For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాల్షియం లోపం వల్ల గుండె పోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందా ?

By R Vishnu Vardhan Reddy
|

మీరు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు రోజుకు కనీసం ఓ గ్లాస్ పాలు త్రాగమని విపరీతంగా బలవంతపెట్టేవారు అనే విషయం మీకు గుర్తుందా ?

చాలామంది చిన్న వయస్సులో ఉన్నప్పుడు పాలు, పళ్ళు, కూరగాయలు మొదలగునవి ఆరోగ్యపరంగా మంచి చేసే వస్తువులను తినమని చెప్పినప్పుడు అస్సలు ఇష్టపడరు.

అలర్ట్ : శరీరంలో క్యాల్షియం లోపం వల్ల వచ్చే అత్యంత ప్రమాదకర సమస్యలు

calcium health benefits

అందుకు కారణం ఆ చిన్న వయసులో ఆరోగ్యవంతమైన ఆహారం తినడం యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం ఒక కారణమైతే , అలా గనుక చేస్తే అది ఎంతటి ప్రభావాన్ని మన శరీరం పై చూపిస్తుంది అనే అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. దీంతో నోటికి ఏది రుచిగా ఉంటే అది తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు, చిరుతిండ్లను ఆరగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.

ఇక అసలైన నిజం ఏమిటంటే, పెరిగి పెద్ద అయిన తరువాత కూడా సమతుల్యత కలిగిన ఆహారం తినడం గురించి ఎంతో తెలిసినప్పటికీ మరియు ఆరోగ్యాన్ని దగ్గరుండి సంరక్షించుకోవాలి అని తెలిసినా చాలా మంది ఆరోగ్య విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తుంటారు. చాలామంది మన శరీరానికి హానిచేసే ఆహారాలనే ఎక్కువగా తీసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశం.

ఉదాహరణకు, చిరుతిండ్లు, చెత్త తిండి(జంక్ ఫుడ్) మరియు తరచూ బయటకు వెళ్లి ఆహారం తినటం అనేది మంచిది కాదని అనారోగ్యానికి గురిచేస్తుందని మనలో చాలామందికి తెలిసినా ఈ విషయాన్ని చాలామంది ఆచరణలో పెట్టరు. అందుకు కారణం నిగ్రహాలోపం. దీంతో తరచూ అనారోగ్య ఆహారాలను ఎక్కువగా తినేస్తుంటారు.

calcium health benefits

మనం మనుష్యులం కాబట్టి, మనం ఎంతో ఆరోగ్యవంతమైన జీవనవిధానాన్ని పాటిస్తూ సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ రోగాలు, వ్యాధులు మరియు అనారోగ్యం భారిన పడుతుంటాం. అటువంటిది ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని గనుక పాటించకపోతే, అటువంటి సమయంలో అది మన ఆరోగ్యం పై ఎంతటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

సమతుల్యత కలిగిన ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడికి మరియు కాలుష్యానికి దూరంగా ఉండటం ఇలా కొన్ని అతి ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించవచ్చు.

సమతుల్యత కలిగిన ఆహారంలో విటమిన్లు, కార్బోహైడ్రాట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కొవ్వు పదార్ధాలు మొదలగు పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మొదలగు ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

పైన చెప్పబడిన వివిధ రకాల పోషకాల్లో ఏ ఒక్కటి సరైన పరిమాణంలో తీసుకోకపోయినా అందువల్ల ఎదో ఒక లోపం తలెత్తడంతో మనం అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది.

ఈ మధ్యనే జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం లోపం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఆరోగ్యవంతంగా జీవించడానికి మరియు వ్యాధులకు దూరంగా ఉండటానికి కాల్షియం అనేది ఎంత ముఖ్యమైన ఖనిజమో మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం.

ఎముకల్లో గట్టితనం ఉండాలన్న మరియు పళ్ళు ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం ఉండాలన్నా కాల్షియం అనే ఖనిజం చాలా అవసరం. ఏ వ్యక్తిలో అయితే కాల్షియం లోపం ఉంటుందో అటువంటి వ్యక్తులు తరచూ ఎముకల వ్యాధులు మరియు దంత సమస్యలతో బాధపడుతుంటారు.

calcium health benefits

తాను తీసుకొనే ఆహారంలో భాగంగా ఏ వ్యక్తి అయితే కావాల్సినంత కాల్షియం తీసుకోరో అటువంటి వ్యక్తుల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. దీనినే వైద్య పరిభాషలో హైపోకల్ సెమియా అని అంటారు.

మీకు క్యాల్షియం లోపం ఉందని తెలిపే హెచ్చరిక సంకేతాలు

ఈ హైపోకల్ సెమియా వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇది మెదడులో ఉండే కణాల పై కూడా ప్రభావం చూపిస్తుంది, ఒత్తిడిని కలిగిస్తుంది, కండరాల నొప్పులు ఎక్కువ అవుతాయి, ఎముకల వ్యాధులు పెరుగుతాయి, కీల నొప్పులు అధికమవుతాయి, బలహీనంగా మారిపోతారు మరియు గోర్లు చాలా త్వరగా విరిగిపోతాయి. ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

కాల్షియం లోపం ఉన్నప్పుడు పైన చెప్పబడిన లక్షణాలన్నీ సాధారణంగా కనపడేవే. అయితే కాల్షియం లోపం వల్ల గుండె జబ్బులు కూడా పెరుగుతాయి అని ఒక అధ్యయనం చెబుతోంది. ఒక ప్రముఖ హృదోగ్ర సంస్థ చేపట్టిన అధ్యయనం ప్రకారం ఏ వ్యక్తుల్లో అయితే కాల్షియం శాతం చాలా తక్కువగా ఉందో, వారికి గతంలో ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు లేకపోయినప్పటికీ అనూహ్యంగా గుండె పోటు వచ్చిందట.

ఎప్పుడు అయితే శరీరంలో కాల్షియం శాతం చాలా తక్కువగా ఉంటుందో, ఆ సమయంలో గుండె యొక్క గోడలు చాలా బలహీనమైపోతాయట. దీంతో ఆయా వ్యక్తులు అనూహ్యంగా గుండెపోటు భారిన పడతారట. ముఖ్యంగా 50 ఏళ్ళు పై బడిన వారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి.

కాబట్టి చివరిగా చెప్పేదేంటంటే, కాల్షియం లోపం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు, ప్రతి రోజు తాము తీసుకొనే ఆహారంలో కాల్షియం అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందులో భాగం గానే పాలు, ఆకుకూరలు, పెరుగు మొదలగునవి మనం తీసుకొనే ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

English summary

Can Calcium Deficiency Increase The Risk Of Heart Attack | Calcium Deficiency Symptoms

If you want to know whether calcium deficiency can affect your heart, read this article!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more