For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు తీసుకుంటే క్యాన్సర్ ను తరిమేయొచ్చు

By Y. Bharath Kumar Reddy
|

క్యాన్సర్ గతంలో ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఇప్పుడిది ప్రాణాంతక వ్యాధిగా తయారైంది. ఏటా దీని బారిన కోట్ల మంది పడుతుతున్నారు. మన జీవనశైలితో పాటు మనం తీసుకునే ఆహారం ఈ వ్యాధికి ప్రధాన కారణం. మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా క్యాన్సర్‌ ను చాలా వరకూ నిరోధించుకోవొచ్చు. క్యాన్సర్ వ్యాధి నిర్దారణను త్వరితంగా తెలుసుకోవటం చాలా కష్టం. రోజు రోజుకు క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతునే ఉంది. కొన్ని ఆహారాలు, ద్రావణాల సేకరణ వలన క్యాన్సర్ పెరుగుదల తగ్గే అవకాశం ఉంది. క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్న సమయంలో లేదా ప్రారంభదశలో ఉన్నపుడు ఏ రకమైన ఆహరం తీసుకోవాలో తేలిక సతమతం అవుతుంటారు. రసాయనాలతో కూడిన కూరగాయల కంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహరం తీసుకోవటం వలన క్యాన్సర్ కొంచెం అయిన తగ్గే అవకాశం ఉంది. మనం రోజు తీసుకునే ఆహారంలోనే క్యాన్సర్‌ ను నిరోధించేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఆయా పదార్థాలను వాటిల్లోని పోషకాలు నశించకుండా తీసుకోవాలి. క్యాన్సర్ బారిన పడిన వారు ఈ కింద ఇచ్చిన ఆహాపపదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే అందులోని పోషక గుణాలు క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

1. ఆకుకూరగాయలు

1. ఆకుకూరగాయలు

వీటిలో బీటా కెరోటిన్, లౌటిన్ వంటి ఆమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. బచ్చలికూర, పాలకూర వంటి ఆకు కూరలు చాలా మంచివి. ఈ ఆహారాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడతాయిని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. కేల్‌, వాటర్‌ క్రెస్‌... వంటి వాటిల్లో క్యాన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. వీటిల్లోని గ్లూకోసైనోలేట్లు అన్నిరకాల క్యాన్సర్‌ కారక కణాలనూ పనిచేయకుండా చేస్తాయి. దాంతో కంతులు పెరగకుండా ఉంటాయి.

2. క్రూసిఫెరస్ కూరగాయలు

2. క్రూసిఫెరస్ కూరగాయలు

వీటిలో గ్లూకోసినోలేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే సల్ఫర్ కూడా ఎంతో మంచి చేస్తుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకునే గుణం వీటికి ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే గుణం వీటికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవాలి.

3. టమాట

3. టమాట

టమాటలో 'లైకోపీన్' అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్ లను కలుగచేసే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. అలాగే ఇందులో ఉండే ఫైటోకెమికల్ గర్భాశయ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది.

4. వెల్లుల్లి

4. వెల్లుల్లి

వెల్లుల్లి క్యాన్సర్‌ తో పోరాడేందుకు బాగా పని చేస్తుంది. వెల్లులిని వొలిచి పది నిమిషాలు ఉంచితే క్యాన్సర్‌ నిరోధించే ఎంజైమ్‌ ఎలెనాస్‌ బాగా మెరుగవుతుంది. దీనిలో సల్ఫర్‌ పరిమాణము ఎక్కువ వున్నందున ఘాటైన వాసన వస్తుంది. రోజుకు రెండు, మూడు వెల్లులి రెబ్బలను తిన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మీరు తినే ఆహారాల్లోనూ వెల్లులిని భాగం చేసుకోవాలి.

5. క్యారెట్

5. క్యారెట్

వీటిలో బీట-కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. వివిధ క్యాన్సర్లను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. క్యాన్సర్ నియంత్రణకు క్యారెట్ బాగా పని చేస్తుంది. క్యారెట్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు క్యాన్సర్ పెరుగుదలకు బ్రేక్ వేస్తుంది.

