స్ప్రింగ్ ఆనియన్స్ లో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు..!!

Posted By: Staff
Subscribe to Boldsky

చైనీస్ వంటలు మీరు తిన్నారా? గుర్తున్నాయా...చైనీస్ వంటకాల్లో మొదటగా మీరు చూసేది గ్రీన్ స్స్రింగ్ ఆనియన్స్. వీటిని స్స్రింగ్ ఆనియన్స్ అని తెలుగులో ఉల్లికాడలని కూడా పిలుస్తారు. ఇది చైనీస్ వంటల్లో రుచికోసం మాత్రమే వాడటం లేదు, వీటిని రెగ్యులర్ వంటకాల్లో ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు.

కాబట్టి, ఈ రోజు స్ప్రింగ్ ఆనియన్స్ లో హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. గ్రీన్ కలర్ లో ఉండే స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నంత రుచి, వైట్ ఆనియన్స్ లో ఉండదు. అంతే కాదండోయ్ వీటిలో న్యూట్రీషియన్స్ కూడా అధికమే. అందుకే వీటిని పురాతన కాలం నుండి చైనీస్ వంటకాల్లో బాగా ప్రసిద్ది . అంతే కాదు వీటిని చైనీస్ వారు ఔషధాల తయారీ కోసం కూడా ఉపయోగించే వారు .

స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి2 మరియు ఇతర ఫ్లెవనాయిడ్స్, కాపర్, పొటాషియంలు అధికంగా ఉన్నాయి. గ్రీన్ స్ప్రింగ్ ఆనియల్స్ లో క్యాలరీలు తక్కువ. కాబట్టి, ప్రతి ఒక్కరీ డైట్ లో తప్పక ఉండాల్సిన హెల్తీ వెజిటేబుల్ స్ప్రింగ్ ఆనియన్స్ .

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్ ఉడికించి తినడం కంటే పచ్చిగా లేదా హాఫ్ బాయిల్డ్ లేదా హాఫ్ ఫ్రైడ్ చేసి, లేదా సలాడ్స్ లో గార్నిష్ గా జోడించి తినడం ఉత్తమం. గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1. జీర్ణ శక్తిని పెంచుతుంది:

1. జీర్ణ శక్తిని పెంచుతుంది:

స్ప్రింగ్ ఆనియన్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, అందువల్ల ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించుకోవాలి. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి లేదా సలాడ్స్ లో గార్నిష్ చేసి తీసుకోవాలి.

2. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

2. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ సి, విటమిన్ ఎలు అధికంగా ఉన్నాయి. గ్నీన్ స్ప్రింగ్ ఆనియన్స్ బాడీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది.

3.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ నివారిస్తుంది:

3.బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ నివారిస్తుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉండే సల్ఫర్ కాంపౌండ్ కంటెంట్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.

4. జలుబు తగ్గిస్తుంది:

4. జలుబు తగ్గిస్తుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది మ్యూకస్ ను తొలగిస్తుంది.

5. క్యాన్సర్ తో పోరాడుతుంది:

5. క్యాన్సర్ తో పోరాడుతుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇందులో అల్లి సల్ఫైడ్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. క్యాన్సర్ సెల్స్ డెవలప్ మెంట్ ను అడ్డుకుంటుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది.

6. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

6. కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్స్, కళ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలం పాటు కంటిచూపు కోల్పకుండా కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. హార్ట్ హెల్త్ కు మెరుగుపడుతుంది:

7. హార్ట్ హెల్త్ కు మెరుగుపడుతుంది:

గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ సి, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. దాంతో హార్ట్ సమస్యల దూరమవుతాయి.

8. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

8. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

స్ప్రింగ్ ఆనియన్స్ లో విటమిన్ సి, విటమిన్ కె, మరియు ఇతర న్యూట్రీషియన్స్ బోన్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది. కాబట్టి, దీన్ని రెగ్యులర్ మీల్స్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

English summary

8 Reasons To Eat Green Spring Onions For These Health Benefits

Green spring onion can be cooked and consumed or the best way to eat it raw is by adding it to salads and using it for garnishing. Listed here are a few of the major health benefits of green spring onions. Have a look.
Subscribe Newsletter