For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు! వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడానికి సహాయపడే 9 ఆహారపదార్ధాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి!

By Lakshmi Bai Praharaju
|

మనం టెలివిజన్ చూస్తున్నప్పుడు లేదా మాగజైన్ పేజీలు తిప్పుతున్నపుడు, మనం అనేక రకాల యాంటీ-ఏజింగ్ లక్షణాలు కల సౌందర్య ఉత్పత్తుల ప్రకటనలను చూస్తాము. అవునా?

అయితే, ఈమధ్య అనేక రకాల యాంటీ-ఏజింగ్ సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముతున్నారు, వాటికి మంచి డిమాండ్ ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది!

దీనివల్ల, మనుషులు, ఎక్కువ కాలంపాటు యంగ్ గా ఉండాలని చాలామంది అనుకోవడం సహజం, ఎందుకంటే వృద్ధాప్య సంకేతాల వల్ల మనం వయసుకి మించి కనపడతామని లేదా అసురక్షితమైనదని కూడా మేము భావిస్తున్నాము!

సహజమైన యాంటీ-ఏజింగ్ పదార్ధాలు అయినప్పటికీ, వయసు మీద పడే కొద్దీ వృద్ధాప్య లక్షణాలు రావడం అనేది అనివార్మైనది, జీవితంలో అదొక భాగం, కానీ మనం మనుషులం కావటం వల్ల యంగ్ గా ఆధ్యమైనంత ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నిస్తాము!

వృద్ధాప్యానికి చెందిన కొన్ని సంకేతాలు మనం వయసులో ఉన్నప్పుడు పొందే ఆనందాన్ని కోల్పోయేట్టు చేస్తాయి, అంతేకాకుండా మనల్ని భయపెట్టే మ్రుత్యువుకి కూడా దగ్గర అవుతాము అనేది వాస్తవం!

కాబట్టి, చాలామంది, పురుషులైనా లేదా స్త్రీలైనా, నరిసిన జుట్టు, ముడతలు, చర్మం గీతలు వంటి శారీరిక వృద్ధాప్య సంకేతాలు రాకుండా మాస్క్ లేదా వాటిని నిదానపరిచే ప్రతిదీ చేయడానికి ప్రయత్నించాలి.

ఇప్పటి నుండే వయసు మచ్చలు, ముడతలను కవర్ చేసే మేకప్ ని వేసుకొని, నెరిసిన జుట్టుకు డై వేసుకోవాలి, కొంతమంది ఖర్చును భరించ గలిగే వారు బోటిక్స్ కి వెళ్లి సౌందర్య పద్ధతులను పొంది, శారీరిక వృద్ధాప్య సంకేతాలను పోగొట్టే ఫేస్ లిఫ్త్స్ చేసుకుంటారు.

గణాంకాల ప్రకారం, వృద్ధాప్య సంకేతాల శ్రద్ధ విషయంలో సామాజిక అంచనాల కారణంగా, పురుషులతో పోలిస్తే స్త్రీలే మరింత ఆందోళన కలిగి ఉంటారని చెప్తున్నాయి.

కాబట్టి, మీరు 25 సంవత్సరాల వయసు నిండిన స్త్రీలయితే, వృద్ధాప్యాన్ని సహజ మార్గాలలో తగ్గించుకోవాలి అనుకుంటే, ఇక్కడ మీకు సహాయపడే కొన్ని ఆహార పదార్ధాలు ఇవ్వబడ్డాయి; ఒకసారి చూడండి!

1.దానిమ్మపండు

1.దానిమ్మపండు

దానిమ్మపండు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అద్భుతమైన పండు, అధిక పోషకాలు కలిగి ఉన్నందుకు వాటికి ధన్యవాదాలు. ప్రతిరోజూ కనీసం 100 గ్రాముల దానిమ్మపండు గింజలు తింటే స్త్రీలు ఎక్కువ కాలం అందంగా, వయసులో ఉన్నట్టు భావించడానికి సహాయపడుతుంది, ఈ పండు యాంటీ-ఆక్సిడెంట్లు, ఎలాజిక్ ఆసిడ్ కలిగి ఉండడం వల్ల, ఫ్రీ రాడికల్స్ డామేజ్ ని తగ్గించి, ముడతలు, వయసు వల్ల వచ్చే మచ్చలను నిరోధిస్తుంది.

2.అవకడో

2.అవకడో

భారతదేశంలో ‘బటర్ ఫ్రూట్' గ ప్రసిద్ది కెక్కిన అవకడో లు ప్రపంచం మొత్తంలో అధిక ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్ లు కలిగి ఉన్న అద్భుతమైన పండు. అవకడో లో ఉన్న ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు మీ చర్మాన్ని తేమగా ఉంచి, ముడతలు లేకుండా చేస్తుంది. అవకడో లో ఉన్న లినోలిక్ ఆసిడ్ చర్మ కణాలను పోషించి, ప్రారంభ క్షీణతను నిరోధిస్తాయి.

