పరగడుపున ఏం తినాలి, ఏం తినకూడదో తెలుసుకోండి!ఇవి ఆరోగ్యానికి తప్పక ఉపయోగపడతాయి

By: Mallikajuna
Subscribe to Boldsky

ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం అన్న సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆహారపదార్ధాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవే ఆహారపదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్ కాదని ఎమ్టీ స్టమక్ అని వారు అంటున్నారు.

కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపున తినడం లేదా తాగడం చాలా ప్రమాదకరం. వాటి వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు ఏర్పడే ప్రమాదం ఉంది. . మరి క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినా…. పరగడుపున తినకూడని ఆహారాలు, తినాల్సి ఆహారపదార్ధాలేంటో మనమూ తెలుసుకుందాం.

1. వరెస్ట్ : ఫ్రూట్ జ్యూస్ లు

1. వరెస్ట్ : ఫ్రూట్ జ్యూస్ లు

గ్రాసరీ స్టోర్స్ లో ఉండే దాదాపు అన్ని రకాల ఫ్రూట్ జ్యూసుల్లో షుగర్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలరింగ్, మరియు ప్రిజర్వేటివ్ ఉన్నాయి. కొన్నింటిలో షుగర్స్ కంటే సోడా ఎక్కువగా ఉంటుంది!ఈ జ్యూస్ లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. చాలా తక్కవు సమయం సుగర్ లెవల్స్ పెరుగుతాయి. మనం తినే ఆహారాల ద్వారా కూడా సుగర్ గా కన్వర్ట్ అవుతుంది. ఆకలి పెరగడం వల్ల షుగర్ ఫుడ్స్, లేకా స్నాక్స్ తీసుకుంటారు.

ఫ్రూట్ జూసులకు బదులుగా ఫ్రెష్ ఫ్రూట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫైబర్ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్సెస్ షుగర్స్ చేరకుండా నివారించుకోవచ్చు.

2. బెస్ట్ : ఓట్ మీల్

2. బెస్ట్ : ఓట్ మీల్

ఓట్ మీల్లో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఎక్కువ. అంటే ఇవి అల్పకాలిక, దీర్ఘకాలిక ఎనర్జీని పెంచుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది.

3. వరెస్ట్ : టమోటోలు

3. వరెస్ట్ : టమోటోలు

మీరు కనుక అసిడిక్ రిఫ్లెక్షన్ లేదా స్టొమక్ అల్సర్ తో బాధతున్నట్లైతే అసిడిక్ టమోటోలను ఉదయం పరగడపున తీసుకోకూడదు .

టమోటోలను బ్రేక్ ఫాస్ట్, సలాడ్స్, సైడ్ డిష్ లలో ఉపయోగించుకోవడం మంచిది. దీన్ని బ్రెడ్, ఫ్రెష్ సాల్సా, స్క్రాబుల్డ్ ఎగ్స్ తో పాటు తీసుకోవచ్చు.

4. బెస్ట్ : గుడ్లు

4. బెస్ట్ : గుడ్లు

గుడ్లలో ప్రోటీన్లు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ. పొట్ట నిండుగా ఉంచడానికి ఇది పర్ఫెక్ట్ ఫుడ్ . ఉదయం ఎనర్జీ అందివ్వడానికి ఇది బెస్ట్ ఫుడ్.

5. బెస్ట్ : బ్లూ బెర్రీస్

5. బెస్ట్ : బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్, యాంథోసైనిన్స్ అధికంగా ఉంటాయి. పండ్లు బ్లూ కలర్లో ఉండేందుకు యాంటీఆక్సిడెంట్సే కారణం. ఈ యాంటీఇక్సిడెంట్స్ బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది, ధమనుల్లో స్టిఫ్ నెస్ పెంచి ఏకాగ్రతను, మెమరీని పెంచుతుంది.