6. బీన్స్

6. బీన్స్

బీన్స్ క్యాన్సర్ ను నియంత్రించడంలో బాగా పని చేస్తుంది. టీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. రోజులో ఒక కప్పు మేర బీన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బీన్స్ లో 2 నుంచి 3 శాతమే ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. మాంసాహారం తీసుకోని వారు తినాల్సిన చక్కని ప్రత్యామ్నాయం ఇది. క్యాన్సర్ ను నియంత్రించడంలో బీన్స్ బాగా పని చేస్తుంది.

7. అవిసె గింజలు

7. అవిసె గింజలు

అవిసె గింజల్లో లిగ్నన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ అవిసె గింజల్లో పుష్క‌లంగా ఉంటాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబ‌ర్‌) ఎక్కువగా ఉంటుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ‌ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడ‌వ‌చ్చు. అవిసెల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వీటిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకోవడం చాలా మంచిది.

8. ద్రాక్ష

8. ద్రాక్ష

ద్రాక్షలో మంచి ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడగలవు. క్యాన్సర్ ను తగ్గించే గుణం వీటికి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ద్రాక్ష పండ్లు దోహద పడుతాయి. విటమిన్ సి ఏబీసీ ఫోలిక్‌ఆమ్లం కూడా వీటిలో పుష్కంగా ఉంటుంది. పోటాషియం, కాల్షియం, ఇనుము, పాస్పరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల ఖనిజ లవణాలు ద్రాక్షలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. పెద్దపేగు క్యాన్సర్‌తోపాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్ నివారణలో ఇవి బాగా పని చేస్తాయి. ద్రాక్ష పండ్ల రసం క్యాన్సర్‌ను అణిచివేయడంమే కాదు క్యాన్సర్ కణాలు వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షపండ్లలోని రెస్‌వెరాట్రల్‌ క్యాన్సర్‌ను ప్రేరేపించే ఎంజైములు విడుదల కాకుండా చేస్తుంది. అలాగే ఎలాజిక్‌ ఆమ్లం కూడా క్యాన్సర్‌ కణాలకు అవసరమైన ఎంజైములను అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్‌ను నిరోధించడంతోబాటు కంతుల పెరుగుదలనీ అడ్డుకుంటుంది.

9. సోయాబీన్

9. సోయాబీన్

సోయాబీన్ గింజలకు క్యాన్సర్ కణాలను నశింపజేసే శక్తి అధికంగా ఉంటుంది. వీటిలో కార్సినోజెనిక్ కణాలు సమృద్ధిగా లభిస్తాయి. సోయాలోని సాపోనిన్స్, ఫైటేట్స్, సోప్లే వోన్స్ తదితర పదార్థాలు క్యాన్సర్‌ను అదుపులో ఉంచుతాయి. కాబట్టి సోయాతో చేసిన టోపు, సోయా పాలను తరచూ ఆహారంలో తీసుకోవాలి.

10. జీలకర్ర

10. జీలకర్ర

జీలకర్ర క్యాన్సర్‌ ను నియంత్రించడంలో బాగా పని చేస్తుంది. జీలకర్రలో ఉండే ఫైటోకెమికల్ క్యుమినాల్డిహైడ్ క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రలో ఉండే క్యుమినల్‌ఈస్టర్, లిమోనిన్ డీఎన్‌ఏలో మార్పులు తెచ్చి క్యాన్సర్‌కు కారణమయ్యే అఫ్లటాక్సిన్ చర్యలను అడ్డుకుంటాయి. కాబట్టి జీలకర్రను ఎక్కువగా తినడం చాలా మంచిది.

11. చిలగడ దుంపలు

11. చిలగడ దుంపలు

చిలగడదుంపలు అంటే చాలామందికి బాగా ఇష్టం. వీటిలో క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణాలుంటాయి. ఇందులో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. వీటిలో ఫైబర్‌, విటమిన్‌ ఎ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉండదు. అలాగే క్యాన్సర్ కణాలపై ఇవి ఎక్కువగా పోరాడతాయి.

