For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ వేసవికాలం ప్రతిఒక్కరు తీసుకోవాల్సిన పది ఉత్తమైన నిర్విషీకరణ ( డిటాక్స్ )ద్రవాలు :

  By R Vishnu Vardhan Reddy
  |

  వేసవికాలం వచ్చేసింది. ఎండ తీవ్రత కుడా విపరీతంగా పెరిగిపోయింది. అంటే దానర్ధం మీరు, మీకు ఇష్టమైన ఆహారాలను తినకూడదు అని కాదు. ఒక పాత్ర నిండా రుచికరమైన సూప్ ని తీసుకోవడం ద్వారా మీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మీ శరీరం కూడా చల్లబడుతుంది. ఉదాహరణకు చల్లగా ఉన్న పుచ్చకాయ, తులసి వంటి మొక్కకు సంబందించిన సూప్ తాగటం ద్వారా మీ శరీరాన్ని చల్లబరచుకోవచ్చు. ఈ వేసవికాలం ప్రతిఒక్కరు సేవించాల్సిన నిర్విషీకరణ ( డిటాక్స్ ) సూప్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

  సూప్ లలో నిర్విషీకరణమైన సూప్ లు కొద్దిగా ప్రత్యేకమైనవి. ఇవి వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వేసవి తాపం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతే కాకుండా ఈ నిర్విషీకరణ సూప్ లు వేసవి కాలంలో శరీరాన్ని పూర్తిగా శుభ్రంచేయడానికి, మీ శరీరంలో ఎప్పుడూ తగినంత నీరు ఉండటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

  10 Best Detox Soups To Have This Summer

  చల్లటి సూప్ లను చాలామంది విపరీతంగా ఇష్టపడతారు. అంతేకాకుండా వివిధ రుచులు అందుబాటులో ఉంటాయి, మరెన్నో పోషకాలు కలిగి ఉంటాయి. వాటిని తయారుచేయడం కూడా చాల సులభం. జ్యూస్ లు, స్మూతీస్ లా కాకుండా, చల్లటి సూప్ లలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అవి త్వరగా ఆకలి కాకుండా అరికడతాయి.

  ఈ వేసవి కాలంలో మనకు ఉపశమనాన్ని కలిగించే నిర్విషీకరణ సూప్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

  1. గ్రీన్ నిర్విషీకరణ సూప్ :

  1. గ్రీన్ నిర్విషీకరణ సూప్ :

  ఆకుకూర, బఠాణీలు, తియ్యటి బంగాళ దుంపలు, ఉల్లి కాడలను ఉపయోగించి గ్రీన్ నిర్విషీకరణ సూప్ తయారు చేసుకోవచ్చు. ఈ కూరగాయలతో చేసిన సూప్, మీ శరీరానికి ఎంతగానో చల్లదనాన్ని ఇస్తుంది. మీ పొట్ట కూడా నిండుగా ఉంటుంది. వీటితో పాటు దోసకాయ, అవోకాడో, పార్స్లీ వంటి కాయగూరలను కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవే కాకుండా మీకు ఇష్టమైన కాయగూరలను కూడా ఇందులో మీరు వాడుకోవచ్చు. ఇలాంటి కాయగూరలను వాడటం వల్ల మీ శరీరం సహజ సిద్ధంగా శుభ్రం అవుతుంది, నిర్విషీకరణ ప్రక్రియ కూడా ఎంతో ప్రభావవంతంగా జరుగుతుంది. ఈ తాజా కూరగాయాలన్నింటిని సూప్ రూపంలో తీసుకోవడం వల్ల, కణ పొరలు త్వరగా పోషకపదార్ధాలను స్వీకరించి వాటిని వినియోగించుకునేలా ఈ పద్దతి ఎంతగానో ఉపయోగపడుతుంది.

  2. తులసి సూప్ కి సంబందించిన చల్లటి క్రీమ్ :

  2. తులసి సూప్ కి సంబందించిన చల్లటి క్రీమ్ :

  సూప్ లలో క్రీమ్ గనుక వేసుకున్నట్లైతే బరువు పెరుగుతామని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ, జీడి పప్పు తో చేసిన క్రీమ్ వాడినట్లైతే, అది మరీ అంత ఎక్కువగా బరువును పెంచదు. జీడి పప్పు సాస్ ని వాడటం కూడా అద్భుతంగా ఉంటుంది, బాగా క్రీమ్ ఉండేలా అందరిని ఆకర్షిస్తుంది. కానీ, దీనిని తయారుచేసే ముందు జీడి పప్పులను కొన్ని గంటల పాటు లేదా రాత్రి మొత్తం నానబెట్టిన తర్వాత మిక్సీ చేయండి. తులసి ఆకు అనేది సూప్ ల తయారీలో చాల ముఖ్యమైన పదార్ధం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు కారణం దానిలో ఉండే తాజా గుణం. ఆకుకూరల్లో కూడా అద్భుతమైన ఆరోగ్య లాభాలుఉన్నాయి. ఇవి కూడా సూప్ ని రుచికరంగా, ఆరోగ్యవంతంగా మార్చడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

