మెదడు బాగా పని చేసేందుకు, జ్ఞాపకశక్తికి ఈ ఆహారాలు తీసుకుంటే చాలు

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ మెదడును ఒక రేంజ్ లో వాడుతున్నారు. పోటీ ప్రపంచంలో ఎవ్వరికీ రాని ఐడియాలను క్రియేట్ చేయాలంటే చాలా కష్టమే కదా. అలా అని మెదడుకు పని చెప్పకుంటే ప్రస్తుతం ఉన్న సొసైటీలో అస్సలు బతకలేం. ఎప్పటికప్పుడు క్రియేటివ్ గా ఆలోచిస్తేనే ఇక్కడ మనుగడ సాధించగలం. మీ మైండ్ బాగా పని చేసిందనుకో మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఆపేవాడే లేడు. మీరే కింగ్స్. మీరే క్రియేటర్స్. మనుషుల రూపంలో ఉండే ఎన్ని దుష్ట శక్తుల మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా మీరే విజేతలు అవుతారు. దట్ ఈజ్ మైండ్ కెపాసిటీ.

how to increase brain power memory,

వీటిన్నింటికీ మెదడు చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే నిత్యం యోగా, ధ్యానంలతో పాటు సరైన పౌష్టికాహారం చాలా అవసరం. మెదడు చురుకుదనాన్ని పెంచి, మెదడును ఆరోగ్యంగా ఉంచి, మంచి జ్ఞాపకశక్తిని ఇచ్చే కొన్ని రకాల ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆలివ్ ఆయిల్

1. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో పాలిఫేనోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆమ్లజనకాలు మెదడు సంబంధించిన వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడుతాయి. అందువల్ల ఎక్కువగా దీన్ని వినియోగిస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. బ్రెయిన్ మంచి పవర్ గా పని చేస్తాయి. అలాగే మంచి మెమొరీ వస్తుంది. దీంట్లో ఉండే ఓలియోకెంథాల్ అనే రసాయనం మతిమరుపు వంటి సమస్యలను తొలగిస్తుంది. మెదడు కణాలు ఉత్తేజంగా పనిచేసేలా చూస్తుంది.

2. కొబ్బరి నూనె

2. కొబ్బరి నూనె

ఇది మెదడులోని నాడీకణాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇది కాపాడగలుతుంది. అంతేకాకుండా సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అందివ్వడానికి కూడా తోడ్పడుతుంది.

3. అవకాడో

3. అవకాడో

అవకాడోలు మెదడులోని రక్తం గడ్డటాన్ని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో కే విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుది. ఇవన్నీ మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడుకు ఎలాంటి స్ట్రోక్ రాకుండా ఉండేందుకు అవకాడో బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల వీలైనంత వరకు అవకాడో పండ్లను తింటూ ఉండండి. వీటి వల్లే అన్ని ప్రయోజనాలున్నాయి.

4. వైల్డ్ సాల్మన్

4. వైల్డ్ సాల్మన్

ఇందులో ఒమేగా -3 డీహెచ్ ఏ ఎక్కువగా ఉంటుంది. డీఎచ్ ఏ మెదడు కణాల ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. మీ మెదడు బాగా పని చేయాలంటే ఈ చేపల్ని బాగా తినండి. మెదడుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్స్ లో ఇది ఒకటి.

5. బ్లూబెర్రీస్

5. బ్లూబెర్రీస్

వీటిలో ఉండే చాలా పవర్ ఫుల్ ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మెదడుకు చాలా మేలు చేస్తాయి. మెదడుకు సంబంధించిన కణాల వాపు తగ్గించడానికి కూడా ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. అందువల్ల బ్లూబెర్రీస్ ను ఎక్కువగా తింటూ ఉండాలి.

6. పసుపు

6. పసుపు

మెదడు కణాలకు సంబంధించిన వాపును తగ్గించడానికి పసుపు బాగా పని చేస్తుంది. ఇవి డీఎన్ ఏపై ప్రభావం చూపుతాయి. ఇందులో యాంటీ డిప్రెస్సెంట్లుగా పనిచేసే పలు ఔషధాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి. పసుపు మనం నిత్యం ఆహారాల్లో తీసుకుంటూనే ఉంటాం. దీని ఉపయోగం తెలుసుకుని మరింత ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

7. గుడ్లు

7. గుడ్లు

వీటిలో కొలైన్ అధికంగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్మిటర్లకు చాలా అవసరం. పాస్పోలిపిడ్స్ గుడ్డులో అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు, నాడీ వ్యవస్థకు చాలా అవసరం. ఇందులోని పోషకాలు మెదడులోని కణాలను ఆరోగ్యంగా మారుస్తాయి.

8. డాండెలైన్ గ్రీన్స్

8. డాండెలైన్ గ్రీన్స్

ఇవి మెదడుకు అవసరమైన ఫ్రీబయోటిక్ ఫైబర్ ను అందిస్తాయి. మెదడు శక్తిని పెంపొందించడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

9. వాల్ నట్స్

9. వాల్ నట్స్

వాల్ నట్స్ తింటే మన మెదడుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. మెదడు పనితీరును మెరుగు పర్చడంలో ఇవి బాగా పని చేస్తాయి. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. ఇవి మెదడులోని కణాలను చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. అలాగే న్యూరాన్ల మధ్య సమాచారం వేగంగా వెళ్లేలా ఉపయోగపడతాయి. ఇందులో మాంగనీస్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాల్ నట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి.

10. ఆస్పరాగస్

10. ఆస్పరాగస్

ఇందులో ప్రీబియోటిక్ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది బాగా తోడ్పడుతుంది. ఇందులో ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడు కణాలు బాగా పని చేసేలా చేస్తుంది.

11. కిమిచి

11. కిమిచి

ఇందులో కూడా ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది కొరియాకు సంబంధించిన వంటకం. అయితే దీన్ని తినడం వల్ల మెదడు బాగా పని చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది.

12. కాలే

12. కాలే

కాలేలో విటమిన్లు సి, కె, ఎ, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల వీలైనంత ఎక్కువగా దీన్ని తింటూ ఉండాలి. మెదడు మరింత చురుకుగా పని చేసేందుకు కాలే బాగా ఉపయోగపడుతుంది.

13. బ్రోకలీ

13. బ్రోకలీ

ఇందులో సల్ఫ్యూరోఫేన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా విధాలుగా పని చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ను కంట్రోల్ లో ఉంచేందుకు, మెదడుకు సంబంధించిన కణాల పని తీరును మెరుగుపరిచేందుకు, డిటాక్సిఫికేషన్ కు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ లో ఇది ఒకటి. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా తింటూ ఉండాలి.

14. రెడ్ వైన్

14. రెడ్ వైన్

మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచే పాలిఫేనోల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకూ రెడ్ వైన్ తాగుతూ ఉండండి. మీ మెదడు షార్ప్ గా పని చేసేందుకు ఇది బాగా తోడ్పడుతుంది.

15. పాలకూర

15. పాలకూర

ఇందులో విటమిన్ కే, ఫోలేట్, లౌటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతోపాటు పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

ఈ ఆహారాలన్నింటినీ ఎక్కువగా తింటూ ఉంటే కచ్చితంగా మీ మైండ్ ఒక రేంజ్ లో పని చేస్తుంది. మీ మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మీలో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అందువల్ల ఈ ఆహారాలను ఇక నుంచి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

English summary

foods to increase brain power memory

Some foods are better for your brain than the others. Here, we have listed some of the best foods to increase your brain power.
Story first published: Tuesday, November 21, 2017, 12:02 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter