For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సీతాఫలంలోని లాభాలు మీరు తెలుసుకుంటే, రోజూ ఇష్టపడి తింటారు

By Mallikarjuna
|

శీతాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చే పండు సీతాఫలం. ఆంగ్లంలో కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్ అని పిలిచే ఈ పండు కమ్మని రుచిగా ఉండటమే గాక ఆరోగ్యానికి చెప్పలేనంత మేలు చేస్తుంది. సీతాఫలంతో బాటు ఈ చెట్టు ఆకు, బెరడు, గింజలలోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి. యాపిల్ వంటి ఫలాలతో పోల్చితే చౌకేగాక అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ సీజన్లో తప్పక సీతాఫలం తిని మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకుందాం.

పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పోషక విలువలు అధికంగా ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి. ఇది తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.


సీతాఫలంలో పోషక విలువలు అధికం. కస్టర్డ్ యాపిల్ అని పిలిచే సీతాఫలంలో ఐరన్, పాస్ఫరస్, మెగ్రీషియంలతోపాటు విటమిన్-సి సమృద్ధిగా లభిస్తాయి. వంద గ్రాముల సీతాఫలంలో 68.6 గ్రాముల తేమ, 1.6 గ్రాముల కొవ్వు, 26.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.4 గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, థయమిన్, రైబోఫ్లోవిన్, నియాసిన్ కూడా ఇందులో ఉంటాయి.

ఈ పండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పల్లెటూళ్లలో పెరిగిన వారు సీతాఫలాలను మగ్గబెట్టుకొని తిన్న రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక లక్కీగా చెట్టు మీద పండిన సీతాఫలం తింటే.. ఆ రుచిని మాటల్లో వర్ణించలేం. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సేకరించి పట్టణాల్లో రోడ్ల వెంట విక్రయిస్తున్నారు. కానీ అడవులు తరిగిపోవడం, కోతుల బెడద కారణంగా వీటి రేటు ఎక్కువగా ఉంటోంది. . ఇది సీజ‌న‌ల్ ఫ్రూట్ కావడం చేత క‌చ్చితంగా దీన్ని అంద‌రూ తినాల్సిందే. సీతాఫ‌లంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. సీతాఫలం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యంగా అమ్మాయిల ఆరోగ్యానికి ఇది మంచి ఔషధం. ఏదైన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు వీటిని తింటే ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువ చేసే గుణం ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిని తినడం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి సమస్యలు దూరం అవుతాయి. నార్మల్ బ్లడ్ ప్రెజర్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చర్మంలో బొబ్బలు, అల్సర్, దంతసమస్యలను నివారించడంలో సీతాఫలం గ్రేట్ అని చెప్పవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కు ఇది గ్రేట్ ట్రీట్మెంట్ ఇది దంతసమస్యలను, చిగుళ్ళవ్యాధిని నివారిస్తుంది. అంతే కాదు వీటితో పాటు మరీన్నె ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...

ఆస్త్మా:

ఆస్త్మా:

సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల బ్రోంకైల్ ఇన్ప్లమేషన్ తగ్గించి ఆస్త్మాటిక్స్ అటాక్ ను తగ్గిస్తుంది.

హార్ట్ అటాక్

హార్ట్ అటాక్

హార్ట్ అటాక్ సీతాఫలంలో ఉండే మెగ్నీషీయం అధికంగా ఉంటుంది . దీన్ని వల్ల ఒక గొప్ప ఆరోగ్యప్రయోజనం కార్డియక్ అటాక్స్ నుండి రక్షిస్తుంది.గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది,. అనేక రకాల అనారోగ్యకరమైన అలవాట్లు, జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యం బలహీనపడుతుంది, కార్డియో వాస్క్యులర్ వ్యాధులకు కారణం అవుతుంది. ఈ సమస్య నుండి గుండె ఆరోగ్యాన్ని కాపడటానికి సీతాఫలం ఉపయోగపడుతుంది ఇందులో ఉండే విటమిన్ బి6హీమో సైటిన్ ను నివారించి, హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది.

డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది:

డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది:

ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. షుగర్ షోషణను సీతాఫలం తగ్గిస్తుంది .దాని వల్ల టై2 డయాబెటిస్ తగ్గిస్తుంది. టైప్ 1 మధుమేహం ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే బాగా పండిన పండును తింటే ఎలాంటి బాధా ఉండదు. లివర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం సీతాఫలానికి దూరంగా ఉండాలి.సీతాఫలంలో ఉండే విటమిన్ సి బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. డయాబెటిస్ నుండి రక్షణ కల్పిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

సీతాఫలంలో కాపర్ మరియు డైటర్ ఫైబర్ అధికంగా ఉన్న హెల్తీ ఫ్రూట్. ఈ కాపర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక అడిషన్ గా బౌల్ మూమెంట్ క్రమంగా ఉంటుంది. మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది. ప్రేగుల్లోని వ్యర్థాలను బయటకు నెట్టివేస్తుంది. బౌల్ మూమెంట్ ను చురుకుగా ుంచుతుంది. పొట్ట సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటి, హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఒక సీతాఫలంలో 6గ్రాముల ఫైబర్ ఉంటుంది. మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

సీతా ఫలంలో నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. కొవ్వు అసలే మాత్రం లేని సీతాఫలంలో సులువుగా అరిగిపోతుంది. గనుక అన్ని వయసుల వారూ హాయిగా తినొచ్చు.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

సీతాఫలం వల్ల మరో గొప్ప ప్రయోజనం పొటాషియం మరియు మెగ్నీషియం ఉండటం వల్ల, ఈ రెండు బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.ఉందు ఉండే మెగ్నీషియం పొట్ట కండరాలకు స్మూత్ గా చేస్తుంది, హార్ట్ క్రాంప్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ ను నివారిస్తుంది.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

సీతాఫలంలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది. హై క్యాలరీ, కాపర్, ఐరన్ లో అనీమియాతో బాధపడే వారికి సహాయపడుతుంది. హీమోగ్లోబిన్ పెంచుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు వీటిని ఎక్కువగా సూచిస్తుంటారు.

వ్యాధినిరోధకను పెంచుతుంది:

వ్యాధినిరోధకను పెంచుతుంది:

సీతాఫలంలో న్యాచురల్ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల , ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూన్ గుణాలు అధికంగా ఉన్నాయి. కేవలం ఒక సర్వింగ్ ఫ్రూట్ ను రోజు వారి డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇన్ ఫక్చ్యువేషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి ఉపశమనం కలిగించి, వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది

 ఎనర్జీని అందించి, బరువు తగ్గిస్తుంది:

ఎనర్జీని అందించి, బరువు తగ్గిస్తుంది:

సీతాఫలంలో ఉండే గుణాలు ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తాయి. మజిల్ వీక్ నెస్ ను తగ్గిస్తాయి. అలాగే బరువు పెరగడానికి సహాయపడుతుంది, క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల ఆకలి పెంచుతుంది. ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు, ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల క్రమంగా బరువు పెరుగుతారు. ఓబేసిటి వారు సీతాఫలం తినకపోవడం మంచిది.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఏదైనా కంటికి సంబంధించిన సమస్యలు సీతాఫలం నుండి నివారించుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే రెబోఫ్లెవిన్, మరియు విటమిన్ బి2 ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది,. కంటి సమస్యలను తగ్గుతాయి.

English summary

10 Major Health Benefits Of Custard Apple You Need To Know

10 Major Health Benefits Of Custard Apple You Need To Know,