ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తినాల్సిన హెల్తీ ప్రొబయోటిక్ ఫుడ్స్ ..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రోబయోటిక్స్, స్నేహపూర్వక బాక్టీరియా; సహజమైన కొన్ని ఆహారపదార్థాలలో మరియు మన జీర్ణాశయంలో కూడా ఉంటుంది. ప్రతి రోజు ప్రజలను త్రాగడానికి విజ్ఞప్తి చేస్తూ అనేక ప్రోబైయటిక్ పానీయాలు మార్కెట్లలో దొరుకుతున్నాయి. కానీ అవి నిజంగా మన ఆరోగ్యానికి అవసరమా? మనము దానిపై మరింత వివరంగా తెలుసుకుందాం! ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? ప్రోబయోటిక్స్ ను 'మంచి బాక్టీరియా' లేదా 'సహాయక బ్యాక్టీరియా' అని కూడా పిలుస్తారు ఈ జీవసూక్ష్మజీవులు మన ఆరోగ్యానికి లాభాన్ని చేకూరుస్తున్నాయి.. మానవ జీర్ణకోశ మార్గంలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించే 400-500 రకాల 'మంచి బాక్టీరియా' ఉన్నాయి మరియు ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ పెంపొందుతుంది. లాక్టిక్ ఆమ్ల బ్యాక్టీరియా మరియు బిఫిడో బాక్టీరియా జీర్ణకోశ మార్గంలో అత్యంత సమృద్ధిగా ఉంటాయి మరియు వీటిని సాధారణంగా ప్రోబయోటిక్స్ గా ఉపయోగిస్తారు. కొన్ని రకాల ఈస్ట్ లను కూడా ప్రోబయోటిక్స్ గా ఉపయోగిస్తారు.

8 Must-Have Prebiotics For Good Health

ప్రోబయోటిక్స్ యొక్క ఆరోగ్యలాభాలు - లాక్టోస్ సరిపడక పోవడం తగ్గించడానికి - రోగనిరోధక శక్తి పెంచటానికి - అతిసారం మరియు క్రోన్ 'స్ వ్యాధి చికిత్సలో సహాయం - యోని ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారణ మరియు చికిత్సలో సహాయం - క్యాన్సర్ సంఘటనలు ముఖ్యంగా పిత్తాశయము మరియు పెద్దప్రేగు కాన్సర్ తగ్గించేందుకు - పిల్లలలో తామర నివారణ మరియు చికిత్సలో - జలుబు మరియు ఫ్లూ తీవ్రత తగ్గించదానికి - పౌచిటిస్ (ప్రేగు యొక్క శోథ) నివారణ .

ప్రోబయోటిక్స్ ఎలా పని చేస్తాయి?

భారీ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడటం లేదా దీర్ఘకాల అంటువ్యాధులు జీర్ణకోశమార్గంలో ఉన్న 'సహాయక సూక్ష్మజీవుల సముదాయాలకు అంతరాయం కలుగుతుంది.ప్రోబయోటిక్స్'మంచి బాక్టీరియా ' ను పునరుద్ధరించడానికి మరియు పేగు పనితీరు మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి. వ్యాధులను నివారించే ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలు

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

వెల్లుల్లిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మరియు ఫైబర్ కంటెంట్ ప్రోబయోటిక్స్ కు మంచి మూలం, కాబట్టి రెగ్యలుర్ డైట్ లో వెల్లుల్లి రెబ్బలను చేర్చుకోవడం చాలా అవసరం.

2. ఉల్లిపాయలు:

2. ఉల్లిపాయలు:

ఉల్లిపాయలో ఉండే ఫ్లెవనాయిడ్స్ యాంటీబయోటిక్స్ , యాంటీ యాక్సిడెంట్స్ , యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి ప్రీ బయోటిక్స్ కు మంచి మూలం.

3.ఆస్పరాగస్ :

3.ఆస్పరాగస్ :

ఆస్పరాగస్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ప్రీబయోటిక్ కు మంచి సోర్స్, ఇది గౌట్ బ్యాక్టీరియాను ప్రమోట్ చేస్తుంది, అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

4. అరటి పండ్లు:

4. అరటి పండ్లు:

డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినిరల్స్ ఎక్కువ, కాబట్టి బ్యాక్టీరియాను నివారిస్తుంది. ప్రోబయోటిక్స్ కు బెస్ట్ సోర్స్ .

5. ఓట్స్ :

5. ఓట్స్ :

ఓట్స్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్నే బీటా గ్లూకాన్ ఫైబర్ అని కూడా పిలుస్తారు. ఇది హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది.

6. యాపిల్స్ :

6. యాపిల్స్ :

యాపిల్స్ లో బెస్ట్ ప్రీబయోటిక్ సోర్స్. యాపిల్స్ లో ఉండే పెక్టిన్ ప్రీబయోటిక్ లక్షణాలు కలడి.ఇందులో ఫాలీ పినాల్స్ ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ అధికం. యాపిల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది.

7. ఫ్లాక్స్ సీడ్స్ :

7. ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బెటర్ బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది. హెల్తీ గౌట్ బ్యాక్టీరియను ప్రోత్సహిస్తుంది.

8. బార్లీ :

8. బార్లీ :

ప్రోబయోటిక్ కు మంచి మూలం బార్లీ, ఇందులో ప్రోబయోటిక్ అధికంగా ఉంటుంది. బీటా గ్లూకాన్ కూడా ఎక్కువ. ఇది గౌట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది.

English summary

8 Must-Have Prebiotics For Good Health

Listed here are foods containing prebiotics that are good for our overall health and are a must-have.
Story first published: Sunday, April 2, 2017, 14:00 [IST]
Subscribe Newsletter