వింటర్ సీజన్లో ఖచ్చితంగా తినాల్సిన నట్స్ అండ్ సీడ్స్ !

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

ప్రస్తుతం చలికాలం, ఆరోగ్యం, శరీరాన్ని కాపాడుకోవడానికి ఆల్రెడీ వెచ్చని దుస్తులు బయటకు తీసేసాము. స్వెటర్లు, కాటన్ దుస్తులు ఇలా వింటర్ స్పెషల్ దుస్తులకు ఈ సీజన్లో ప్రత్యేకం. చలి నుండి శరీరాన్ని కాపాడుకోవడం వెచ్చగా ఉండే దుస్తులు ధరిస్తాము, పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లలో దూరి పోయి వెచ్చగా నిద్రపోతాము కదా..

శరీరం బయట సంగతి సరే, మరి శరీరంలో లోపలి సంగతేంటి, శరీరానికి ఈ చలికాలంలో సరైన న్యూట్రీషియన్స్ అందుతున్నాయా? చలికాలంలో మీరు ఫిట్ గా మరియు హెల్తీగా ఉండటానికి, చలి, గాలిలోని తేమ నుండి శరీరాన్ని కాపాడుకోవడం ఎలా?

చలికాలంలో జంక్ ఫుడ్స్ ను పక్కన పెట్టి, హెల్తీ నట్స్, సీడ్స్ తీసుకునే సమయం వచ్చింది. సీడ్స్ అంట్ నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. వింటర్ సీజన్లో శరీరానికి కావల్సిన పోషకాలను ఇవి అందిస్తాయి. ఈ సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది.

Nuts & Seeds That Are A Must Have For Winters!
వింటర్లో నట్స్ అండ్ సీడ్స్ ఎందుకు తీసుకోవాలి? వాటి వల్ల ప్రయోజనం ఎంటి అంటారా?

ఈ సీడ్స్ అండ్ నట్స్ లో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన , వ్యాధినిరోధకతను పెంచే ప్రయోజనాలున్నాయి. వింటర్లో సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వింటర్లో ఎలాంటి ఆరోగ్య భయాలు లేకుండా గడపవచ్చు. అలాగే రోజులో వేడి వేడి పదార్థాలు, ఆహారాలు తీసుకోవడం మంచిది. అలాగే డైట్ లో ఏదో ఒక రూపంలో నట్స్ అండ్ సీడ్స్ చేర్చుకోవడం మరింత ముఖ్యం.

చలికాలంలో మగవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన సూపర్ ఫుడ్స్..!!

కాబట్టి, ఈ వింటర్లో మీరు ఖచ్చితంగా తినాల్సిన కొన్ని నట్స్ అండ్ సీడ్స్ ను ఇక్కడ మీకోసం పట్టిక తయారుచేయడం జరిగింది. అవేంటో తెలుసుకుని, మీరు కూడా తిని, ఈ వింటర్లో మీ ఆరోగ్యాన్ని వెచ్చగా కాపాడుకోండి. వింటర్లో ఆరోగ్యమే కాదు, జలుబు, కాళ్ళ పగుళ్ళు, పెదాల పగుళ్ళు, అన్ని పరారవుతాయి!

1. ఫ్లాక్స్ సీడ్స్

1. ఫ్లాక్స్ సీడ్స్

ఈ విత్తనాలు పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. బరువు తగ్గి అవకాశం ఉంటుంది. గులెటెన్ ఫ్రీ, కొలెస్ట్రాల్ తక్కువ, జీర్ణ శక్తిని పెంచుతుంది ఎముకలను స్ట్రాంగ్ గా చేస్తుంది.

2. నువ్వులు

2. నువ్వులు

నువ్వులలో హెల్తీ కొలెస్ట్రాల్ ఉంటుంది, అలాగే విటమిన్ బి1, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, క్యాల్షియం, మరియు ఇతర హెల్తీ కంటెంట్ ఉండటం వల్ల ఇవన్నీ బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి, అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇవి హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఈ నువ్వులను రెగ్యులర్ సలాడ్స్, క్రంచెస్ లో జోడించవచ్చు. నువ్వుల లడ్డు,చిక్కీలు వంటివి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

చలికాలంలో శరీరాన్ని వెచ్చగా మార్చే హెల్తీ వింటర్ ఫుడ్స్

3. బాదం

3. బాదం

బాదంలో విటమిన్ బి2, విటమిన్ ఇ, ప్రోటీన్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు మాంగనీస్ లు ఉన్నాయి. బాదంలు వింటర్లో రెగ్యులర్ గా తినడం వల్ల జలుబు దగ్గు తగ్గుతుంది. వింటర్లో జలుబు దగ్గు చాలా కామన్ గా వస్తుంటాయి. కాబట్టి, ఈ క్రంచీ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా చేస్తాయి.

4. వాల్ నట్స్

4. వాల్ నట్స్

వాల్ నట్స్ లో విటమిన్స్, మినిరల్స్, మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. ఈ నట్స్ లో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి, అది విధంగా మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇవి చర్మానికి మంచి రంగును అందిస్తుంది, వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇన్ఫ్లమేటరీ లక్షణాలను నివారించడం ద్వారా మెమరీ పవర్ పెరుగుతుంది, బ్రెయిన్ షార్ప్ గా ఉంచుతుంది.

5. వేరుశెనగలు

5. వేరుశెనగలు

వింటర్ హెల్త్ కు వేరుశెనగలు మంచివి. వీటిలో జింక్, మెగ్నీషియం, ప్రోటీన్స్, విటమిన్ డి, విటమిన్ ఇ, పొటాషియం, జింక్ మరియు ఇతర మినిరల్స్ కూడా అధికంగా ఉంటాయి. వేరుశెనగలు రోస్ట్ చేసి, స్కిన్ తొలగించి, ఎయిర్ టైట్ జార్ లో నిల్వ చేసుకుని, రోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. వేరుశెనగల చిక్కీ, , బెల్లం, కూడా తినవచ్చు.

6. గుమ్మడి విత్తనాలు

6. గుమ్మడి విత్తనాలు

గుమ్మడి విత్తనాల్లో విటమిన్ ఎ, కె, మరియు సిలు అధికంగా ఉన్నాయి. వీటిని తినడం వల్ల మంచి నిద్రపడుతుంది, గాల్ బ్లాడర్ సమస్యలను తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ రిస్క్ తగ్గిస్తుంది. ఈ క్రంచీ సీడ్స్ ను సలాడ్స్, రూపంలో తీసుకోవచ్చు.

7. చియా సీడ్స్

7. చియా సీడ్స్

చియా సీడ్స్ లో హార్ట్, డయాబెటిస్ రిస్క్ తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి.ఈ సీడ్స్ లో అమినో యాసిడ్స్,ఫైబర్, మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయిజ శరీరంలో నీటిని గ్రహించి అవాంచిత బరువును క్రమంగా తగ్గిస్తుంది. శరీరంలో షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

English summary

Nuts & Seeds That Are A Must Have For Winters!

These seeds and nuts have essential fatty acids that have innumerable benefits. Eating the right kind of food in winters will help keep several diseases at bay and you can enjoy your winters without any worry. You can also start your day with some hot meals, adding these nuts to the meal. So, here are some nuts and seeds that are a must have during the winter season. Take them and protect yourself from the winter dryness of the skin, cold, cracked heels, chapped lips, etc. Here you go!