12. పసుపు

12. పసుపు

పసుపులో సైక్లో ఆక్సిజినేజ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో కుర్‌క్యుమిన్‌ ఉంటుంది. ఇవన్నీ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పేగు, రొమ్ము క్యాన్సర్ల నివారణకు పసుపు బాగా ఉపయోగపడుతుంది. కప్పు నీళ్లలో టీస్పూను పసుపుతో పావు టీస్పూను మిరియాలపొడి కలిపి రోజూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

13. తృణధాన్యాలు

13. తృణధాన్యాలు

వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో ఉండే ఆమ్లజనకాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ను ఎదుర్కోవొచ్చు. మొక్కజొన్న, మొక్కజొన్న, రాగి, బజ్రా, గోధుమ, బార్లీ, జొన్న, ఇటాలియన్ మిల్లెట్, వోట్స్ మొదలైన తృణధాన్యాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పని చేస్తాయి.

14. గ్రీన్ టీ

14. గ్రీన్ టీ

గ్రీన్ టీ ద్వారా సులువుగా బరువు తగ్గొచ్చనే విషయం చాలామందికి తెలుసు. గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఇందులో క్యాన్సర్ కణాలను వ్యతిరేకంగా పోరాడే లక్షణాలుంటాయి. వీటిలో క్యాట్చిన్స్ ఎతక్కువగా ఉంటాయి. గ్రీన్ టీ అన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలకు నిరోధిస్తుంది.

15. బెర్రీస్

15. బెర్రీస్

బెర్రీస్ లో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే వీటిలో ఫైబర్, విటమిన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీ, బ్లాక్ బెర్రీల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ , ప్రో-ఆంతోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. చెర్రీలూ, స్ట్రాబెర్రీలూ, గోజిబెర్రీలూ క్యాన్సర్‌ను నిరోధించేవే. వీటిల్లోని గాలిక్‌ ఆమ్లం శక్తిమంతమైన యాంటీవైరల్‌గా పనిచేస్తూ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. ఇతర పదార్థాలు ఫ్రీ-రాడికల్స్‌ సంఖ్యను బాగా తగ్గిస్తాయి.

16. బ్రెజిల్ నట్స్

16. బ్రెజిల్ నట్స్

క్యాన్సర్ కణాలను చంపే సెలీనియం వీటిలో ఎక్కువగా ఉంటుంది. దీంతో క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు. నట్స్‌ అన్నీ క్యాన్సర్‌ నిరోధకాలే అయినప్పటికీ బ్రెజిల్‌ నట్స్‌లో సెలీనియం అత్యధికం. అందుకే ఇది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను చాలావరకూ నిరోధించగలదు. అందువల్ల రోజూ బ్రెజిట్ నట్స్ తీసుకుంటూ ఉండండి.

17. నిమ్మకాయలు

17. నిమ్మకాయలు

నిమ్మకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూను తేనె కలిపి తీసుకుంటే చాలా మంచిది. నిమ్మగుజ్జులో సిట్రస్ పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. అలాగే నిమ్మలో చాలా శక్తివంతమైన పైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి. క్యాన్సర్ అవకాశాన్ని యాభై శాతం తగ్గించే గుణం నిమ్మకాయకు ఉంటుంది.

18. ఆర్టిచోక్

18. ఆర్టిచోక్

ఆర్టిచోక్ లో సిలిమరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ క్యాన్సర్ కు కారణం అయ్యేవాటిని నిరోధిస్తుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

19. సాల్మన్ చేప

19. సాల్మన్ చేప

వారానికి నాలుగు లేదా అంతకంటే ఎక్కువగా ఈ చేపలు తింటే చాలా మంచది. దీంతో క్యాన్సర్ ను చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. కావున, వీలు దొరికినపుడల్లా ఈ చేపలను తినటానికి ప్రయత్నించండి.

20. కివీ ఫ్రూట్స్

20. కివీ ఫ్రూట్స్

వీటిలో విటమిన్ సి, విటమిన్ ఈ, లౌటెన్, కాఫర్ తో పాటు క్యాన్సర్ తో పోరాడడే ఆమ్లజనకాలు ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండే కివీలు మ‌న ద‌గ్గ‌ర ఇప్పుడు విరివిగా ల‌భిస్తున్నాయి. శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుంది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లపై ఇవి బాగా పోరాడుతాయి.

21. ఉల్లిపాయలు

21. ఉల్లిపాయలు

ప్రొస్టేట్ క్యాన్సర్ ను తగ్గించడానికి ఉల్లి బాగా పని చేస్తుంది. క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకునే గుణం వీటికి ఉంటుంది. అందువల్ల తరచూ ఉల్లిని ఆమారంగా తీసుకోవాలి. దీంతో క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోగలుగుతారు.

