For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మతిమరుపు పోగొట్టి, మెమరీ పవర్ ను పెంచే 6 అద్భుతమైన ఆహారాలు..!

శరీరంలాగే.. మెదడుకి కూడా.. సరైన పోషకాలు అవసరం. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహార పదార్థాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి.

|

మెమరీ లాస్ అనే పదం సాధారణంగా వినే ఉంటాము . వయస్సు పెరిగే కొద్ది ఏదో ఒక సమయంలో మతిమరుపుకు గురి అవడం సహజం . అయితే మెమరీ లాస్ కు కొన్ని సాధారణంగా లేదా స్పష్టమైన మరియు ఖచ్చితమైనది ఉండాలి. మతిమరుపు సమస్య వయస్సు రిత్యా వచ్చే సమస్య. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది మెదడులో కణాలు మరియు నరాలు దెబ్బతినడం కారణంగా మతిమరుపు వస్తుంటుంది . కాబట్టి, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జ్ఞాపకశక్తి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. హెరిడిటరీ గా వస్తుంది. మంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల హార్మోనుల అసమతుల్యత వల్ల జ్ఞాకపశక్తి తగ్గే అవకాశం ఉన్నది. అందుకే ఉన్న జ్ఞాపకశక్తిని పోగొట్టుకోకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

These Foods Help To Focus & Boost Memory Power

శరీరంలాగే.. మెదడుకి కూడా.. సరైన పోషకాలు అవసరం. అప్పుడు మెదడు యాక్టివ్ గా, హెల్తీగా ఉంటుంది. సరైన ఆహార పదార్థాలు.. మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపకశక్తి మెరుగవడానికి సహాయపడతాయి.

చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే...

సరైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకు జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దాంతో పాటు వైటమిన్-బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం కూడా అవసరం. ఈ విటమిన్లు, యాంటాక్సిడెంట్లు ప్రధానంగా లంబిచే కొన్ని ఆహారాలు మెమరీ పవర్ ను ఏవిధంగా పెంచుతాయో తెలుసుకుందాం...

బ్లూబెర్రీస్:

బ్లూబెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ గా కూడా పిలుస్తారు. ఇది ఫ్రీరాడికల్స్ కారణంగా ఏర్పడ్డ బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బెర్రీస్ లో మెదడు కణాలకు ఉపయోగపడే క్వార్సిటిన్ అధికంగా ఉండి కణాలు సరైన మార్గంలో పని చేయడానికి సహాయపడుతుంది. బెర్రీస్ లో ఇంకా ఆన్థోసైనిన్ తో పాటు మెమరీ లాస్ ను ఏర్పడకుండా అడ్డుకొనే ఫోటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రాస్బెరీ, బ్లూ బెర్రీ, ఆపిల్స్ వంటివి మెదడుకు చాలా మంచి ఆహారాలు.

 లీఫీ వెజిటేబుల్స్ మరియు సిట్రస్ ఫ్రూట్స్ :

లీఫీ వెజిటేబుల్స్ మరియు సిట్రస్ ఫ్రూట్స్ :

గ్రీన్ ఇవి మెమరీ పవర్ ను పెంచడానికి ఎక్కువ జ్ఞాపకశక్తి, ఎక్కువ కాలం నిలిచి ఉండేందుకు సహాయపడుతాయి. కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ మరియు మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి.అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అయినటువంటి ఆరెంజ్, గ్రేప్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ రెండు పదార్థాలు మెమరీ పవర్ పెంచడంలో, రీజనింగ్ ఎబిలిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

 నేచురల్ షుగర్స్ :

నేచురల్ షుగర్స్ :

ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ లో నేచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి మెదడును అలర్ట్నెస్ గా ఉంచుతుంది. బ్రెయిన్ కు నేచురల్ షుగర్స్ తప్పనిసరిగా అవసరం అవుతాయి. బ్రెయిన్ కు రక్తప్రసరణను మెరుగుపరచడంలో నేచురల్ షుగర్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫ్యాటీయాసిడ్స్ :

ఫ్యాటీయాసిడ్స్ :

రెగ్యులర్ డైట్ లో సాల్మన్ ను చేర్చుకోవడం ద్వారా మెమరీ లాస్ ను నివారించడానికి ఇది ఒక సాధ్యమైన మార్గం. సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . బ్రెయిన్ యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంచడానికి ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్థం.చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. డిప్రెషన్ తో పోరాడుతుంది. మెదడు ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్స్ చాలా అవసరం. ఇది బ్రెయిన్ సెల్ ఫంక్షన్ ను పెంచుతుంది.

నట్స్ :

నట్స్ :

నట్స్, ముఖ్యంగా ఎండిన ఫలాలల్లో అధికంగా విటమిన్ ఇ మరియు బి6 ఉండి మెంటల్ ఎనర్జీకి ఉపయోగపడుతుంది. గుప్పెడు బాదం, పిస్తాలను ప్రతి రోజూ తినడం వల్ల మెమరీ పవర్ ను పెంచుకోవడమే కాదు, మన పూర్తి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్స్, మంచి కొలెస్ట్రాల్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఈవెనింగ్ స్నాక్స్ లో డ్రైఫ్రూట్స్ ను ఎక్కువగా చేర్చుకోవడం చాలా ఉత్తమం.

 ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

వెజిటేబుల్ ఆయిల్ నుండి ఆలివ్ ఆయిల్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో కీళ్ళు మరియు మెదడు కణాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫోలిఫినాయిల్స్ ను అధికంగా కలిగి ఉంటాయి. అలాగే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ కూడా ఉండటం వల్ల బ్రెయిన్ ను హెల్తీగా ఉంచుతుంది.

English summary

These Foods Help To Focus & Boost Memory Power

The right foods will help you to utilize your mind to the maximum, boost memory power and also help you focus.
Story first published: Friday, February 3, 2017, 16:35 [IST]
Desktop Bottom Promotion