For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తినే బియ్యంలో కల్తీ వుందా? సాధారణ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని ఎలా గుర్తించాలి?

అవును, ఈ రోజుల్లో బియ్యం కూడా కల్తీ అవుతోంది! మీరు నకిలీ బియ్యం గురించి వినేవుంటారు. సాధారణ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి కల్తీ చెయ్యడం కొన్ని చోట్ల జరుగుతోంది. అలాంటి బియ్యం తింటే ఆంతేసంగతులు

|

అవును, ఈ రోజుల్లో బియ్యం కూడా కల్తీ అవుతోంది! మీరు నకిలీ బియ్యం గురించి వినేవుంటారు. సాధారణ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి కల్తీ చెయ్యడం కొన్ని చోట్ల జరుగుతోంది. అలాంటి బియ్యం తింటే ఆంతేసంగతులు! ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమైనది!

చూడ్డానికి కల్తీ బియ్యం కూడా సాధారణ బియ్యంలాగే ఉంటుంది. అది నకిలీ అని తెలుసుకోవడం కష్టం. అందుకే బియ్యం కొనే ముందు జాగ్రత్త వహిండం మంచిది.

ఈ వార్తలో నిజముందా లేక ఇది కేవలం పుకారా అన్న సంగతి పక్కన పెడితే, మన జాగ్రత్తలో మనం ఉండడంలో తప్పేముంది? ప్లాస్టిక్ బియ్యం తినకపోడం మంచిది. తింటే కనుక తీవ్రమైన జీర్ణ సమస్యలకు గురికావచ్చు.

అసలు ప్లాస్టిక్ బియ్యంతో ఏంటి సమస్య? ప్లాస్టిక్లో phthalates అనే కెమికల్స్ ఉంటాయి. ఇటువంటి రసాయనాలు మీ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. అవి మీ సంతానోత్పత్తిని కూడా దెబ్బతీస్తాయి.

అందుకే, జాగ్రత్త వహించడం మంచిది. మీరు తినే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉందొ లేదో ఎలా గుర్తిస్తారు? ఇదిగో, ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చదవండి.

చిట్కా # 1

చిట్కా # 1

ఒక గుప్పెడు బియ్యాన్ని తీస్కుని ఒక కంచం లో వేసి దానికి అగ్గి పుల్లతో నిప్పు పెట్టండి. అందులో కనుక ప్లాస్టిక్ బియ్యం ఉంటే, మీకు ప్లాస్టిక్ కాలిన వాసన వస్తుంది! అలాంటి బియ్యం వాడకండి!

చిట్కా # 2

చిట్కా # 2

స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొంచం ఆయిల్ ని వేడి చేసి అందులో ఒక గుప్పెడు బియ్యాన్ని ఫ్రై చెయ్యండి. అందులో ప్లాస్టిక్ ఉంటే కనుక అది కరిగి గిన్నె కింద ఒక పొరలా ఏర్పడుతుంది!

చిట్కా # 3

చిట్కా # 3

ఇది అన్నిటి కన్నా సులభమైన పధ్ధతి. ఒక గుప్పెడు బియ్యాన్ని ఒక గ్లాస్ నీళ్లలో వేసి ఒక స్పూను తో బాగా కలపండి. అదే గనుక ప్లాస్టిక్ బియ్యం అయితే, అది నీటి మీద తేలుతుంది. సాధారణ బియ్యం తేలదు, కింద మునగాలి.

చిట్కా # 4

చిట్కా # 4

ఒక గుప్పెడు బియ్యాన్ని ఒక గ్లాస్ నీటి లో ఉడికించండి. అది ఉడికేటప్పుడు పైన తెల్లటి పొరలాగా ఏర్పడితే కనుక అది ప్లాస్టిక్ బియ్యం!

చిట్కా # 5

చిట్కా # 5

మీ బియ్యం నకిలీ అని నిర్ధారించడానికి మరొక మార్గం ఇది. ఉడికించిన బియ్యం రెండు రోజుల పాటు అలాగే ఉంచి చూడండి. సాధారణ బియ్యం అయితే కనుక పాచి పట్టి కంపు వస్తుంది. అదే ప్లాస్టిక్ బియ్యం అయితే కనుక ఎన్ని రోజులైనా బూజు పట్టదు!

ఇప్పుడు ఏం చేయాలి?

ఇప్పుడు ఏం చేయాలి?

ఇప్పటి దాకా కనుక మీరు ప్లాస్టిక్ బియ్యాన్ని వాడినట్లైతే ఒక సారి డాక్టర్ ని కలిసి ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం మంచిది. ఇక నుంచి, బియ్యం కొనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పరీక్షించి కొనడం మంచిదేమో కదా? కలికాలం; ఏం చేస్తాం?

Read more about: nutrition diet toxins body
English summary

How To Identify Plastic Rice

You must have heard about the fake rice in the news. Fake rice contains plastic rice. Its is very dangerous to your health.
Desktop Bottom Promotion