22. సౌఎర్ క్రౌట్

22. సౌఎర్ క్రౌట్

ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఐటీసీలు, ఇండోర్లు, సల్ఫోరాఫాన్ వంటి గుణాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

23. ఆలివ్ ఆయిల్

23. ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనెతో తయారుచేసిన ఆహారాలు తినే వ్యక్తులు రొమ్ము క్యాన్సర్ బారినపడరు. ఇలాంటి వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 68 శాతం తక్కువగా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

24. బ్లాక్ టీ

24. బ్లాక్ టీ

రోజూ బ్లాక్ టీ రెండు కప్పులు బ్లాక్ టీ తాగేవారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 32 శాతం తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ప్రతిరోజూ బ్లాక్ టీ సేవించడం ద్వారా క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. ఇందులో యాంటియోక్సిడెంట్స్ ఉండటం ద్వారా క్యాన్సర్‌ దరిచేరదు. అలాగే క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా ఇది పోరాడుతుంది.

25. యాపిల్స్

25. యాపిల్స్

యాపిల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యాపిల్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందువల్ల ప్రతి రోజు ఒక యాపిల్ పండును ఆహారంతోపాటు తీసుకుంటు ఉండాలి. యాపిల్ పండుపైనున్న తొక్క శరీరంలోని క్యాన్సర్ కణాలను మటుమాయం చేస్తుంది. లేదా వాటిని శరీరంలో పెరగకుండా నిరోధిస్తుంది.

26. అవకాడో

26. అవకాడో

అవకాడోలో అధికంగా ఉండే గ్లూటాథియోన్‌ అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంటు ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లనూ నిరోధిస్తుంది. అందుకే ఈ గ్లూటాథియోన్‌ను మాస్టర్‌ యాంటీ ఆక్సిడెంట్‌ గానూ పిలుస్తారు. ఇందులో ఆరోగ్యకరమైన మోనో సాచ్యురేటేడ్ యాసిడ్స్ ఉంటాయి. లైకోపీన్, బీటా-కరోటిన్ అనే ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణ పెరుగుదలను నిరోధిస్తాయి.

27. మొలకెత్తిన విత్తనాలు

27. మొలకెత్తిన విత్తనాలు

మొలకెత్తిన విత్తనాల్లో సల్ఫొరాఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ గా పని చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో బాగా సహాయపడుతుంది.

28. బ్రాన్ సెరీయల్

28. బ్రాన్ సెరీయల్

బ్రాన్ లో అత్యంత పోషకాలుంటాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ పెద్దప్రేగు, ఇతర క్యాన్సర్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

29. క్యాబేజీ

29. క్యాబేజీ

క్యాబేజీ ఎక్కువగా తినే వారు పెద్దపేగు, ఇతర క్యాన్సర్ల కు చాలా తక్కువగా గురవుతుంటారు. క్యాబేజీలో ఉండే ఐసోసయనేట్లకు క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నివారణకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి వెజిటబుల్ సలాడ్‌లో సన్నగా తరిగిన క్యాబేజి ముక్కలను చేర్చి తీసుకుంటే మంచిది. ఎక్కువగా ఉడికిస్తే వీటిలోని యాంటి క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. కాబట్టి క్యాబేజీని సలాడ్స్‌గా గాని, ఆవిరితో గాని ఉడికించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

30. చెర్రీస్

30. చెర్రీస్

చెర్రీలు నోరూరించే ఫలాలు. రుచిలోనే కాదు, ఔషధ గుణాల రీత్యా ఇవి మంచివే. వీటిలో యాంటీ ఆక్సిడాంట్లు, విశిష్టమైన విటమిన్లు, వివిధరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంతోసియానిన్స్ అనే యాంటీ ఆక్సిడాంట్ క్యాన్సర్ నిరోధకంగానూ, వైరస్ సంహారిగానూ భేషుగ్గా పనిచేస్తుంది. ముదురు రంగులో ఉండే చెర్రీ ఫ్రూట్స్ లో ఈ ఆంతోసియానిన్స్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. చెర్రీస్ కు క్యాన్సర్ కు వ్యతిరేక పోరాడే గుణాలుంటాయి. క్యాన్సర్ కణాలు సోకకుండా చెర్రీస్ కాపాడుతాయి.

