విటమిన్ డి అధికంగా ఉండే 11 ఆహారపదార్థాలు

By: Deepthi TAS
Subscribe to Boldsky

విటమిన్ డి ఒక కొవ్వులో కరిగే విటమిన్, ఇది మిగతా విటమిన్లకన్నా వేరైనది ఎందుకంటే సూర్యకాంతి పడ్డప్పుడు మనిషి శరీరం దీన్ని ఎక్కువ పీల్చుకోగలదు.

విటమిన్ డి ఒక విటమిన్ కన్నా హార్మోన్ ముందు కారకంలాగా ఎక్కువ పనిచేస్తుంది, అందుకే హార్మోన్ అసమతుల్యత మరియు శరీరంలో రోగనిరోధకతపై ప్రభావం చూపించగలదు.

విటమిన్ డి శరీరం ఎముకలకి కాల్షియం పీల్చుకోవటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది మరియు విటమిన్ డి లోపం వలన ఎముకలు మెత్తబడి ఆస్టియోమలేసియా అనే వ్యాధి లేదా ఎముకలు అసాధారణంగా మారే స్థితి రికెట్'స్ కో దారితీస్తుంది.

విటమిన్ డి లోపం లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, రుతువుతో తగ్గి పెరిగే డిప్రెషన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్, బలహీనమైన ఎముకలు, చర్మ సమస్యలు మరియు డిమెన్షియా వంటివి రావచ్చు.

తక్కువ సూర్యకాంతి లేదా అసలు తమ శరీరాలను ఎండ తగలనివ్వని వాళ్లకి కూడా విటమిన్ లోపం రావచ్చు.

మీకు సరిగా సూర్యకాంతి తగలకపోతున్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన 11 ఆహారపదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, వాటిని మీ రోజువారీ భోజనంలో జతచేసుకోండి. అవేంటో చదవండి.

1. చేపలు

1. చేపలు

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువ ఉంటాయి, మాకెరెల్, సాల్మన్ మరియు ట్యూనా చేపలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ మరియు మాక్రెల్ లో రోజుకి సరిపోయే దాంట్లో 91 శాతం విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మాత్రమే కాక, చేపలో ఇతర పోషకాలు కూడా ఉంటాయి.

2. పుట్టగొడుగులు

2. పుట్టగొడుగులు

పుట్టగొడుగులు విటమిన్ డి ఎక్కువగా ఉండే మంచి ఆహారపదార్థం. అవి పెరిగేటప్పుడు ఎండలో ఎక్కువగా ఉంటాయి, అందుకనే వాటిలో విటమిన్ డి విలువ ఎక్కువగా ఉంటుంది. బటన్ మష్రూమ్స్ చాలా సాధారణంగా విటమిన్ డి ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు.

3. పాలు

3. పాలు

ప్యాకింగ్ లో వచ్చే పాలు లేదా పచ్చి ఆర్గానిక్ పాలలో విటమిన్ డి తో నిండేట్లా ప్రాసెస్ చేస్తారు. సంపూర్ణమైన పాలను ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండండి. ఒక కప్పు పచ్చి పాలల్లో రోజువారీ సూచించిన విటమిన్ డి లో 24 శాతం వరకూ ఉంటుంది.

4. కాడ్ లివర్ ఆయిల్

4. కాడ్ లివర్ ఆయిల్

కాడ్ లివర్ ఆయిల్ మీ రోజువారీ సూచించిన విటమిన్ డిని పొందటానికి ఒక మంచి మరియు సులభమైన పద్ధతి. కాడ్ లివర్ ఆయిల్, కాడ్ చేపలోని కాలేయం నుంచి తీయబడుతుంది. ఇది సాధారణంగా క్యాప్సూల్స్ రూపంలో లభిస్తుంది. 1 చెంచా కాడ్ లివర్ ఆయిల్ లో రోజువారీ సూచించిన విటమిన్ డి 100 శాతం లభిస్తుంది.

