ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజురీ లక్షణాలను తగ్గించే 10 న్యూట్రిషనల్ ఫుడ్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

బ్రెయిన్ అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. అలాంటి బ్రెయిన్ కి తలకి ఏదైనా గట్టి దెబ్బ తగిలిన సమయంలో ఏదైనా గాయం జరిగితే ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీకి దారి తీసే ప్రమాదం ఉంది. అయితే, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అనేది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యూర్ చేయబడుతుంది. కాబట్టి, ఇక్కడ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ సమయంలో తీసుకోవలసిన ఆహారాల గురించి వివరించాము.

చిన్నపాటి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ కూడా బ్రెయిన్ సెల్స్ పై తాత్కాలిక ప్రభావం చూపిస్తుంది. తీవ్రమైన ఇంజురీ జరిగితే టిష్యూస్ చిరిగిపోయి ప్రమాదంతో పాటు, బ్రెయిన్ లో బ్లీడింగ్ లేదా ఫిజికల్ డేమేజ్ జరిగే ఆస్కారం ఉంది. ఈ ఇంజ్యూరీస్ అనేవి దీర్ఘ కాల కాంప్లికేషన్స్ ను కలిగిస్తాయి. ప్రాణాంతక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

nutrition for brain injury patients

ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ అనేది అనేక మానసిక అలాగే శారీరక సమస్యలను తీసుకువస్తుంది. స్పృహ కోల్పోవడం, తలతిరగడం, తలనొప్పి, మాటల్లో తడబాటు, అలసట, నిద్రలేకపోవటం మరియు డిజ్జీనెస్ అనేవి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ వలన కలిగే శారీరక మార్పులు.

మెమరీ ప్రాబ్లెమ్స్, మూడ్ ఛేంజెస్, డిప్రెషన్ మరియు ఆందోళన కలగడం వంటివి ట్రామాటిక్ ఇంజురీ వలన కాగ్నిటివ్ బిహేవియర్ కి సంబంధించిన లక్షణాలు. మరోవైపు, తీవ్రమైన ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ జరిగితే పెర్సిస్టెంట్ హెడ్ ఏక్, విపరీతమైన వాంతులు, మూర్ఛపోవటం అలాగే కో ఆర్డినేషన్ లేకపోవటం వంటివి తలెత్తుతాయి.

కన్ఫ్యూషన్, మాటల్లో తడబాటు, ఆందోళన మరియు కోమా కూడా ఇందుకు సంబంధించిన లక్షణాలు.

ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ పేషెంట్స్ కి ఇక్కడ పేర్కొనబడిన న్యూట్రిషనల్ ఫుడ్స్ ని అందిస్తే మంచిది.

1. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్

1. ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్

మ్యాకేరల్, సాల్మన్ మరియు సార్డీన్స్ వంటి ఆయిలీ ఫిష్ లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమవుతాయి. ఇవి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ తరువాత కాగ్నిషన్, ప్లాస్టిసిటీ మరియు న్యూరాన్స్ రికవరీని మెరుగుపరుస్తాయి. డొకోసహేక్సయెనోయిక్ యాసిడ్ ( DHA) అనేది ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ లో ముఖ్యమైనది. న్యూరానాల్ మెంబ్రేన్స్ కి సంబంధించిన ముఖ్యమైన కాంపోనెంట్ ఇది. DHA అనేది సినాప్టిక్ మెంబ్రేన్ ఫ్లూయిడిటీ మరియు పనితీరును మెరుగుపరచి న్యూరొనాల్ ఫంక్షన్ ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

2. విటమిన్ ఈ:

2. విటమిన్ ఈ:

నట్స్, స్పినాచ్ మరియు ఆలివ్ ఆయిల్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఆయిల్స్ లో విటమిన్ ఈ లభ్యమవుతుంది. విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది బ్రెయిన్ లోని ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి తోడ్పడుతుంది. తద్వారా, న్యూరాన్స్ యొక్క పనితీరు మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. న్యూరానెల్ హెల్త్ ను మెయింటైన్ చేసే సామర్థ్యం విటమిన్ ఈ లో కలదు. తద్వారా, న్యూరలాజికల్ పెర్ఫార్మెన్స్ ను ఇది మెరుగుపరుస్తుంది.

