6 fatty acids.
Desktop Bottom Promotion