For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్ సీజన్ ఖచ్ఛితంగా ఫాలో అవ్వాల్సిన ఫుడ్ రూల్స్ ..!!

|

నవంబర్ నుండి జనవరి వరకూ శీతాకాలం. చలికి సంకేతం. రుతు చక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలుపు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకువస్తుంది. మారిన రుతువుకనుగుణంగా మన దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెటర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం.. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథావిధిగా కొనసాగించ గలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే..

శరీరంలోపల ఆరోగ్యం సంగతేంటి? కాలాన్ని బట్టి ఆహారనియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్ కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. మరి ఈ వింటర్ డైయట్ కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి కొన్ని మీకోసం...శీతాకాలంలో ఇటువంటి ఆహారాలను మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారపదార్థాలను మిస్ కాకుండా తిని ఆరోగ్యంగా జీవించండి...

అమినో యాసిడ్స్ :

అమినో యాసిడ్స్ :

వింటర్ సీజన్లో వ్యాధినిరోధకత తక్కువగా ఉంటుంది. వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి మీలోని డల్ నెస్ ను నివారించుకోవడానికి సెరోటినిన్ లెవల్స్ ను పెంచుకోవాలి. ఈ కెమికల్స్ మీ మూడ్ ను మెరుగుపరుస్తాయి. ట్రిప్టోఫోన్ ఎక్కువగా ఉండే ఆహారాలు వింటర్లో మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అమినోయాసిడ్స్ లో ట్రిప్టోన్స్ అధికంగా ఉంటాయి . ఇవి బీన్స్, ఆకుకూరలు, కేలా, సీఫిష్, సీ వెజిటుబుల్స్ లో అధికంగా ఉంటాయి.

 విటమిన్ డి రిచ్ ఫుడ్స్:

విటమిన్ డి రిచ్ ఫుడ్స్:

వింటర్లో తినాల్సిన మరో ఫుడ్స్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ . సాధ్యమైనంత వరకూ ఉదయం ఎండలో కొంత సేపు ఉండటం మంచిది. లేదా విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. సాల్మన్, వంటి ఫిష్ తినడం వల్ల విటమిన్ డి ని ఎక్కువగా పొందుతారు,

ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ :

ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ :

ఈ వింటర్ సీజన్ లో ఎక్కువగా దొరికే గ్రీన్ వెజిటెబుల్స్ లో ఇదొకటి. అత్యధిక పోషకాలు కలిగినటువంటి ఆకుకూరలు, బచ్చలికూర, తోటకూర, మెంతి, పాలకూర వంటివి అధిక రుచిని అంధించడమే కాకుండా ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడుతాయి. ఆకుకూరలు తినడానికి బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా వండి తినడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా శరీరానికి అందుతాయి. ఒకటి కంటే ఎక్కువ విటమిన్లు ఒక్క క్యారెట్లోనే ఉన్నాయి. అటువంటి క్యారెట్లను ప్రకృతి సహజసిద్దంగా మనకు అంధించడం బహుమతే అనుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో శరీరానికి ఏఏ విటమిన్లు అవసరమో ఆ విటమిన్లు అన్నీ(విటమిన్ బి, సి, డి, ఇ మరియు కె)ఇందులో పుష్కలంగా ఉన్నాయి కెరోటిన్ విటమిన్ ఎ గా మార్చబడుతుంది. కాబట్టి క్యారెట్స్ ను వింటర్ డైయట్ లో ప్రధమ స్థానం కల్పించండి. అలాగే వింటర్లో దొరికే పండ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

 విటమిన్ సి డైట్ :

విటమిన్ సి డైట్ :

వింటర్లో సిట్రిక్ యాసిడ్ అధింగా ఉండే నిమ్మ, ఆరెంజ్ వంటివి వింటర్లో తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే.. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేదించే జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.

ప్రొబయోటిక్ ఫుడ్స్:

ప్రొబయోటిక్ ఫుడ్స్:

పొట్ట ప్రశాంతంగా జీర్ణ వ్యవస్థ బాగా జరగాలంటే, పొట్టకు హెల్తీ బ్యాక్టీరియాను అందివ్వాలి. వింటర్లో రెగ్యులర్ డైట్ లో పెరుగు వంటి ప్రోబయోటిక్ ఫుడ్ చేర్చడం వల్ల గౌట్ ను హెల్తీ ఉంచడం మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కాంప్లెక్స్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ :

కాంప్లెక్స్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్స్ :

వింటర్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దంగా ఉంచాలంటే, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే చికెన్ వంటి ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

English summary

Food Rules You Should Follow This Winter

Why should you have certain food rules for winter? This is because with the change of season, the needs of your body also change. Winter brings with it certain challenges that your body must react to. To combat these challenges, your body must be healthy and strong.
Story first published: Friday, January 20, 2017, 16:00 [IST]