For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రౌన్ షుగర్ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు !!

By Lakshmi Bai Praharaju
|

బ్రౌన్ షుగర్ దాని ఆరోగ్య ప్రయోజనాలు, వివిధ లక్షణాల వల్ల సాధారణ స్ఫటిక రూపంలో ఉండే తెల్లని పంచదారలన్నిటి లోకి ఉత్తమ పంచదారగా పరిగణించబడుతుంది. బ్రౌన్ షుగర్ భిన్నమైన రసాయన నిర్మాణం కలిగి ఉండడం వల్ల, మానవ శరీరం దీనికి కొద్దిగా భిన్నంగాను, సానుకూలంగాను స్పందిస్తుంది.

అసలు బ్రౌన్ షుగర్ అంటే ఖచ్చితంగా ఏమిటి? ఇది మొలాసేస్ తో కలిపిన తెల్లని పంచదార మాత్రమె, అయితే సాధారణ తెల్ల పంచదార కంటే ఆవశ్యక పోషకాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. మొలాసెస్ ఆహారంలో తీసుకోవాల్సిన పొటాషియంకి మంచి వనరు, అలాగే ఇది కాల్షియం, మెగ్నీషియం, బి విటమిన్స్ ని కొద్ది మొత్తాలలో అందిస్తుంది.

10 Health Benefits Of Eating Brown Sugar

వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ రెండూ క్యాలరీలు, పోషకాల పరంగా రెండూ ఒకేవిధంగా ఉన్నప్పటికీ, రంగు, రుచి, దీన్ని తయారుచేసే పద్ధతిలో మాత్రమె తేడా ఉంటుంది.

బ్రౌన్ షుగర్ ని వంటకాలలో చేరిస్తే ఆ వంటకం చిక్కగా, మెత్తగా కనిపిస్తుంది. బ్రౌన్ షుగర్ తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.ఊబకాయాన్ని నిరోధిస్తుంది

1.ఊబకాయాన్ని నిరోధిస్తుంది

బ్రౌన్ షుగర్ ఊబకాయాన్ని నివారిస్తుందని మీరెప్పుడైనా అనుకున్నారా? నిజానికి, బ్రౌన్ షుగర్ మీ ఆరోగ్యానికి చాలామంచిదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే తెల్లని పంచదార కన్నా ఇందులో తక్కువగా క్యాలరీలు వుండడం వల్ల ఊబకాయాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

2. ఋతు శూలను తగ్గిస్తుంది

2. ఋతు శూలను తగ్గిస్తుంది

బ్రౌన్ షుగర్ ని తయారుచేయడానికి వైట్ షుగర్ లో కలిపే మొలసేస్ లో పొటాషియం ఖనిజం ఉంటుంది, ఇది గర్భాశయ కండరాలను తేలికపరచి, రుతుస్రావ సమయంలో సంభవించే సంకోచాలను తగ్గిస్తుంది. పొటాషియం ఋతు శూలను నివారిస్తుంది.

3.రసాయనాలు ఉండవు

3.రసాయనాలు ఉండవు

వైట్ షుగర్ లా కాకుండా బ్రౌన్ షుగర్ లో రసాయనాలు అసలు ఉండవు. ఎందుకంటే బ్రౌన్ షుగర్ లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియ౦, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాల మేళవింపు కలిగిన మొలాసెస్ ఉంటుంది. ఇది మీ శరీరానికి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తుంది.

4.సహజంగా శక్తిని పెంచుతుంది

4.సహజంగా శక్తిని పెంచుతుంది

బ్రౌన్ షుగర్ అతి తక్కువ సమయంలోనే మీకు సహజంగా శక్తిని పెంచుతుంది. ఇది మీకు తాత్కాలికి బలాన్ని అందించి, మీకు నీరసంగా అనిపించినపుడు మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి, మీకు నీరసంగా, శక్తి తగ్గినట్టు అనిపిస్తే మీరు తాగే కాఫీ లేదా టీ లో బ్రౌన్ షుగర్ కలుపుకోండి.

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

5.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? బ్రౌన్ షుగర్ దానికి మందు. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్ధకు ఖచ్చితంగా ప్రయోజనకరం, ఇది మీ కడుపులో జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. అల్లం, బ్రౌన్ షుగర్ కలిపిన వేడి నీటిని తాగితే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

6.ఇది యాంటీ సెప్టిక్

6.ఇది యాంటీ సెప్టిక్

బ్రౌన్ షుగర్ లో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బలు, గాయాలు నయం చేయడానికి దోహదం చేస్తుంది. బ్రౌన్ షుగర్ కు వాపును తగ్గించే, సూక్ష్మ క్రిములను నిరోధించే లక్షణాలు ఉండడం వల్ల గాయాల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ని నిరోధిస్తుంది. కాబట్టి, ఈసారి మీకు దెబ్బ తగిలినపుడు, దానికి చిటికెడు బ్రౌన్ షుగర్ అద్దండి.

7.గర్భిణీ స్త్రీలకూ ప్రయోజనం

7.గర్భిణీ స్త్రీలకూ ప్రయోజనం

స్త్రీలకు ప్రసవం తరువాత త్వరగా కోలుకోవడానికి బ్రౌన్ షుగర్ చాలా ఉపయుక్తంగా పరిగణించబడుతుంది. డెలివరీ తరువాత కోలుకోవడానికి చాలామంది స్త్రీలకూ చాలా సమయం పడుతుంది, అందువల్ల బ్రౌన్ షుగర్ తీసుకుంటే త్వరగా కోలుకోవడానికి వీలవుతుంది.

8.జలుబు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది

8.జలుబు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది

బ్రౌన్ షుగర్ ని జలుబు చికిత్సకు అద్భుతమైన ఉపశమనంగా పనిచేస్తుంది. మీరు జలుబుతో బాధపడుతుంటే, కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా బ్రౌన్ షుగర్ ని నీటిలో వేసి మరిగించండి, ఇది తాగితే జలుబు నుండి తక్షణ ఉపశమనం పొందొచ్చు.

9.ఆస్తమా ని నివారిస్తుంది

9.ఆస్తమా ని నివారిస్తుంది

ఆస్తమా తో, ఇతర శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు, వైట్ షుగర్ కి బదులుగా బ్రౌన్ షుగర్ వాడమని సిఫార్సుచేయడమైనది. బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల ఇది ఆస్తమా ని నిరోధించి, ఇతర అలర్జీ ప్రతిస్పందనలను నిరోధిస్తుంది.

 10.చర్మ సంరక్షణను అందిస్తుంది

10.చర్మ సంరక్షణను అందిస్తుంది

బ్రౌన్ షుగర్ మీ చర్మానికి కూడా చాలా మంచిది, ఇది మీ చర్మాన్ని ఆర్ద్ర౦గా, తేమగా ఉంచుతుంది. ఇది మీ చర్మంపై వచ్చే వాపులను తగ్గిస్తుంది. విటమిన్ B ఎక్కువగా కలిగిన బ్రౌన్ షుగర్ వృద్ధాప్య౦ బారిన పడకుండా మీ చర్మాన్ని రక్షిస్తుంది, మరింత నష్టం జరగకుండా చర్మ కణాలను నిరోధిస్తుంది.

English summary

Array

10 Health Benefits Of Eating Brown Sugar,Brown sugar is considered healthier than white sugar because it contains essential minerals which do not get lost during the manufacturing process. Learn the health benefits of eating brown sugar here.
Desktop Bottom Promotion