For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జలుబు తగ్గాలంటే వీటిని తీసుకోండి

జలుబు వస్తే మినిమం రెండు రోజులుంటుంది. కొందరిలో 14 రోజుల వరకు ఉంటుది. చాలామంది పది రోజుల్లోపు కోలుకుంటారు. కొందరికి తరచూ జలుబు చేస్తుంటుంది. ఇంట్లో దొరికే సాధారణమైన పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తి పెం

By Y. Bharath Kumar Reddy
|

జలుబును ఎదుర్కొనే రోగనిరోధక శక్తి మనలో ఎవరికీ ఉండదు. 200 వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తే వచ్చేదే జలుబు. దీంతో ముక్కు దిబ్బడ, గొంతులో గరగరా, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి. దగ్గుతో పాటు తుమ్ములు ఎక్కువగా వస్తాయి. జలుబు పట్టిందంటే ఒక పట్టాన పోదంటారు. అంతే కాకుండా అది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి ప్రబలే ప్రమాదం ఉంది. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అది త్వరగా ఇతర సభ్యులకు కూడా అంటుకుంటుంది.

superfoods for Cold

జలుబు వస్తే మినిమం రెండు రోజులుంటుంది. కొందరిలో 14 రోజుల వరకు ఉంటుది. చాలామంది పది రోజుల్లోపు కోలుకుంటారు. కొందరికి తరచూ జలుబు చేస్తుంటుంది. ఇంట్లో దొరికే సాధారణమైన పదార్థాలతో మంచి రోగనిరోధక శక్తి పెంపొందించేకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి జలుబు విషయంలో అజాగ్రత్త పనికి రాదు. అందుకే.. కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. కింద ఇచ్చిన ఆహారపదార్థాలను, పానీయాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే జలుబు ఈజీగా తగ్గిపోతుంది. మరి అవి ఏమిటో చూద్దామా.

1. గ్రీన్ టీ

1. గ్రీన్ టీ

వ్యాధులతో పోరాడే ఆమ్లజనకాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది యాంటీ వైరల్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జలుబును తగ్గించే క్యాటెచీన్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జలుబు వచ్చినప్పుడు గ్రీన్ టీ తాగడం చాలా మంచిది.

 2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జలుబుతో పోరాడే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి.

దీనిలో అలిసిన్ ఉంటుంది. ఇది సల్ఫ్యూరిక్ తో మిళితమై ఉంటుంది. ఇది శక్తివంతమైన అనామ్లజనకాలు ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోగాలతో పోరాడే గుణాలు వెల్లుల్లిలో ఉంటాయి. అందువల్ల జలుబు వచ్చినప్పుడు వెల్లుల్లిని తీసుకోండి. ఆహారంలో వెల్లుల్లి ఎక్కువగా తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్, పరాన్నజీవుల (పారాసైటిక్) ఇన్ఫెక్షన్ల నుంచి మంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు... శ్వాసకోశవ్యాధులున్నవారు వెల్లుల్లిని ఎక్కువగా వాడటం వల్ల ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

3. ఆరెంజ్

3. ఆరెంజ్

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లతో బాగా పోరాడగలదు. జలుబును తగ్గించేందుకు ఆరెంజ్ బాగా ఉపయోగపడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచేందుకు ఆరెంజ్ బాగా పని చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.

4. బ్లూబెర్రీస్

4. బ్లూబెర్రీస్

బ్లూబెర్రీస్ కూడా జలుబును తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచగలవు. అలాగే విటమిన్ సి కూడా ఇందులో అధికంగా ఉంటుది. అందువల్ల జలుబు వచ్చిన సమయంలో బ్లూబెర్రీస్ తీసుకోండి.

5. పుట్టగొడుగులు

5. పుట్టగొడుగులు

రోగనిరోధకశక్తిని ఇవి ఎక్కువగా కలిగి ఉంటాయి. సాధారణంగా మనకొచ్చే జలుబు విషయంలో పుట్టగొడుగులు బాగా పని చేస్తాయి. అందువల్ల జలుబు వచ్చినప్పుడు వీటిలని ఎక్కువగా తీసుకోండి.