3.కోడిగుడ్లు

3.కోడిగుడ్లు

ఆరోగ్య ప్రయోజనాల మొత్తంలో కోడిగుడ్లు ప్రత్యేకమైన అల్పాహార ఆహార పదార్ధలలోకి వస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించాలని అనుకునే వారు కండరాల పటుత్వాన్ని పెంచాలని అనుకునే వారు గుడ్లమీద ఆధారపడి ఉంటుంది! అంతేకాకుండా, మన జుట్టు, చర్మ కణాలకు ఎక్కువ కాలం యంగ్ గా ఉండాలి అంటే ప్రోటీన్లు అవసరం, కోడిగుడ్డు లో అధిక ప్రోటీన్లు ఉండడం వల్ల, ఇది ఒక మంచి పోషకాహారం.

4.ఫెనుగ్రీక్

4.ఫెనుగ్రీక్

భారతదేశంలో ‘మెంతి' ఆకుగా పేరుగాంచిన ఈ ఫెనుగ్రీక్ మన ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు కలిగిన ఒక రకమైన ఆకుకూర. ఈ ఫెనుగ్రీక్ ఆకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, మినరల్స్ మీ చర్మకణాలను పునరుత్తేజపరిచి, కణాల ప్రారంభ క్షీణతను నిరోధించి, తద్వారా వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి.

5.బ్లూబెర్రీస్

5.బ్లూబెర్రీస్

బ్రూబెర్రీస్ మంచి క్రుచికరమైన బెర్రీలు, ఇందులో అధిక కొవ్వును తగ్గించడం, గుండె ఆరోగ్యం మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బ్లూబెర్రీస్ లో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల, కొత్త చర్మం, జుట్టు కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా, ముడతలను, ఫైన్ లైన్ లను నిరోధిస్తాయి.

6.పుచ్చకాయ

6.పుచ్చకాయ

పుచ్చకాయ లోని తీపి రుచి, తాజాగా ఉండే భావనను చాలామంది ఇష్టపడతారు, అవునా? అయితే, పుచ్చకాయలు వృద్ధాప్య ప్రక్రియను తగ్గించే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది, ముఖ్యంగా స్త్రీలలో, ఎందుకంటే వాటిలో పొటాషియం, విటమిన్ C, యాంటీ-ఆక్సిడెంట్లు ఉండడం వల్ల, ఇవన్నీ కలిసి చర్మ కణాలను మృదువుగా చేసి, ముందుగా క్షీణతను అడ్డుకోవడాన్ని నిరోధిస్తాయి.

7.పెరుగు

7.పెరుగు

మీరు ప్రతిరోజూ పెరుగు తినడం లేదా పెరుగన్నం తినడం, ఈ రెండూ ప్రోబయోటిక్స్ తూపాలు మీరు సహజంగా వయసుని తగ్గించుకోవాలి అనుకుంటే సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం మీ ఎముకలను, చర్మ కణాలను బలంగా చేసి, మీరు ఎక్కువకాలం అందంగా, మరింత యవ్వనంగా ఉండేట్టు చేస్తాయి.

8.బాదం

8.బాదం

గింజలు చాలా ఆరోగ్యకరమైన ఆహరం, మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందాలి అంటే వీటిని స్నాక్ గా తీసుకోవాలి. బాదంపప్పులు విటమిన్ E , ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు కలిగిన గింజలలో ఒకటి. ఈ రెండు పోషకాలు కొత్త చర్మ కణాలలో పునరుత్పత్తిని ప్రోత్సహించి, స్త్రీలలో వృద్ధాప్య౦లో వచ్చే శారీరిక సంకేతాలను తగ్గించుకోవచ్చు.

9.నిమ్మకాయ

9.నిమ్మకాయ

నిమ్మకాయ రసం తీసుకోవడం లేదా మీ దైనందిన ఆహారంలో నిమ్మను జతచేయడం, అంతేకాకుండా మీ చర్మంపై నిమ్మరసంతో రుద్దితే ముడతలు త్వరగా రాకుండా, వయసు వల్ల వచ్చిన మచ్చలు, ఇతర వృద్ధాప్య సంకేతాలు త్వరగా రాకుండా సహాయపడుతుంది, నిమ్మలో విటమిన్ C అధికంగా ఉండడం వల్ల, ఇది మీ చర్మ కణాలను బాగా పురనుద్ధరించి, ఎక్కువ కాలం సున్నితంగా ఉండేట్టు చేస్తాయి.

English summary

Foods That Can Help Slow Down The Ageing Process|

Physical signs of ageing such as grey hair, wrinkles, age spots, etc., can lead to a lot of insecurity, especially in women.Many women tend to use expensive anti-ageing cosmetics, which may or may not work . So, here is a list of anti-ageing foods for women, which can help them slow down ageing from within, naturally!
Story first published: Friday, December 15, 2017, 14:40 [IST]