5. ఛీజ్

5. ఛీజ్

రికొట్టా ఛీజ్, స్విస్ ఛీజ్, మరియు గోట్ ఛీజ్ ఇవన్నీ విటమిన్ డి కి మంచి వనరులు. మీ ఆహారంలో ఒక ముక్క వీటి యొక్క జున్నును జతచేసుకోవటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఛీజ్ ను మీ శాండ్ విచ్ కి జతచేయండి లేదా మీ ఆహారంపై అలా చల్లుకోండి.

6. గుడ్లు

6. గుడ్లు

గుడ్లు కూడా విటమిన్ డి ని ఇచ్చే మంచి ఆహారపదార్థాలు. నిజానికి గుడ్లు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి. 1 పెద్ద గుడ్డు రోజువారీ సూచించిన విటమిన్ డి లో 10 శాతాన్ని అందిస్తుంది. గుడ్లలో ఇతర విటమిన్లు ఎ, కె, మరియు ఇ కూడా ఉంటాయి.

7. కమలాపళ్ళు

7. కమలాపళ్ళు

ఒక గ్లాసు ఆరెంజి రసం కూడా చాలా విటమిన్ డి మరియు కాల్షియం అందిస్తుంది. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో కమలాపండ్లను తినటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఒక కప్పు ఆరెంజి రసం 36 శాతం విటమిన్ డి ని అందిస్తుంది.

8. ఓట్’స్

8. ఓట్’స్

ఓట్ మీల్ లో దాదాపు మొత్తం విటమిన్ డినే ఉంటుంది మరియు ఇతర విటమిన్లు, పోషకాలు కూడా ఉంటాయి. ఒక అరకప్పు ఓట్ మీల్ దాదాపు 39 శాతం వరకు విటమిన్ డిని మీకు అందించగలదు. బ్రేక్ ఫాస్ట్ కి ఓట్ మీల్ తినడం మొదలుపెట్టండి, మీ విటమిన్ డి స్థాయి పెరుగుతుంది.

9. రొయ్యలు

9. రొయ్యలు

రొయ్యలలో అధికంగా ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు మరియు విటమిన్ డి ఉంటాయి, ఇవి వాపులు తగ్గించేటప్పుడు మరియు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేటప్పుడు మీ ఎముకలకు చాలా మంచిది. 3 ఔన్సుల రొయ్యలు 2ఐయూ ల విటమిన్ డి అందిస్తుంది మరియు ఇందులో విటమిన్ బి12, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి.

10. వెన్న

10. వెన్న

వెన్నలో తక్కువ, కానీ చాలా ముఖ్యమైన పరిమాణంలో విటమిన్ డి ఉంటుంది. ఇది 9 ఐయూల విటమిన్ డి ని అందిస్తుంది. ఇందులో సాచ్యురేటడ్ కొవ్వులు ఉంటాయి, వీటి వలన శరీరం యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ డిని పీల్చుకోగలదు. కాకపోతే వెన్నను ఎప్పుడు మితంగానే తీసుకోండి.

11. పెరుగు

11. పెరుగు

పెరుగులో కూడా విటమిన్ డి ప్రాసెస్ చేయబడి, ప్యాకయి వస్తోంది. ఇది శరీరం కాల్షియం ఎక్కువ పీల్చుకునేలా చేస్తుంది. ఒక కప్పు పెరుగు రోజువారీ విటమిన్ డిలో 20 శాతాన్ని అందిస్తుంది. పెరుగు మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా ఎక్కువకాలం ఉండేలా కూడా చేసే ఒక మేటి పదార్థం.

ఈ ఆర్టికల్ షేర్ చేయండి!

మీకు ఈ వ్యాసం నచ్చినట్లయితే, మీ దగ్గరివారితో పంచుకోండి.

English summary

11 Foods Rich In Vitamin D

Vitamin D is a fat-soluble vitamin that is different from other vitamins because the human body can absorb most of this vitamin when exposed to sunlight. The symptoms of vitamin D deficiency include weakened immune system, seasonal depression, autoimmune disease, etc. People who don't expose their bodies to the sunlight can also suffer from vitamin D deficiency.
Story first published: Wednesday, February 7, 2018, 10:10 [IST]
Subscribe Newsletter