6. యోగర్ట్

6. యోగర్ట్

యోగర్ట్ రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. సాధారణ జలుబును ఈజీగా నయం చేస్తుంది. ఇన్ఫెక్షన్లపై బాగా పోరాడగలదు. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి యోగర్ట్ దివ్యౌషధంలా పనిచేస్తుంది.

7. బీఫ్

7. బీఫ్

బీఫ్ తెల్ల రక్త కణాల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్ల నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది. ఇందులో జింక్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. జలబు చేసినప్పుడు బీఫ్ తింటే త్వరగా ఉపశమనం పొందొచ్చు.

8. చిలగడదుంపలు (స్వీట్‌పొటాటో)

8. చిలగడదుంపలు (స్వీట్‌పొటాటో)

వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ప్రమాదకరమైన బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్‌ నుంచి శరీరానికి రక్షణ ఇచ్చేందుకు చిలగడదుంపలు ఉపయోగపడతాయి.ఇది మన శరీరంలోని గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. ఇది మన కణాల్లో పేరుకున్న విషాలను బయటకు పంపి, వాటిని శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలుబు చేపినప్పుడు వీటిని తినడం మంచిది.

9. పసుపు

9. పసుపు

ఇందులో అధిక ఆమ్లజనకాలుంటాయి. న్యాచుతరల్ యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. ప్రతి రోజూ మనం తినే ఆహారంలో ఇది ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. అలాగే జలుబు వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. బాగా మ‌రిగించిన వేడి నీటిని తీసుకోవాలి. దాని ఆవిరి బ‌య‌టికి పోక‌ముందే అందులో కొద్దిగా ప‌సుపు లేదా ప‌సుపు కొమ్ముల‌ను వేసి దాంతో బాగా ఆవిరి ప‌ట్టాలి. ఇలా రోజుకు రెండుమూడు సార్లు చేస్తే జ‌లుబు సుల‌భంగా త‌గ్గిపోతుంది. ప‌సుపులో ఉండే యాంటీ బ‌యోటిక్, యాంటీ వైర‌ల్ గుణాల వ‌ల్లే జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది. అలాగూ వేడిపాలలో కాస్త పపుసు వేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

10. డార్క్ లీఫ్ గ్రీన్స్

10. డార్క్ లీఫ్ గ్రీన్స్

వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరగాయాలు ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో ఉంటే విటమిన్ సీ జలుబుకు కారణమయ్యే వైరస్ లపై బాగా పోరాడుతుంంది. ఫలితంగా వెంటనే జలుబు తగ్గపోతుంది.

11. వైల్డ్ సాల్మన్

11. వైల్డ్ సాల్మన్

వైల్డ్ సాల్మన్ చేపల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబుకు కారణమయ్యే వైరస్ లతో పోరాడే గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు వీలైనంత వరకు దీన్ని తీసుకుంటూ ఉండండి.

12. చికెన్ సూప్

12. చికెన్ సూప్

జలుబు నివారణకు చికెన్ సూప్ బాగా ఉపయోగపడుతుంది. చికెన్‌సూప్‌లో సిస్టిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. కోడిపులుసు పెట్టేటప్పుడే ఈ అమైనో యాసిడ్ స్రవిస్తుంది. చికెన్, దాని ఎముకలతో చేసే సూప్‌లో మినరల్స్, పోషకాలతో వ్యాధినిరోధకశక్తి చేకూరుతుంది. అలాగే చికెన్‌సూప్‌లోని జిలాటిన్ అనే అమైనో యాసిడ్... వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అయితే నాటుకోడి చికెన్‌సూప్ వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

13. అల్లం

13. అల్లం

ఇందులో సెస్క్విటర్పెన్స్ అనే రసాయనాలుంటాయి. ఇది జలుబుపై పోరాడడుతుంది. అలాగే ఇందులో యాంటివైరల్ గుణాలుంటాయి. అల్లంతో కాచిన నీటిని రోజులో రెండు మూడు సార్లు తీసుకుంటే జలుబు తగ్గిపొతుండి. అల్లం ముక్కలను నీటిలో వేసి మరగబెట్టి, దాంట్లో కొంచం తేనె కలుపుకుని తాగాలి. చిన్న ముక్కలుగా తరిమిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి మరగపెట్టాలి. అల్లంతో కాచిన ఈ నీళ్లు వేడి తగ్గిన తర్వాత కొన్ని తేనె చుక్కలు అందులో కలుపుకుని సేవించాలి. అప్పుడప్పుడు ఇలా అల్లంతో కాచిన నీటిని రోజులో రెండు లేదా మూడుసార్లు సేవిస్తే, జలుబు దరిచేరదు.

