మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించే 5 సూపర్ ఫుడ్స్

By Sindhu
Subscribe to Boldsky

మహిళల్లో జననేంద్రియాల్లో ఫంగస్‌ చేరడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దీనిని ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్(క్యాండిడియాసిస్) అంటారు. జననేంద్రియ భాగం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ భాగంలో ఈస్ట్‌, బ్యాక్టీరియా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్‌ మోతాదుకు మించీ పెరుగుతుంది. దానికి కారణం లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా లోపించడమే. ఈ బ్యాక్టీరియా ఈస్ట్‌ పెరగకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడయితే అది లోపిస్తుందో.. అప్పుడు ఈస్ట్‌ విపరీతంగా పెరుగుతుంది. అది ఎందుకంటే..

 These Foods Help Prevent Yeast Infection

కారణాలు: సాధారణ అమ్మాయిల్లోనే కాదు, కొందరు క్రీడాకారిణుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే జన్మతః లేదా చిన్న వయసులోనే మధుమేహం మొదలైనవారిలోనూ కనిపిస్తుందీ ఇన్‌ఫెక్షన్‌. ఏదయినా అనారోగ్యం కారణంగా యాంటీబయాటిక్స్‌ వాడినప్పుడు లాక్టోబాసిలస్‌ బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా ఈస్ట్‌ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు.

లక్షణాలు.. జననేంద్రియభాగంలో విపరీతంగా దురద ఉంటుంది. దానికితోడు మంట కూడా బాధిస్తుంది. అలాగే మూత్రవిసర్జన సమయంలో మంటగానూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎర్రగా వాచి ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంటుంది. ఈ సమస్యను వెంటనే నివారించుకోకపోతే మరింత ఎక్కువ అవుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో గుర్తించినప్పుడు, కొన్ని రకాల ఫుడ్స్ సహాయపడుతాయి. ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడలో గొప్పగా సహాయపడుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించుకోవాలంటే ఈ క్రింది సూచించిన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

 బొప్పాయి :

బొప్పాయి :

రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం ఈస్ట్ ఇన్ఫెక్షన్ బొప్పాయితో నివారించుకోవచ్చు. ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి . ఇది ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. బొప్పాయి విత్తనాలు, ఆకులు కూడా ఇన్ఫెక్షన్ నివారిస్తాయి. కాబట్టి, బొప్పాయిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని ఈస్ట్ ఇన్ఫెక్షన్ ను నివారించుకోవచ్చు.

 కొత్తి మీర :

కొత్తి మీర :

కొత్తిమీర, ధనియాలు, ధనియా నూనెలో ఇన్ఫెక్షన్ నివారించే గుణాలు అధికంగా ఉన్నాయి. ధనియాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే వీటిలో మాంగనీస్, మెగ్నీషియంను, ఐరన్, కాపర్ వంటి మినిరల్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ అన్ని రకాల విటమిన్స్ మినిరల్స్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతాయని కనుగొన్నారు.

ఓరిగానో:

ఓరిగానో:

ఓరిగానో ట్రీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడం మాత్రమే కాదు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. కొన్ని చుక్కల ఓరిగానో ఆయిల్ తీసుకుని, స్నానం చేసే నీటిలో వేసి, స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఈ సమస్య తిరిగి రాదు.

 చీజ్ :

చీజ్ :

చీజ్ తినే వారికి ఒక శుభవార్త . చీజ్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చీజ్ తో తయారుచేసిన ఎలాంటి స్నాక్స్ తీసుకున్నా ఈస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

వర్జిన్ కోకనట్ ఆయిల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. రిఫైండ్ కోకనట్ ఆయిల్ కు బదులుగా వర్జిన్ కోకనట్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్, విటమిన్స్ ఉండటం వల్ల స్వచ్చమైన కొబ్బరి నూనెను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కొబ్బరి నూనెతో తయారుచేసే వంటలను తినాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    These Foods Help Prevent Yeast Infection

    Yeast infection plagues a lot of women. Managing this condition efficiently begins with understanding what causes yeast infections. Today here in this article we shall talk about certain foods that will help you to prevent yeast infections.
    Story first published: Monday, January 16, 2017, 11:11 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more