31. కాఫీ

31. కాఫీ

కాఫీ తాగని వారి కంటే తాగే వారిలోక్యాన్సర్ వచ్చే అవకావం 15శాతం తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలని ఆపే గుణం కాఫీకి ఉంటుంది. అతిగా కాఫీ తాగితే క్యాన్స‌ర్ వ‌స్తుంద‌న్న భ‌యంతో మ‌న‌సు చంపుకుంటున్న వారు నిర‌భ్యంత‌రంగా కాఫీ తాగి క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు. ఈ విషయం పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

32. మొక్కజొన్న

32. మొక్కజొన్న

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

33. ఖర్జూరాలు

33. ఖర్జూరాలు

ఖర్జూరాల్లో పాలిఫేనోల్స్ అధికంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఇవి రక్షిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించే విటమిన్ బీ6, ఫైబర్ వీటిలో ఉంటాయి. దీనిలో సహజసిద్ధంగా ఉన్న చక్కెర మనం నిత్యం వాడే శుద్ధి చేయబడ్డ చక్కెర కన్న చాలా మంచిది.

34. గుడ్డు

34. గుడ్డు

గుడ్డులో అనేకరకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. అయితే గుడ్డు మొత్తాన్ని పచ్చసోనతో సహా తినడం వల్ల ఈజీగా క్యాన్సర్ ను ఎదుర్కొవొచ్చు.

35. అల్లం

35. అల్లం

అల్లం పెద్దప్రేగులో మంటను తగ్గిస్తుంది. ఇందులో బీటా-ఐయోనే ఉంటుంది. ఇది క్యాన్సర్ కణతుల పెరుగుదలను తగ్గిస్తుంది. అల్లాన్ని రోజూ మన తినే ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవాలి. ఇది జీవక్రియను పెంచటమే కాకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

36. గ్రేఫ్ ఫ్రూట్

36. గ్రేఫ్ ఫ్రూట్

గ్రేఫ్ ఫ్రూట్స్ లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ను తగ్గిస్తుంది. తగ్గించే ఒక ప్రతిక్షకారిణి. గ్రేఫ్ ఫ్రూట్ తిన్న కొద్ది సేపటి తర్వాత మీరు ఫ్రెష్ గా ఫీలవుతారు. అందువల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

37. కాలే

37. కాలే

కాలేలో ఐడోల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ క్యాన్సర్ తదితర వాటిని ఇది బాగా తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే మంచి ఆహారం ఇది.

38. పుట్టగొడుగులు

38. పుట్టగొడుగులు

పుట్టగొడుగుల్లో ఉండే సెలీనియం క్యాన్సర్ తో బాగా పోరాడుతుంది. రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించటంలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) బాగా పని చేస్తాయి. పుట్టగొడుగులను తినని మహిళలతో పోల్చితే తాజా పుట్టగొడుగులను స్వీకరించే మహిళలలో రెండింట మూడోవంతు మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పుట్టగొడుగుల్లోని లెంటినాన్‌ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. వీటిల్లోని లెక్టిన్‌ క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండా చేస్తుంది.

39. బఠానీలు

39. బఠానీలు

ఆకుపచ్చ బఠానీలు క్యాన్సర్ కారకాలకు చెక్ పెడతాయి. ఇందులో ఉండే విటమిన్ సీ క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ కారణంగా కలిగే హానినికూడా నియంత్రిస్తుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.

40. దానిమ్మ జ్యూస్

40. దానిమ్మ జ్యూస్

క్యాన్సర్ నివారణకు దానిమ్మ బాగా సహాయపడుతుంది. దానిమ్మను రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది. దానిమ్మ జ్యూస్ ను రోజూ తాగే వారు అసలు క్యాన్సర్ పడరని పరిశోధనల్లో తేలింది. శరీరంలో పీఎస్ ఏను (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

English summary

40 Foods That Fight Cancer Cells Growth

Your chances of developing cancer are affected by the lifestyle choices you make. In this article, we have listed some of the best foods that can stop cancer cell growth. So, read further to know how to prevent cancer cells from growing with the help of the below-mentioned foods.
Desktop Bottom Promotion