14. బ్రెజిల్ నట్స్

14. బ్రెజిల్ నట్స్

బ్రెజిల్ నట్స్ లోసెలీనియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. సైటోకిన్స్ ఉత్పత్తి చేయడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే జలుబు వచ్చినప్పుడు బాక్టీరియా, వైరస్లపై పోరాడడానికి ఇవి బాగా సహాయపడతాయి. అందువల్ల వీలైనంత వరకు వీటినీ తీసుకుంటూ ఉండాలి.

15. గుమ్మడికాయ విత్తనాలు

15. గుమ్మడికాయ విత్తనాలు

వీటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. అలాగే జలుబుకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.

గుమ్మ‌డిలో బీటా కెరోటిన్ పుష్క‌లంగా ఉంటుంది. గుమ్మడి విత్తనాలను తీసుకోవడం వల్ల వెంటనే జలుబు సమస్య తగ్గిపోతుంది. గుమ్మడిలో విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి.

16. ఆర్గానో

16. ఆర్గానో

ఇందులో ఫానాలిక్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్స్ కూడా చాలానే ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

17. రెడ్ బెల్ పెప్పర్స్

17. రెడ్ బెల్ పెప్పర్స్

ఫైటోకెమికల్స్, బీటా-కెరోటిన్, విటమిన్ సి ఇందులో ఎక్కువగా ఉంటాయి. జలుబు నుంచి రక్షించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల జలబు చేసినప్పుడు వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

18. ఓస్టెర్స్

18. ఓస్టెర్స్

ఓస్టెర్స్ ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. జింక్ తో పాటు ఐరన్, ప్రోటీన్లు వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఆరు ఓస్టెర్స్ లలో 220 శాతం జింక్, 33 శాతం ఐరన్, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల వీటిని తినడంతో జలుబు సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది.

19. పాలు

19. పాలు

పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. విటమిన్ డీ అధికంగా ఉన్నవారి కంటే తక్కువగా విటమిన్ డి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా జలుబు సమస్యను ఎదుర్కొంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల జలుబుతో బాధపడుతున్నప్పుడు కేవలం పాలు తీసుకున్న సరిపోతుంది.

20. క్యారెట్స్

20. క్యారెట్స్

రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి క్యారెట్స్ బాగా ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ - ఎ ఉంటుంది. మీకు జలుబు చేసినప్పుడు కచ్చితంగా క్యారెట్లు, వీటితో తయారు చేసిన ఆహారపదార్థాలుగానీ తీసుకోండి. దీంతో జలబు సులభంగా తగ్గిపోతుంది.

21. టీ

21. టీ

టీ కూడా జలుబుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. వెల్లుల్లి, దాల్చినచెక్క, తేనెతో, సొంపు విత్తనాలతో టీ తయారు చేసుకుని తాగితే మంచి ఉపయోగం ఉంటుంది. జలుబు వచ్చినప్పుడు ఇలాంటి టీ తయారు చేసుకుని తాగండి. మంచి ప్రయోజనాలుంటాయి.

22. యాపిల్స్

22. యాపిల్స్

ఇందులో ఆమ్లజనకాలు అధికంగా ఉంటాయి. ఒక ఆపిల్ లో 1500 ఎంజీ విటమిన్ సి కి సమానమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జలుబుతో బాగా పోరాడతాయి. వెంటనే జలుబు తగ్గేలా చేస్తాయి. అందువల్ల జలుబు చేసినప్పుడు యాపిల్స్ తినండి.

English summary

22 Superfoods To Cure Cold Naturally

Nobody can possibly be immune to common cold. Did you know that some 200 viruses can cause cold; and the rhinovirus is the most widespread culprit among this.22 Superfoods To Cure Cold Naturally Here.
Desktop Bottom Promotion