For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లావుగా ఉన్నారు, ప్లస్ డయాబెటిస్ ఉంది! మీరు ఖచ్చితంగా తినాల్సిన లో-షుగర్ ఫ్రూట్స్

By Mallikarjuna
|

పండ్లు ఆరోగ్యానికి మంచివి అని అందరికీ తెలుసు, బాస్కెట్ నిండా పండ్లు చూడగానే మనస్సులో వెంటనే 'రుచి’, 'ఆరోగ్యం’ మరియు 'ఫ్యాట్ ఫ్రీ’ అనే గుర్తొస్తుంది, కదా?

అదే విధంగా, వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ఈ రెండింటిని పోల్చి చూస్తే వెంటనే గుర్తొచ్చేది న్యాచురల్ పదార్థాలు. హెల్తీ డైట్ అని ?

మనం రోజూ తినే పండ్లు, కూరగాయలు పోషకాలు అందించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లైన, కూరగయాలైనా తీసుకునేటప్పుడు మొదట బరువు లేదా ఓవర్ వెయిట్, లేదా ఊబకాయం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వయస్సు మరియు జెండర్ ప్రకారంన , అలాగే (బిఎంఐ)బాడీ మాస్ ఇండెక్స్ నార్మల్ రేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకును ప్రతి ఆహార పదార్థం ప్రభావం చూపుతుంది.

fruits low in sugar, healthy fruits for weight loss

శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల వ్యక్తి చూడటానికి అన్ ఫిట్ గా, బాడీ షేప్ వికారంగా కనబడుతుంది.ఈ విషయం అతను లేదా ఆమెలో నమ్మకాన్ని తగ్గించేస్తుంది.

ముఖ్యంగా, ఓవర్ వెయిట్ లేదా ఊబకాయం వల్ల శరీరంలో అధిక కొవ్వు చేరడం, కీళ్ళ నొప్పులు, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ సమస్యలు, డిప్రెషన్, జీర్ణ సమస్యలు మొదలగు మైనర్ లేదా మేజర్ వ్యాధులు వస్తాయి.

హెల్తీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల అనారోగ్యకరమైన ఫ్యాట్ మరియు క్యాలరీలను తగ్గిస్తుంది. వ్యక్తులు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గించుకునే క్రమంలో చాలా మంది పండ్లు మరియు వెజిటేబుల్స్ అధికంగా తీసుకుంటారు. చాలా మంది పండ్లలో షుగర్ కంటెంట్ మరియు ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుందని అనుకుంటారు.

అదే విధంగా, డయాబెటిస్ తో బాధపడుతున్న వారు (మెటబాలిక్ డిసీజ్ శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సరిగా లేకపోవడం వల్ల అనేక నెగటివ్ లక్షణాలు కనబడుతాయి)పండ్లు తినడం హానికరం కాదు, వీటిలో షుగర్ కంటెంట్ ఉండదను అనుకోవడం సహజం.

వాస్తవానికి , చాలా రకాల పండ్లలో కూడా షుగర్ కంటెంట్ అధికంగా ుంటుంది. ఇది బరువు మీద ప్రభావం చూపుతుంది, డయాబెటిస్ లక్షణాలను మరింత తీవ్రం చేస్తుంది.

షుగర్ కంటెంట్ తక్కువగా ఉండే కొన్ని పండ్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి. షుగర్ ఉన్న వారు ఈ పండ్లను నిరభ్యరంతరంగా తినవచ్చు..

1. స్ట్రాబెర్రీస్

1. స్ట్రాబెర్రీస్

షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండే ఫ్రూట్ ఇది. అయితే ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉన్నాయి. ఇవి మెటబాలిజం మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, బరువు తగ్గిస్తాయి.

2. పీచెస్

2. పీచెస్

పీచెస్ లో షుగర్ కంటెంట్ చాలా తక్కువ, ఒక మీడియం సైజ్ పీచెలో 10 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరిచి, వ్యాధినిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

3. బ్లాక్ బెర్రీస్

3. బ్లాక్ బెర్రీస్

బ్లాక్ బెర్రీ మరో రకమైన ఫ్రూట్ ఎవరైతే ఓబేసిటి, డయాబెటిస్ తో బాధపడుతుంటారో వాళ్ళు ఎలాంటి భయం లేకుండా బ్లాక్ బెర్రీస్ తినవచ్చు, ఇందులో కేవలం 4-5గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. బ్లాక్ బెర్రీస్ లో విటమిన్ కె అధికం. ఇది ఓవర్ హెల్త్ ను సమాయపడుతుంది.

4. నిమ్మరసం

4. నిమ్మరసం

ఇతర పండ్లు వలె నిమ్మకాయను చాలా మంది తినరు. ఈ ఫ్రూట్ లో షుగర్ కంటెంట్ 2గ్రాముల కంటే తక్కువగా ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉండి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

5. మస్క్ మెలోన్

5. మస్క్ మెలోన్

ఈ టేస్ట్ కూలింగ్ ఫ్రూట్ ఇండియాలో బాగా విరివిగా అందుబాటులో ఉంది, ఇందులో 11గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. ఈ పొటాషియం కంటెంట్ విటమిన్ కె బరువు తగ్గడానికి వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి మెటబాలిక్ రేటును పెంచడానికి , జీర్ణ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

6. ఆరెంజెస్

6. ఆరెంజెస్

ఆరెంజెస్ లో విటమిన్ సి మరియు ఫొల్లెట్ అధికంగా ఉంది. వ్యాధినిరోధకత పెంచడంలో బెస్ట్ ఫ్రూట్. వ్యాధులతో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. డయాబెటిస్ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా ఈ ఫ్రూట్ తీసుకోవచ్చు. ఇందులో 12 గ్రాము డైజెస్టబుల్ షుగర్ కంటెంట్ ఉంటుంది.

7. గ్రేప్ ఫ్రూట్

7. గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్ చాలా పాపులర్ ఫ్రూట్ . ఇది మెటబాలిజంను పెంచి , తక్షణ ఎనర్జీని అందిస్తుంది. గ్రేఫ్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. గ్రేప్ ఫ్రూట్ లో కూడా 11గ్రాముల షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

8. అవొకాడొ

8. అవొకాడొ

అవొకాడో లేటెస్ట్ ఫ్రూట్, ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు న్యూట్రీషియన్ ఎక్కువ. అవొకాడో దాదాపు షుగర్ ఫ్రీ కంటెంట్ ఫ్రూట్ !

9. యాపిల్స్

9. యాపిల్స్

యాపిల్సో కేవలం 10 గ్రామలు షుగర్ మాత్రమే ఉంటుంది,. బరువు తగ్గాలనేకునే వారికి , డయాబెటిస్ పేషంట్స్ కు ఇది సురక్షితమైన పండు, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

Low-sugar Fruits For People Suffering From Obesity & Diabetes

Many of us think that all fruits are low in sugar content and calories. However, there are some fruits that contain less sugar than the others. Here is a list of fruits that are low in sugar content, which can be consumed by individuals with diabetes and those who are aiming at weight loss.
Desktop Bottom Promotion