  3. టమోటో, స్ట్రాబెర్రీ సూప్ :

  3. టమోటో, స్ట్రాబెర్రీ సూప్ :

  టమోటో, స్ట్రాబెర్రీ కలిపి సూప్ చేయడం వినడానికి కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, తియ్యటి, ఇంపైన సూప్ తయారీకి ఈ రెండు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ సూప్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అందుచేత మధ్యన భోజన సమయంలో దీనిని తీసుకోవడం చాల ఆరోగ్యకరం. టమోటోలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమొత్తంలో ఉంటాయి. వీటితో పాటు తాజా పొదీనా, కరకరలాడే దోసకాయ ముక్కలు గనుక వేసుకున్నట్లైతే నిర్జలీకరణ కాకుండా అరికడుతుంది.

  4. చల్లటి కివి , మామిడి కాయ సూప్:

  4. చల్లటి కివి , మామిడి కాయ సూప్:

  ఈ సూప్ లో మామిడి పాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి 6 , ఫోలేట్, కార్బో హైడ్రాట్లు, కొవ్వు, ప్రోటీన్లు అత్యధిక మోతాదులో లభ్యమవుతాయి. మరో వైపు కివి పండులో పీచు పదార్ధాలు, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం , పోషక విలువలు, కార్బో హైడ్రాట్లు, కొవ్వు పదార్ధాలు అధిక మోతాదులో లభిస్తాయి. వీటికితోడు ఈ సూప్ లో పొదీనా గనుక వేసినట్లయితే మరింత చల్లగా ఉంటుంది. ఈ కొద్దిపాటి పదార్ధాలను ఉపయోగించి ఈ వేసవిలో చల్లటి సూప్ తయారుచేసుకోవచ్చు. ధాన్యపు పదార్ధాలతో చేసినటువంటి ద్రవం లో వేరుశెనగ వెన్న లేదా కొద్దిగా పెరుగు కలుపుకొని ఈ సూప్ ని గనుక తాగితే చాలా బాగుంటుంది.

  5. బీట్ రూట్ సూప్ :

  5. బీట్ రూట్ సూప్ :

  చల్లటి బీట్ రూట్ సూప్ ని త్రాగటం వల్ల అది మీ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో రంగులతో కూరగాయల యొక్క అసలైన ప్రభావం మీ శరీరం పై ఎలా ఉంటుంది అనే విషయం మీకు తెలుస్తుంది. బీట్ రూట్ ఘాడమైన మెజెంటా రంగులో ఉంటుంది. అందులో విపరీతమైన విటమిన్ల తో పాటు ప్రోటీన్లు, ఫోస్ఫోరోస్, జింక్, విటమిన్ బి 6 , మెగ్నీషియం, కాపర్, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా అధికముగా లభ్యం అవుతాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు లభ్యం అవుతాయి. ఈ సూప్ లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, దోసకాయ ముక్కలను కలపడం ద్వారా, బీట్ రూట్ వల్ల కలిగే సహజ సిద్దమైన తియ్యటి రుచిని కొద్దిగా మార్చుకోవచ్చు.

  6. స్ట్రాబెర్రీ , కొబ్బరి కాయ, పొదీనాతో చేసిన సూప్ :

  6. స్ట్రాబెర్రీ , కొబ్బరి కాయ, పొదీనాతో చేసిన సూప్ :

  మీరు త్రాగే సూప్ లో కొద్దిగా తియ్యదనం కావాలని కోరుకుంటున్నారా ? అలా అయితే స్ట్రాబెర్రీ, కొబ్బరికాయ కలిపి చేసే సూప్ ఇందుకు సరిగ్గా సరిపోతుంది. మీరందరూ స్వీట్ కార్న్ సూప్ తాగే ఉంటారు. మరి ఈ వేసవి కాలం మీరు ఎందుకు ఈ కొత్తరకమైన సూప్ ని రుచి చూడకూడదు. ఇందులో అతి ముఖ్యమైన పదార్ధం బాగా గుజ్జుగా ఉండే స్ట్రాబెర్రీ. దీనికి తక్కువ కొవ్వు శాతం ఉండే కొబ్బరి పాలను కలపడం ద్వారా ఒక రకమైన తియ్యదనం తో పాటు, ఒక కొత్త రకమైన రుచి ఏర్పడుతుంది. స్ట్రాబెర్రీ లలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. అదే సమయంలో కొబ్బరి పాలలో గుండెకు సంబందించిన ఆరోగ్యవంతమైన కొవ్వు పదార్ధాలు అధికంగా లభిస్తాయి. ఇది చాలా ఆరోగ్యవంతమైనది. అదే సమయంలో చల్లగా ఏదైనా తాగాలి అనుకున్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది , ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

  7. చల్లటి బంగాళ దుంప సూప్ :

  7. చల్లటి బంగాళ దుంప సూప్ :

  ఈ వేసవి కాలంలో చల్లటి బంగాళ దుంప సూప్ ని తాగితే ఎలా ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఈ సూప్ తయారీలో భాగంగా మెంతులు , ఆకుపచ్చని ఉల్లిపాయలు, గుడ్లు, వండబడిన పంది తొడ మాంసం, బంగాళ దుంపలను వాడాలి. బంగాళ దుంపలు, పంది తొడ మాంసం, గుడ్లు సూప్ తయారీలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే, వీటిల్లో ప్రొటీన్ల శాతం అధికంగా ఉంటుంది. సూప్ ని మరింత రుచికరంగా ఆరోగ్యవంతంగా తయారుచేయాలని భావిస్తే కొద్దిగా పెరుగుని అందులో కలపండి. ఇలా చేయడం వల్ల కొవ్వుని కరిగించడానికి వీలవుతుంది. అదే సమయంలో ఎటువంటి పుల్లటి క్రీమ్ ని ఇందులో కలపకండి.

  8. థాయ్ సూప్ :

  8. థాయ్ సూప్ :

  థాయ్ సూప్ మరీ అంత రుచికరంగా ఏమి ఉండదు. కానీ, దానిని తయారు చేయడానికి చాలా కొద్ది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. థాయ్ సూప్ తయారీ కోసం పసుపు పచ్చ టమోటాలు, గంట మిరియాలు, దోసకాయ, చిన్న ఉల్లిపాయలను వాడాలి. వీటన్నింటిని వాడటం వల్ల అది ఎంతో రంగుల మయంగా ఉంటుంది. అదే సమయంలో ఎన్నో పోషక విలువలు అందులో ఉంటాయి. వీటికితోడు చేప సాస్, లెమన్ గ్రాస్, కొబ్బరి పాలు, పచ్చిమిరపకాయల పేస్ట్ కలపడం వల్ల థాయ్ రుచులను మనం ఆస్వాదించవచ్చు. మీకు కావాలంటే, ఈ సూప్ తో పాటు రొయ్యలు, ఎరుపు మిరియాల రేకులను కూడా స్వీకరించవచ్చు.

  9. చల్లటి పుచ్చకాయ, తులసి వంటి మొక్కతో చేసిన సూప్ :

  9. చల్లటి పుచ్చకాయ, తులసి వంటి మొక్కతో చేసిన సూప్ :

  ఈ వేసవి కాలంలో తీసుకోదగిన ఉత్తమమైన చల్లటి సూప్ లలో ఇది కూడా ఒకటి. పుచ్చకాయ మనలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. మన శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. అదే సమయంలో తులసి వంటి మొక్కను వీటి తయారీలో వాడటం వల్ల, అది మన శరీరం పై ప్రశాంతమైన ఓదార్పుని చేకూర్చే ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. తురిమిన కొబ్బరి ఈ సూప్ కి ఎంతో వైవిధ్యమైన సరికొత్త రుచిని అందిస్తుంది. సూప్ మొత్తం తయారయిన తర్వాత దాని పై బ్లూ బెర్రీస్ ని వేయడం మరచిపోకండి. ఎందుకంటీ వీటిల్లో అధిక మొత్తం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నడుము చుట్టుకొలతను తగ్గించే శక్తి వీటికి ఉంది.

   10. పిల్లి తీగలు, ఆకు కూరలు, క్వినోవా తో తయారు చేయబడ్డ సూప్ :

  10. పిల్లి తీగలు, ఆకు కూరలు, క్వినోవా తో తయారు చేయబడ్డ సూప్ :

  ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వినోవాను ఒక సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తున్నారు. అందుకు కారణం క్వినోవా లో మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్, పీచు పదార్ధాలు, కార్బో హైడ్రాట్స్, ప్రోటీన్లు, కేలరీలు, అవసరమైన విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు, మరెన్నో పోషకాలు ఇందులో లభిస్తాయి. క్వినోవా ని స్వీకరించడం వల్ల మీ కడుపు చాలా సమయం వరకు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో జీర్ణ ప్రక్రియ సరిగ్గా అవడానికి తోడ్పడుతుంది. దీనికి తోడు కడుపుకి సంబందించిన సమస్యలను దూరం పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సూప్ కి గనుక పిల్లి తీగలు, ఆకుకూరలు కలిపినట్లైతే అది ఒక తక్కువ కేలరీ సూప్ గా తయారవుతుంది.

  English summary

  10 Best Detox Soups To Have This Summer

  Soups, especially detox soups, will cool off your body when you are feeling the heat and stroke in the smouldering summer sun. The best detox soups to have this summer are green detox soup, tomato and strawberry soup, chilled kiwi and mango soup, chilled potato soup, beetroot soup, strawberry and coconut soup with mint, and Thai soup.
  Story first published: Thursday, April 19, 2018, 8:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more