3. పసుపు:

3. పసుపు:

పసుపు అనే ఎల్లో స్పైస్ వలన ఫుడ్ కు ఎల్లో కలర్ అందుతుంది. పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ కలదు. ఇది బ్రెయిన్ ట్రామా తరువాత రికవరీ ఈవెంట్స్ ను విస్తరించేందుకు తోడ్పడుతుంది. కుర్కుమిన్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడం ద్వారా అల్జీమర్స్ బారిన పడిన వారిలో న్యూరోనెల్ ఫంక్షన్ ను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అంతేకాక, ఈ స్పైస్ అనేది లిపిడ్ పేరొక్సిడేషన్ మరియు నైట్రిక్ ఆక్సిడ్ బేస్డ్ రాడికల్స్ నుంచి మెదడును రక్షించేందుకు తోడ్పడుతుంది.

4. ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభించే ఫుడ్స్:

4. ఎమినో యాసిడ్స్ పుష్కలంగా లభించే ఫుడ్స్:

బయలాజికల్ ప్రాసెస్ లో ప్రోటీన్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎమినో యాసిడ్స్ బిల్డింగ్ బ్లాక్స్ లా పనిచేస్తాయి. మజిల్స్, సెల్స్ మరియు టిష్యూస్ అనేవి ఎక్కువ శాతం ఎమినో ఏసిడ్స్ తో రూపొందుతాయి. అంటే, ఇవన్నీ శరీరంలోని ముఖ్య పనులను నిర్వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. బ్రెయిన్ లోని న్యూరోట్రాన్సిమిట్టర్స్ ని సాధారణ స్థాయిలో ఉంచడానికి ఎమినో యాసిడ్స్ అవసరపడతాయి. ల్యూసిన్, ఇసోల్యుసిన్ మరియు వెలైన్ తో ఎమినో యాసిడ్స్ సప్లిమెంటేషన్ ను తీసుకుంటే కాగ్నిటివ్ ఫంక్షనింగ్ నుమెరుగుపరచుకోవచ్చు. లీన్ చికెన్, ఫిష్ మరియు బీన్స్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకుంటే ఎమినో యాసిడ్స్ అనేవి శరీరానికి పుష్కలంగా అందుతాయి.

5. కొలిన్ రిచ్ ఫుడ్స్:

5. కొలిన్ రిచ్ ఫుడ్స్:

కొలిన్ అనేది వాటర్ సోల్యూబిల్ న్యూట్రియెంట్. ఇది నెర్వస్ సిస్టమ్ యాక్టివిటీను పెంపొందిస్తుంది. అలాగే, సరైన ఎదుగుదల అలాగే పురోభివృద్ధికి తోడ్పడుతుంది. క్యాన్సర్ ని అరికడుతుంది. సెల్ మెంబ్రేన్స్ యొక్క స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ ని ప్రమోట్ చేస్తుంది. ఎగ్స్, ప్రత్యేకించి ఎగ్ యోల్క్స్ లో కొలిన్ సమృద్ధిగా లభిస్తుంది. అలాగే, బీఫ్ లివర్, డైరీ ఫుడ్స్, సోక్డ్ నట్స్, లేజ్యుమ్ మరియు క్రూసీఫెరస్ వెజిటబుల్స్ లో కొలిన్ లభిస్తుంది.

6. విటమిన్ బి12 ఫుడ్స్:

6. విటమిన్ బి12 ఫుడ్స్:

శరీరంలోని నెర్వ్ మరియు బ్లడ్ సెల్స్ ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరపడే మరొక పోషకం విటమిన్ బి12. ఈ న్యూట్రియెంట్ అనేది అవుటర్ కోటింగ్ ద్వారా నెర్వ్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. విటమిన్ 12 ని సరైన మోతాదులో తీసుకుంటే నెర్వ్ డేమేజ్ జరగదు. అలాగే బ్రెయిన్ ఫంక్షన్ అనేది మెరుగ్గా ఉంటుంది. మీట్, మిల్క్ మరియు ఎగ్స్ ని తీసుకోవటం ద్వారా బి12 ని గ్రహించవచ్చు.