బెర్రీస్ లో విటమిన్ కె, సి, మాంగనీసులున్నాయి,. మెగ్నీషియం, కణాల అనుసంధానికి, రక్తగడ్డకట్టకుండా చేయడానికి సహాయపడుతుంది, సెక్స్ హార్మోన్స్ ను పెంచడానికి ఫ్యాట్, కార్బోహూడ్రేట్స్ విషయంలో మెటబాలిజంకు అవసరమయ్యే క్యాల్షియాన్ని గ్రహిస్తుంది. బ్లడ్ షుగర్ ను క్రమబద్దం చేస్తుంది.బ్లూ బెర్రీస్ స్మూతీస్ తో ఎంజాయ్ చేయవచ్చు.

6. బెస్ట్ : వాటర్ మెలోన్

6. బెస్ట్ : వాటర్ మెలోన్

వాటర్ మెలోన్ హైడ్రేటింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అంతే కాదు, పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, అమినోయాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి వ్యాయామం తర్వాత మంచి ఎనర్జీని ఇస్తాయి.

ఇందులో ఉండే లైకోపిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, శరీరంలో టాక్సిన్స్ తొలగిస్తుంది. కణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్, మాస్కులర్ డిసీజ్, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను నివారిస్తుంది.

7. వరెస్ట్ : కాఫీ లేదా టీ

7. వరెస్ట్ : కాఫీ లేదా టీ

కాఫీ మరియు టీ నిద్రమేల్కోలా చేస్తుంది. అయితే కాఫీ అంత మంచిది కాదు,ఇది డ్యూరియాటిక్ గా అంటే శరీరంలోని నీటిశాతంను తగ్గించే విధంగా చేస్తుంది. డీహైడ్రేషన్ కు మరియు సగ్లినెస్ కు గురిచేస్తుంది. కెఫిన్ యాక్సైటి పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్ మరియు మూడ్ ను మెరుగుపరుస్తుంది.

ఇంకా, కాఫీ అసిడిక్ , అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది, ఇతర జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. అయితే కాఫీ మరియు టీలు కంప్లీట్ గా మానేయాల్సినవసరం లేదు కానీ, మంచి అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు.

8. బెస్ట్ : నట్స్

8. బెస్ట్ : నట్స్

నట్స్ లో న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ , మధ్యహ్నా స్నాక్ కూడా...ఇంకా ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ ఇన్ఫ్లమేసన్ కు సహాయపడుతుంది, బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. నట్స్ బట్టర్, టోస్ట్ బాదంవంటివి తీసుకోవచ్చు!

9. వరెస్ట్ : షుగర్ సెరల్స్ :

9. వరెస్ట్ : షుగర్ సెరల్స్ :

చాలా వరకూ స్వీట్స్ డెసర్ట్స్ ను చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో గోధుమలతో తయారుచేసిన వాటిలో విటమిన్స్, మినిరల్స్, ఆర్టిఫిషియల్ స్వీట్స్ , కలర్స్ , ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కలిపి ఉంటారు ఇంటువంటి ఆహారాలు బ్లడ్ షుగర్స్ ను వేగంగా పెంచుతాయి, దాంతో ఎనర్జీని తగ్గించేస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటి మీద ప్రభావం చూపుతాయి.

10. బెస్ట్: సిట్రస్ ఫ్రూట్స్

10. బెస్ట్: సిట్రస్ ఫ్రూట్స్

జీర్ణశక్తిని పెంచడంలో, ఎనర్జీలెవల్స్ , ఆకలిని పెంచడంలో లెమన్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఎందుకు ఆపాలి?గ్రేట్ ఫూట్ స్లైస్, ఉదయం లెమన్ జ్యూస్ , సిట్రస్ ఫ్రూట్స్ తో తయారుచేసిన స్మూతీస్ ను తీసుకోవడం ఉత్తమం.

11. బెస్ట్ : బొప్పాయి

11. బెస్ట్ : బొప్పాయి

బొప్పాయిలో పెపైన్ అనే ఎజైమ్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ , థ్రోట్ ఇన్ఫెక్షన్, తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, ప్యారాసైటిక్ వార్మ్ మీద దాడిచేస్తాయి.

ఇంకా, ఇందులో ఉండే హైఫైబర్ కంటెంట్ ప్రేగుల్లోనే వేస్ట్ ను తొలగించి, డైజెస్టివ్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవల్ ను కంట్రోల్ చేయడంలో, బ్లడ్ ప్రెజర్, తగ్గించడంలో, హార్ట్ హెల్త్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

12. వరెస్ట్: పాస్టరీస్

12. వరెస్ట్: పాస్టరీస్

క్రోసాంట్స్, డ్యానిషెస్, బ్రోచ్ బ్రెడ్ తినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ, వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అయితే మొదటి మీల్ కు మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకపోవడమే మంచిది. ఇవి పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ముఖ్యంగా షుగర్ , ఈస్ట్ తో ఫుల్ అనిపిస్తుంది.

ఈ స్వీట్ ఫుడ్స్ కు బదులుగా ధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను , హోం స్టైల్ పొటాటో ఫుడ్ తీసుకోవడం ఉత్తమం.

13. బెస్ట్: బక్ వీట్

13. బెస్ట్: బక్ వీట్

బక్ వీట్ లో విటమిన్ బి6, ప్యాంటోథెనిక్ , నియాసిన్, ఫొల్లెట్, థూమిన్, కోలిన్ మరియు రెసిస్టెంట్ ఫైబర్ అధికంగా ఉన్నాయి. బరువు తగ్గించడానికి, ఆకలి తగ్గించడానికి డయాబెటిస్ ను మెరుగుపరచడానికి సహాయపడుతాయి. బక్ వీట్ ను ఉడికించి పోర్డ్జ్, మొలకకట్టడం, స్నాక్ , పిండి తో వివిధ రకాల వంటలు తయారుచేసుకోవచ్చు.

14. వరెస్ట్: కార్బొనేటెడ్ డ్రింక్స్

14. వరెస్ట్: కార్బొనేటెడ్ డ్రింక్స్

సోడ హెల్తీ ఫుడ్ కాదు, ఇందులో సుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కూడా ఉంటాయి. ఇంకా ఫ్లేవరింగ్ ఏజెంట్ ఉండటం వల్ల నరాలను డ్యామేజ్ చేస్తుంది. ముఖ్యంగా ఉదయం తీసుకోవడం చాలా హానికరం

15. బెస్ట్: త్రుణ ధాన్యాలు

15. బెస్ట్: త్రుణ ధాన్యాలు

బియ్యం, క్వీనా, అమర్నాథ్, మిల్లెట్, మరియు స్ప్లెట్, వంటి వాటిలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్స్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తాయి. హార్ట్ అటాక్, టైప్ 2 డయాబెటిస్, ఓబేసిటి, క్యాన్సర్ లక్షణాలను నివారిస్తాయిజ

16. బెస్ట్: పెరుగు

16. బెస్ట్: పెరుగు

పెరుగులో ప్రోటీన్స్, అధికంగా ఉండటం వల్ల ఇవి కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.దీర్ఘకాలిక ఎనర్జీని అందిస్తాయి. మరియు ఫ్యాట్ మరియు ప్రోటీన్ లెవల్స్ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండుగా అనిపిస్తుంది.

పెరుగులో ప్రేగుల ఆరోగ్యానికి సహాయపడే ప్రోబయోటిక్స్ అధికంగా ఉండి, జీర్ణశక్తిని పెంచి , వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది. పెరుగులో కొద్దిగా తేనె, కొన్ని నట్స్, సీడ్స్ మిక్స్ చేసి , ఫ్రూట్స్ కలిపి తినవచ్చు.

English summary

What To Eat On An Empty Stomach | What Not To Eat On An Empty Stomach | Best Thing To Eat On An Empty Stomach

What to eat on an empty stomach? What not to eat on an empty stomach? Read on to know...
Subscribe Newsletter