కుంకుమ పువ్వు ఆడవారికన్నా మగవారికే చాలా మంచిది

Written By:
Subscribe to Boldsky

చాలామంది మగవారు కుంకుమ పువ్వు వల్ల ఆడవారికే చాలా ప్రయోజనాలుంటాయనుకుంటారు. అయితే మగవారికి కూడా కుంకుమపువ్వు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఒక గ్లాస్ వేడి పాలలో కాసింత కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మీరు చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు.

చాలా ప్రయోజనాలు

చాలా ప్రయోజనాలు

కుంకుమ పువ్వు పాలలో కలుపుకుని తాగితే వచ్చే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. కుంకుమ పువ్వును కొన్ని ప్రాంతాల్లో కేసర్ అని కూడా పిలుస్తారు.ఇది అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్ చాలా రోగాలకు చెక్ పెడుతుంది.

1. నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది

1. నిద్రలేమి సమస్యను పరిష్కరిస్తుంది

పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. కుంకుమ పువ్వులో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది. తర్వగా నిద్రపోయేలా చేసే గుణం కుంకుమపువ్వుకు ఉంటుంది. కాస్త కుంకుమ పువ్వు తీసుకుని దాన్ని కాస్త గోరువెచ్చని పాలలో కలుపుకుని తాగండి. అందులో కాస్త తేనే కూడా కలుపుకోవొచ్చు. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఇలా చేస్తే చాలా మేలు.

2. జ్ఞాపకశక్తి పెరుగుతుంది

2. జ్ఞాపకశక్తి పెరుగుతుంది

కుంకుమపువ్వును పాలలో కలుపుకుని తాగడం వల్ల మీకు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కుంకుమపువ్వులో ఉండే క్రోసిన్ మీలో మెమొరీ పవర్ ను పెంచుతుంది. ఒకవేళ వీలైతే మీరు ఇంట్లో తయారు చేసుకునే స్వీట్స్ లో కూడా కాసింత కుంకుమ పువ్వు కలుపుకోండి. దీంతో మీలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

3. రుతుక్రమం సమయంలో వచ్చే తిమ్మిరి

3. రుతుక్రమం సమయంలో వచ్చే తిమ్మిరి

మహిళలకు రుతుక్రమం సమయంలో వచ్చే తిమ్మిర్లను కూడా కుంకుమ పువ్వు పోగొడుతుంది. పాలలో కాస్త కుంకుమపువ్వు కలుపుకుని తాగితే రుతుక్రమం సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వంటి సమస్య కూడా ఉండదు.

4. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

4. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది

ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి కూడా కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా బాగా టెన్షన్ కు గురై డిప్రెషన్ లోకి వెళ్తే పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగండి. దీంతో వెంటనే ఒత్తిడి తగ్గిపోతుంది. కుంకుమపువ్వు మెదడుకు అవసరమైన సెరోటోనిన్ అందించడంలో బాగా సాయపడుతుంది.

5. గుండెకు చాలా మంచిది

5. గుండెకు చాలా మంచిది

కుంకుమ పువ్వు గుండెకు చాలా మంచిది. ఇందులో క్రోసీటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంంటాయి. ఇందులో ఉండే క్రోసెటిన్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మీరు హృదయ సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతుంటే ఒక గ్లాస్ వేడిపాలలో కాసింత కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే చాలు.

6. క్యాన్సర్ నివారణకు

6. క్యాన్సర్ నివారణకు

క్యాన్సర్ నివారణకు కూడా కుంకుమపువ్వు+పాలు బాగా ఉపయోగపడతాయి. కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, సఫానల్ ఔషధ గుణాలు క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

7. కీళ్ల నొప్పి తగ్గేందుకు

7. కీళ్ల నొప్పి తగ్గేందుకు

కుంకుమ పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గేందుకు రోజూ పాలలో కుంకుమ పువ్వు కలుపుకుని తాగితే మంచిది. దీంతో కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.

8. రోగనిరోధక శక్తి పెరుగుతుంది

8. రోగనిరోధక శక్తి పెరుగుతుంది

కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కుంకుమ పువ్వు బాగా పని చేస్తుంది. మీరు రోజూ ఉదయం ఒక గ్లాస్ పాలలో కుంకుమపువ్వును కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలు పొందుతారు.

9. రక్తపోటును నియంత్రిస్తుంది

9. రక్తపోటును నియంత్రిస్తుంది

అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా కుంకుమ పువ్వు బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే క్రోసెటిన్ రక్త ప్రవాహంలో వేగాన్ని తగ్గిస్తుంది.

మీరు వేడిపాలలో కొంత కుంకుమ పువ్వు వేసుకుని తాగితే చాలు.

10. జలుబు, దగ్గు తగ్గుతుంది

10. జలుబు, దగ్గు తగ్గుతుంది

కుంకుమపువ్వు జలుబు, దగ్గు నివారణకు బాగా పని చేస్తుంది. మీకు జలబు చేసినా దగ్గు వ్యాధి వచ్చినా వేడివేడి పాలలో కాస్త కుంకుమ పువ్వు వేసుకుని తాగండి. దీంతో త్వరగా మీరు ఉపశమనం పొందుతారు. కుంకుమ పువ్వు అనేది ఇక్కడ పేర్కొన్న అన్ని రోగాలను నివారించగలదు. అందుకోసం ఇప్పటి నుంచి ఆడవారితో పాటు మగవారు కూడా పాలలో కుంకుమ పువ్వుని కలుపుకుని తాగడం అలవాటు చేసుకోండి.

English summary

saffron milk kesar doodh health benefits

10 Saffron Milk (Kesar Doodh) Health Benefits That Will Shock You!
Story first published: Saturday, December 16, 2017, 12:30 [IST]
Subscribe Newsletter