సమ్మర్లో వాటర్ మెలోన్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి 8 ఫర్ఫెక్ట్ రీజన్స్..!

Posted By:
Subscribe to Boldsky

సమ్మర్ ఫ్రూట్స్ లో మామిడి పండ్లకు, పుచ్చకాయ(కర్బూజ)కు ఉన్నంత క్రేజ్ మరే పండ్లకు ఉండదు. ఈ కాంబినేషన్ పండ్లు వేసవిలో వేడి నుండి కాస్త ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి, ఈ రెండు పండ్లను వేసవి సీజన్ లో తప్పనిసరిగా తీసుకోవాలి.

వాటర్ మెలోన్ లో బీటా కెరోటి, విటమిన్ ఎ, బి1, బి6 మరియు విటమిన్ సి, పొటాసియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, బయోటిన్, కాపర్లులు అధికగా ఉన్నాయి. ముఖ్యంగా వాటర్ మెలోన్ లో వాటర్ కంటెంట్ 92శాతం ఉంటుంది. సమ్మర్ సీజన్లో వాటర్ మెలోన్ తినడం వల్ల రిఫ్రెష్ అవుతారు.

8 Reasons Why Watermelon Juice Is A Must Have This Summer

వేసవిలో వాతావరణంలోని వేడి వల్ల, చెమటలు ఎక్కువగా పట్టడం, శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో సరిగా నీళ్లు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. అలా డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండాలంటే వేసవిలో మనకు అందుబాటులో ఉండే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వాటర్ మెలోన్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పోషకాలు అధికంగా, క్యాలరీలు తక్కువగా, సూపర్ హైడ్రేటింగ్, యమ్మీ వాటర్ మెలోన్ ఈ సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ ఫ్రూట్ .

వాటర్ మెలోన్ నేరుగా తీసుకున్నా..జ్యూస్ రూపంలో తీసుకున్నా, స్నాక్స్, సలాడ్స్ రూపంలో తీసుకున్నా పోషకాలు, వాటర్ కంటెంట్ మాత్రం అలాగే ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా తీసుకోవడం అంటే పిల్లలు, పెద్దలందరికి కూడా ఇష్టమే.

ఎండ వేడి వల్ల డీహైడ్రేషన్ కు గురి అవ్వడం, ఇతర ఇన్ఫెక్షన్స్ సోకడం జరుగుతుంటుంది. అయితే డైలీ డైట్ లో వాటర్ మెలోన్ తీసుకోవడం వల్ల హార్ట్, బ్రెయిన్, మరియు ఇమ్యూన్ సిస్టమ్ హెల్తీగా ఉంటుంది. జీవక్రియలు సరిగా చురుకుగా జరుగుతాయి.

వేసవిలో వివిధ రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రూట్స్ లో వాటర్ మెలోన్ ఫర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. వేసవి సీజన్ లో వాటర్ మెలోన్ తినడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్ ఏంటో తెలుసుకుందాం..

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది:

వేసవి సీజన్ లో వాటర్ మెలోన్ తినడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది. వాటర్ మెలోన్ తినడం వల్ల శరీరాన్ని ఫాస్ట్ గా డీహైడ్రేట్ చేస్తుంది. కాబట్టి, వేసవిలో ఈ వండర్ ఫుల్ ఫ్రూట్ మిస్ చేయకుండా తిని, హెల్తీ ఉండాలి.

శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది:

వేసవి సీజన్ లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వేసవిలో డీహైడ్రేషన్ కు గురి కావడం మాత్రమే కాదు, శరీరం నుండి టాక్సిన్స్ కూడా సరిగా బయటకు తొలగింపబడవు. వాటర్ మెలోన్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. వాటర్ మెలో న్ లో ఉండే వాటర్ కంటెంట్ శరీరంలో టాక్సిన్స్ ను ఎఫెక్టివ్ గా నేచురల్ గా తొలగిస్తుంది.

అందమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది:

అందమైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది:

శరీరంలో విటమిన్ ఎ, సి లోపిస్తే చర్మం డ్రైగా,ఫ్లాకీగా కనబడుతుంది. ఈ సమస్యను అవాయిడ్ చేయడానికి బెస్ట్ నేచురల్ రెమెడీ, వాటర్ మెలోన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇది విటమిన్ ఎ, సిలను పుష్కలంగా అందిస్తుంది. అలాగే బీటాకెరోటి, లైకోపిన్ లు సన్ బర్న్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

వేసవి సీజన్ లో జీర్ణ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంటుంది. వాటర్ మెలోన్ లో ఉండే వాటర్ కంటెంట్ , ఫైబర్ హెల్తీ డ్రైజషన్ ప్రొసెస్ ను అందిస్తుంది. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా వాటర్ మెలోన్ లో దాగున్నాయి.

బ్యూటిఫుల్ హెయిర్:

బ్యూటిఫుల్ హెయిర్:

వేసవిలో జుట్టు సమస్యలు వెంటాడుతాయని బయపడుతున్నారా? ఈ సమస్యలను నివారించడంలో వాటర్ మెలోన్ అద్భుతంగా సహాయపడుతుంది. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ సి, శరీరంలో కెరోటిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో జుట్టు స్ట్రాంగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మార్చుతుంది.

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది:

వాటర్ మెలోన్ రక్తప్రసరణను మెరుగుపరచడంలో , హైపర్ టెన్షన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. దీంతో పాటు రక్తనాళాల్లో సరిగా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అందుకే వేసవి సీజన్ లో వాటర్ మెలోన్ ను తప్పనిసరిగా తినాలి.

కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

వాటర్ మెలోన్ కళ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాటర్ మెలోన్ లో ఉండే విటమిన్ ఎ, వాటర్ కళ్లలోని రెటీనాలో వాటర్ పిగ్మెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. దాంతో కళ్లు చల్లగా ఉంటాయి. వేసవిలో కళ్ల ఇన్ఫెక్షన్స్ ను దూరం చేస్తుంది.

మూడ్ మెరుగుపరుస్తుంది:

మూడ్ మెరుగుపరుస్తుంది:

వాటర్ మెలోన్ లో ఉండే వాటర్ కంటెంట్ మూడ్ ను మార్చుతుంది. విటమిన్ బి6 నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది, హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

English summary

8 Reasons Why Watermelon Juice Is A Must Have This Summer

వాటర్ మెలోన్ నేరుగా తీసుకున్నా..జ్యూస్ రూపంలో తీసుకున్నా, స్నాక్స్, సలాడ్స్ రూపంలో తీసుకున్నా పోషకాలు, వాటర్ కంటెంట్ మాత్రం అలాగే ఉంటాయి. ఇలా డిఫరెంట్ గా తీసుకోవడం అంటే పిల్లలు, పెద్దలందరికి కూడా ఇష్టమే.
Story first published: Wednesday, April 5, 2017, 16:31 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter