బీట్ రూట్ జ్యూస్ తో పీరియడ్స్ సమస్యలకు చెక్..

Posted By:
Subscribe to Boldsky

మహిళలను వేధించే సమస్య పిరియడ్‌ ప్రాబ్లమ్‌... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. మహిళలో వచ్చే పిరియడ్ నొప్పులను బహిష్టు నొప్పి అని కూడా అంటారు. ఈ రకమైన నొప్పి మీకు లేకుంటే కనుక మీరు అదృష్టవంతులైన యువతులే. చాలామంది యువతులకు ఈ నొప్పి ప్రతినెలా నెలసరి సమయంలో వస్తుంది. పీరియడ్స్ అయ్యే ముందు, అయిన తర్వాత కూడా యువతులు ఈ నొప్పితో ఎక్కువగా బాధ పడతారు.

Say Goodbye To Menstrual Pain With This Beetroot Remedy!

కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది. ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతున్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి.

కడుపులో మెలిపెట్టినట్టు వుండటం, చికాకు, తీవ్ర అసౌకర్యం వుంటాయి. అపుడపుడూ ఈ నొప్పి మరింత అధికంగా వుంటుంది. గుచ్చుకున్న అనుభూతి పొట్ట అంతా మరియు ప్రత్యేకించి పొత్తికడుపు భాగంలో వస్తుంది. కొంతమంది యువతులకు కళ్ళు బైర్లు కమ్మటం, వాంతులు, డయోరియా, వంటివి కూడా వుంటాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగా వుందని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు కానీ, ఎలాంటి ప్రయోజనాలుండవు. తిరిగి అదే సమస్య...

ఈ పరిస్ధితికి ఆందోళన చెందాల్సింది లేదు. ఈ పిరియడ్ నొప్పులు నియంత్రించేందుకు నేచురల్ హోం రెమెడీ ఒకటి ఉన్నది. ఈ హోం రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నొప్పిని చిటికెలో తగ్గిస్తుంది..!

Say Goodbye To Menstrual Pain With This Beetroot Remedy!

కావాల్సిన పదార్థాలు:

• బీట్ రూట్ జ్యూస్ - ½ ఒక కప్పు

• జీలకర్ర పౌడర్: - 1టీస్పూన్

ఈ కాంబినేషన్ లోని నేచురల్ రెమెడీస్ పెయిన్ తగ్గిస్తుంది. అయితే దీన్ని కరెక్ట్ గా తీసుకునే విధానంలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది.

ఈ రెమెడీని తీసుకోవడంతో పాటు కొన్ని యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, వెజిటేబుల్స్ తినడం వల్ల మజిల్ క్రాంప్స్ ను తగ్గిస్తుంది.

బీట్ రూట్ లో బీటా కెరోటీన్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తుంది. యూట్రస్ లో పెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

జీలకర్ర మరో యాంటీఇన్ఫ్లమేటీర పదార్థం. ఇందులో జీలకర్ర పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెనుష్ట్రువల్ పెయిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

Say Goodbye To Menstrual Pain With This Beetroot Remedy!

తయారీ :

• పైన సూచించన ప్రకారం పదార్థాలను ఒక గ్లాసులో తీసుకోవాలి.

• ఈ మిశ్రమాన్ని పూర్తిగా మిక్స్ చేయాలి.

• ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు తీసుకోవడం వల్ల పీరియడ్స్ కాంప్ప్ తగ్గుతాయి.

• దీన్ని రెగ్యులర్ గా తాగడం వల్ల ఇక ముందు కూడా ఎప్పుడూ రాకుండా ఉంటుంది.

English summary

Say Goodbye To Menstrual Pain With This Beetroot Remedy!

Read more at: http://www.boldsky.com/health/nutrition/2017/home-remedy-for-period-pain-beetroot-111929.html
Story first published: Tuesday, March 14, 2017, 17:00 [IST]
Subscribe Newsletter