7. మ్యాంగనీజ్ రిచ్ ఫుడ్స్:

7. మ్యాంగనీజ్ రిచ్ ఫుడ్స్:

హోల్ గ్రెయిన్స్, నట్స్, ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ లో మ్యాంగనీస్ లభిస్తుంది. ఇది బ్రెయిన్ ఇంజురీ నుంచి రికవరీకి తోడ్పడుతుంది. హెల్తీ కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ను ప్రమోట్ చేస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ ను మెటాబాలైజ్ చేయడానికి కూడా సహకరిస్తుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ మెరుగ్గా ఉండేందుకు సపోర్ట్ చేస్తుంది. లీఫీ వెజిటబుల్స్, నట్స్, హోల్ గ్రెయిన్స్ మరియు టీస్ నుంచి మ్యాంగనీస్ ను ఎక్కువగా గ్రహించవచ్చు.

8. ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్:

8. ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్:

బ్లడ్ బిల్డ్ అప్, హార్ట్ డిసీజ్ మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని అరికడుతుంది ఫోలిక్ యాసిడ్. ఈ యాసిడ్ అనేది మెదడులోని సెరోటోనిన్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. ఈ విటమిన్ అనేది అల్జీమర్స్ డిసీజ్ రాకుండా ఉండేందుకు ముఖ్యపాత్ర పోషిస్తుందని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అల్జీమర్ డిసీజ్ మరియు కొన్ని బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్ నుంచి కూడా ఫోలిక్ యాసిడ్ రక్షణను కల్పిస్తుంది. బ్లడ్ లోని హోమోసిస్టెయిన్ లెవెల్స్ ను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. లీఫీ గ్రీన్స్, సిట్రస్ ఫ్రూట్స్, బీన్స్, సెరల్స్ వంటి ఫుడ్స్ ని తీసుకోవడం ద్వారా ఫోలిక్ యాసిడ్ ను గ్రహించవచ్చు.

 9. జింక్ రిచ్ ఫుడ్స్:

9. జింక్ రిచ్ ఫుడ్స్:

సినాప్టిక్ మరియు అక్సనల్ కి సంబంధించి జింక్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. న్యుక్లిక్ యాసిడ్ మెటబాలిజం, బ్రెయిన్ ట్యూబులైన్ గ్రోత్ మరియు ఫాస్ఫరిలేషన్ కి సంబంధించి జింక్ ముఖ్య భూమిక పోషిస్తుంది. జింక్ ని సరైన మోతాదులో తీసుకోకపోతే DNA అలాగే RNA పనితీరు మందగిస్తుంది. బ్రెయిన్ డెవెలప్మెంట్ లో ప్రోటీన్ సింథేసిస్ పై దుష్ప్రభావం చూపుతుంది. న్యూరోట్రాన్స్మిటర్ ఫంక్షన్ అలాగే కాగ్నిటివ్ ఫంక్షన్ పనితీరును మెరుగుపరిచేందుకు జింక్ తోడ్పడుతుంది. వోయిస్టర్, బీఫ్, పంప్కిన్ సీడ్స్, ల్యంబ్ లేదా మటన్ లో జింక్ సమృద్ధిగా లభిస్తుంది.

10. సెలీనియం కలిగిన ఫుడ్స్:

10. సెలీనియం కలిగిన ఫుడ్స్:

సెల్ మెంబ్రేన్స్ ను డ్యామేజ్ నుంచి రక్షించి కొన్ని హార్మోన్ల సింథేసిస్ కై తోడ్పడడంలో సెలీనియం అనే ముఖ్య మినరల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సెలీనియం లోపం వలన మెదడు పనితీరులో తేడాలు రావచ్చు. కాబట్టి సెలీనియం రిచ్ ఫుడ్స్ ని డైట్ లో భాగంగా చేసుకోవాలి. సీఫుడ్, లివర్ మరియు ఎగ్స్ లో సెలీనియం పుష్కలంగా లభిస్తుంది.

English summary

10 Nutritional Foods For Traumatic Brain Injury

Traumatic brain injury is the result of the brain being hit from a violent blow to the head or body. Mild traumatic brain injury can affect your brain cells temporarily, the most serious injury can result in torn tissues, bruising, etc. The foods which are good for the same are foods containing omega-3 fatty acids, manganese, vitamin E, etc.
Story first published: Saturday, April 7, 2018, 19:00 [IST]