వరల్డ్ హెల్త్ డే : హార్ట్ అటాక్ ను నివారించే 15 సూపర్ ఫుడ్స్ ..!

Posted By:
Subscribe to Boldsky

మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. ఎంత సంపద ఉన్నా, ఆరోగ్యం బాగోలేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. అందుకే మొదట ఆరోగ్యంగా ఉండటానికి జీవన శైలిలో అనేక మార్పులు చేసుకోవాలి.

ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయమం, యోగ వంటివి డైలీ లైఫ్ లో రొటీన్ గా ఉండాలి. అప్పుడే కొన్ని ప్రాణాంత వ్యాధుల నుండి రక్షణ పొందుతారు . ఈ రోజు వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన వంటగదిలో ఉండే అనేక పదార్థాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయని తెలపడం జరిగింది. అదే క్రమంలో ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని సూపర్ ఫుడ్స్ హార్ట్ అటాక్ ను దూరం చేస్తాయని తెలియజేడం జరిగింది.

World Health Day: 15 Superfoods That Avoid The Risk Of Heart Attacks

దినచర్యలో మీరు ఏం తింటారు, ఏం తాగుతారు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇవి ఆరోగ్యం మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. రోజూ తీసుకునే ఆహారాల్లో 70శాతం ఆహారాలు హార్ట్ అటాక్ ను నివారిస్తాయని పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది.

వివిధ రకాల చేపలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, త్రుణ ధాన్యాలు వంటి ఆహారాలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం, శరీరంలో పెద్ద మార్పులు జరుగుతాయి. కాబట్టి, ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హార్ట్ అటాక్ ను నివారించే హెల్తీ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..

సాల్మన్ :

సాల్మన్ :

సాల్మన్ ఫిష్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి, ఇది మెటబాలిక్ రేటు పెంచి, హార్ట్ అటాక్ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే సెలీనియం కార్డియో వాస్కులర్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

సార్డిన్ :

సార్డిన్ :

సీఫుడ్స్ లో సార్డిన్స్ కూడా ఒకటి, ఇందులో ఫిష్ ఆయిల్ గా పిలుచుకునే ఓమేగా 3 ఉన్నది. ఇది మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది. దాంటో హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

లివర్ :

లివర్ :

హార్ట్ హెల్త్ కు మంచిది. ఇది హార్ట్ అటాక్ ను నివారిస్తుంది. హార్ట్ అటాక్ నివారించడానికి ఇదొక బెస్ట్ ఫుడ్

వాల్ నట్:

వాల్ నట్:

వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ఫైబర్, విటమిన్ ఇ, మరియు ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది హెల్తీ హార్ట్ ను ప్రమోట్ చేస్తుంది. ఇందులో ఉండే ఫాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ హార్ట్ అటాక్ ను నివారిస్తుంది.

బాదం :

బాదం :

బాదంలో ఓమేగా 3s ఉన్నాయి, ఇవి హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది. ఇది హార్ట్ అటాక్ నివారించడంలో టాప్ ఫుడ్స్ లో ఇది ఒకటి.

చియా సీడ్స్:

చియా సీడ్స్:

ఒక స్పూన్ చియా సీడ్స్, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అదే విధంగా రక్తనాళాల్లో ప్లాక్ ను వ్రుద్ది చెందకుండా నివారిస్తుంది. దాంతో హార్ట్ అటాక్ రిస్క్ తప్పుతుంది.

 ఓట్ మీల్:

ఓట్ మీల్:

బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో ఓట్ మీల్ గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ అటాక్ ను నివారించడంలో పాజిటివ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటుంది.

బ్లూబెర్రీస్ :

బ్లూబెర్రీస్ :

బ్లూ బెర్రీస్ లో రివరట్రోల్ మరియు ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ ను తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ రేట్ ను తగ్గిస్తుంది.

యాపిల్స్ :

యాపిల్స్ :

యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇందులో టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. అందువల్ల రోజుకు ఒక యాపిల్ తినడం మంచిది. హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది.

రెడ్ వైన్ :

రెడ్ వైన్ :

రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది. ఆర్టియల్ స్ట్రెగ్త్ మరియు డైలేషన్ తగ్గిస్తుంది. రెగ్యులర్ గా తీసుకుంటే హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో క్యాటచిన్స్, ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది కార్డియో ప్రొటెక్టివ్ లక్షణాలు కలది. బ్లడ్ క్లాట్స్ మరియు హార్ట్ అటాక్ నివారించడంలో గ్రీన్ టీ బెస్ట్.

సోయా మిల్క్:

సోయా మిల్క్:

సోయా మిల్క్ లో ఐస్ ఫ్లేవన్స్ మరియు ఆర్గానిక్ కాంపౌండ్స్ అధికంగా ఉండి, కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది, నియాసిన్ హార్ట్ డిసీజెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది, ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది.

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇదిహైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. ఇవి వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్ హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తాయి.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

బ్రొకోలీలో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గించడంలో టాప్ ఫుడ్ గా చెబుతారు

English summary

World Health Day: 15 Superfoods That Avoid The Risk Of Heart Attacks

What you eat and drink play a major role in affecting your health. Studies have shown that about 70% of the heart diseases are preventable by the means of opting for the right food choices.
Story first published: Wednesday, April 5, 2017, 20:00 [IST]