Just In
- 15 min ago
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- 1 hr ago
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- 5 hrs ago
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- 18 hrs ago
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
Don't Miss
- News
దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Sports
ఇదంతా ఓ కలలా ఉంది.. చాలా ఒత్తిడికి గురయ్యా: నటరాజన్
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Movies
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
10 ఆరోగ్యవంతమైన తెల్లని కూరగాయలను మీ డైట్ లో చేర్చుకోవడం చాలా ఉత్తమం
మనము, మన ఆహారంలో ముదురు రంగులను కలిగిన కూరగాయలను చేర్చమని చెప్పి, తెల్లని రంగులో ఉన్న వెగ్గీస్ తొలగించమని చెప్పాము, అవును కదా ? అయితే, ఈ సలహా అనేది అన్నింటికీ నిజం కాదు ! కాలీఫ్లవర్, వెల్లుల్లి, పుట్టగొడుగులు వంటివి మొదలైనవి తెలుపు రంగులో ఉన్న కూరగాయలు - ఆకుపచ్చని కూరగాయలు కలిగి ఉన్న సమానమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి.
తెల్లని వెగ్గీస్తో పోల్చితే ముదురు రంగులో ఉన్న కూరగాయలను మరియు పండ్లను తినే ప్రజల్లో హార్ట్ స్ట్రోక్ని కలిగి ఉంటారని పరిశోధకులు నిర్ధారించారు. తెల్లని రంగులో ఉన్న కూరగాయలను తినే ప్రజలలో స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అంటే దీని అర్థం, ముదురు రంగులో ఉన్న కూరగాయలు తినడం వల్ల విలువ లేదని కాదు. మీ ఆహారంలో తెలుపు మరియు ముదురు రంగు కూరగాయలను భాగస్వామ్యం కావడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
నిజానికి, మనం తరచుగా కోల్పోయే పోషకాలను తెలుపు కూరగాయలు ద్వారా గణనీయమైన పరిమాణంలో పొందేందుకు దోహదపడతాయి. కాబట్టి, మీ డైట్ నుండి తెల్లటి ఆహారాన్ని తొలగించడానికి బదులుగా, మీరు వాటిని పుష్కలంగా చేర్చి కావలసిన పోషకాలను పొందవచ్చు.
10 ఆరోగ్యకరమైన వైట్ వెజిటేబుల్స్ గురించి మరింతగా తెలుసుకోండి.

1. కాలీఫ్లవర్ :
కాలీఫ్లవర్ ఏడాది పొడవునా దొరికినా గాని, శీతాకాలంలో ఇది ఇంకా సమృద్ధిగా దొరుకుతుంది. ఇది సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉన్న కారణంగా క్యాన్సర్తో పోరాడుతూ, ఎముక కణజాలాన్ని బలపరిచేటట్లు మరియు రక్తనాళాలను ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది.

2. తెల్లని పుట్టగొడుగులు :
తెల్లని పుట్టగొడుగులలో కేలరీలు తక్కువగా ఉంటాయి, మరియు సున్నా శాతం కొవ్వును మరియు కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో సెలీనియం, పొటాషియం, విటమిన్-డి మరియు రిబోఫ్లావిన్లతో సమృద్ధిగా నిండి ఉంటుంది. అవన్నీ కూడా పూర్తిగా నింపిబడి ఉన్న కారణం చేత, రుచిలో రాజీ పడకుండా మీ బరువును నియంత్రణలో ఉంచగలుగుతుంది.

3. వెల్లుల్లి :
వెల్లుల్లి అనామ్లజని లక్షణాలను కలిగి ఉండి జలుబును మరియు ఫ్లూ జ్వరానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి సహాయపడే 'అల్సిసిన్' అనబడే క్రియాశీల రసాయనాన్ని కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు వ్యాధులను నిరోధిస్తుంది.

4. తెల్లని ఉల్లిపాయలు :
వీటిని "క్వెర్సెటిన్" అని పిలుస్తారు, ఈ ఉల్లిపాయలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది, కీళ్ళనొప్పులు, గుండె జబ్బులు, మధుమేహం వంటివి రాకుండా నిరోధిస్తుంది మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉండేందుకు సహాయపడుతుంది. మరింత ఎక్కువ లాభాలను పొందడానికి మీ సలాడ్లో పచ్చి ఉల్లిపాయలను చేర్చి వాడండి.

5. బంగాళదుంపలు :
ప్రతినిత్యం తరచుగా వినియోగించే కూరగాయలు (లేదా) పండ్లలలో ఉన్న ఫైబర్ మరియు పొటాషియంను, అంతే సమాన స్థాయిలో బంగాళదుంపలు అందిస్తాయి. అవి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుచుటలోనూ మరియు అదే స్థాయిలో కొలెస్ట్రాల్ను నిలచివుండేటట్లు చేయడంలోనూ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, అలానే మన గుండె ఆరోగ్యానికి ఇది చాలా అవసరం కూడా.

6. వైట్ బీన్స్ :
ఈ బీన్స్ అనేవి బఠాణిల మాదిరిగా ఉండి, ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలాలని తరచుగా పరిగణించబడతాయి. ఇవి B-విటమిన్లను, ఐరన్, పొటాషియం మరియు కొంచెం మొత్తంలో కాల్షియంను కూడా సరఫరా చేస్తాయి. వైట్ బీన్స్ కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

7. ఎర్ర ముల్లంగి దుంపలు (టర్నిప్) :
చాలామంది దీని రుచిని ఇష్టపడరు, కాబట్టి దీనిని తరచుగా వినియోగించరు. కానీ, ఇందులో లభించే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం మరియు మాంగనీస్ వంటి గొప్ప మూల పదార్ధాలను కలిగి ఉన్నవని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీటిలో ఫైబర్ అధికంగానూ మరియు కెలోరీలు తక్కువగానూ ఉంటాయి.

8. తెల్ల ముల్లంగి (పర్స్నిప్స్) :
ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లతో పాటు ఫోలేట్, పొటాషియం, డైటరీ ఫైబర్, విటమిన్-సి మొదలైనవాటిని కలిగి ఉన్నాయి. అందువల్ల వీటిని తరచుగా ఉపయోగించడం వలన అనారోగ్యలు వాటిల్లే ముప్పును చాలా వరకూ తగ్గిస్తుంది.

9. హానీడ్యూ మిలన్ :
రక్తపోటును నివారించడంలో సహాయపడే పొటాషియమును అధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడుతున్నవారికి హానీడ్యూ మిలన్ బాగా ఉపయోగపడుతుంది. జీర్ణాశయ సమస్యలకు చికిత్సను అందించేదిగానూ, మరియు రోగనిరోధక వ్యవస్థను బాగా పెంపొందించడంలోనూ కూడా ఇది బాగా సహాయపడుతుంది.

10. వైట్ లీక్స్ :
లీక్స్ రుచికరమైనదిగానూ, చాలా రకాల లాభాలను కలుగ చేసేదిగానూ ఉంటూ, ఆహారంగా సిద్ధం చేసుకోడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. మెగ్నీషియం, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్ మరియు థియామిన్ వంటి ఆరోగ్యకరమైన సమ్మేళనాలను కలిగి ఉండటమే కాకుండా, విటమిన్లు A మరియు K లను కూడా కలిగి ఉంటాయి. సూప్ మరియు సలడ్లలో మంచి రుచిని తేవడానికి వీటిని బాగా కలుపుతారు.
ఈ వ్యాసాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి!