For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోంపు విత్తనాలు తినటం వల్ల 12 రకాల లాభాలు కలుగుతాయని మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

సాధారణంగా ప్రతి ఒక్కరు ఆహారం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వడానికి సోంపుని తింటూ ఉంటారు. సోంపుని ఆంగ్లంలో ఫెన్నెల్ సీడ్స్ అని అంటారు. సాధారణంగా మనం అందరం సోంపు గా పిలుచుకునే ఈ విత్తనాలు తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. మధుమేహ వ్యాధిని కూడా ఇది అదుపులో ఉంచగలదని చెబుతున్నారు. ఈ సోంపు గింజల్లో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు, ఎన్నో అరుదైన పోషకాలు కూడా లభ్యమవుతాయి. వీటి వల్ల అవి మరింత శక్తివంతమైన మరియు పోషక పదార్ధాలను కలిగి ఉంటాయి.

మీకు తెలుసా ? చాలా పదార్థాలను తయారుచేసే క్రమంలో భాగంగా మంచి సువాసన రావడానికి సోంపు గింజలు వాడతారు. మౌత్ ఫ్రెషనర్లు, ఐస్ క్రీములు మరియు పేస్ట్ ఇలా అనేక వాటిల్లో సోంపు గింజలు వాడుతారు.

12 Health Benefits Of Fennel Seeds

సోంపు గింజల్లో రాగి, పొటాషియం, జింక్, విటమిన్ సి, ఇనుము, సెలెలియం, మాంగనీస్ మరియు క్యాల్షియం వంటి ఖనిజాలు అధిక మొత్తంలో లభ్యమవుతాయి. ఈ రకమైన ఆరోగ్య లాభాలే కాకుండా, సోంపు గింజలను అనేక మందుల తయారీలో భాగంగా మరియు వంటల్లో కూడా తరచూ వాడుతుంటారు.


ఈ గింజలు సంవత్సరం మొత్తం దొరుకుతాయి. ఇవి సాధారణంగా పొడి రూపంలో దొరుకుతాయి లేదా గింజల రూపంలో ఉంటాయి.

సోంపు గింజల వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది :

1. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది :

సోంపు గింజలను నమలడం వల్ల లాలాజలములో నైట్రైట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలా చూస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఇది చాలా ముఖ్యమైన అంశం.

2. నీరు అలానే ఉండిపోవడాన్ని తగ్గిస్తుంది :

2. నీరు అలానే ఉండిపోవడాన్ని తగ్గిస్తుంది :

సోంపు గింజల వల్ల సాధారణంగానే మూత్ర విసర్జన సరైన పద్దతిలో జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండే ప్రాణాంతకమైన పదార్ధాలను మరియు అవసరం లేని ద్రవాలను బయటకు పారద్రోలడం లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా చేయడం వల్ల మలమూత్ర నాళాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి మరియు చెమట పట్టేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి మల మూత్రనాళాలకు తరచూ ఎటువంటి ఇన్ఫెక్షన్లు శోక కుండా సోంపు విత్తనాలు కాపాడుతాయి.

3. రక్తహీనత రాకుండా చూస్తుంది :

3. రక్తహీనత రాకుండా చూస్తుంది :

సోంపు గింజల్లో ఇనుము బాగా లభిస్తుంది. హిమో గ్లోబిన్ తయారీకి ఇది ఎంతోముఖ్యం. అంతేకాకుండా రక్తహీనత భారిన పడకుండా కాపాడుతుంది మరియు హిస్టీడిన్ హిమో గ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చైతన్య పరుస్తుంది మరియు రక్తానికి సంబంధించిన ఎన్నో పదార్ధాలు ఏర్పడటంతో కీలక పాత్ర పోషిస్తుంది.

4. బరువు తగ్గటానికి పనికి వస్తుంది :

4. బరువు తగ్గటానికి పనికి వస్తుంది :

సోంపు గింజల్లో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనం బరువు తగ్గుతాము మరియు ఆకలి కూడా ఎక్కువగా వేయదు. అంతేకాకుండా శరీరంలో కొవ్వు తక్కువగా ఉండేలా చేస్తుంది మరియు పోషక పదార్ధాలను సంగ్రహించుకునే విధానాన్ని మెరుగుపరుస్తుంది. సోంపు టీ త్రాగటం వల్ల మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది.

5. అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది:

5. అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది:

చాలా మంది భోజనం చేసిన తర్వాత అజీర్ణం అవ్వకుండా ఉండటానికి, జీర్ణం బాగా అవ్వడానికి సోంపు గింజలు తింటూ ఉంటారు. ఇవి మిగతా పొట్టకు సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది. సోంపు గింజలు, జీర్ణం అవడానికి మరియు గ్యాస్ట్రిక్ కు సంబంధించిన ఆమ్లాలను బాగా విడుదల అయ్యేలా చైతన్య పరుస్తుంది. దీని వల్ల ప్రేగుల్లో మంట బాగా తగ్గుతుంది. దీనికి తోడు వివిధరకాల పేగు సంబంధిత సమస్యలు రాకుండా సంరక్షిస్తుంది.

6. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది :

6. గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది :

సోంపు గింజల్లో పీచు పదార్ధం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తం లో కొవ్వు శాతం ఆరోగ్యవంతమైన స్థాయిల్లో ఉంటుంది. రక్తంలో చెడు కొవ్వుని తగ్గించి మంచి కొవ్వుని పెంచుతాయి సోంపు గింజలు. గుండె సంబంధిత వ్యాధులు మరియు గుండెపోటు రాకుండా ఇది నియంత్రిస్తుంది.

7. క్యాన్సర్ ని నిరోధిస్తుంది :

7. క్యాన్సర్ ని నిరోధిస్తుంది :

క్యాన్సర్ భారిన పడకుండా కాపాడే సామర్థ్యం సోంపు గింజలకు ఉంది. వీటిల్లో కణితులు ఏర్పడకుండా మరియు పెరగకుండా చేసే ఫలావోనోయిడ్స్, ఫినాల్స్ అనే పదార్ధాలు ఉన్నాయి. సోంపు గింజలను ప్రతి రోజు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

8. రోగనిరోధక శక్తి పెరుగుతుంది :

8. రోగనిరోధక శక్తి పెరుగుతుంది :

సోంపు గింజల్లో విటమిన్ సి ఉంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. చర్మ కణజాలాలకు మరమత్తులు చేస్తుంది మరియు ప్రమాదకరమైన పదార్ధాల నుండి రక్త నాళాలకు సంరక్షణ కలిగిస్తుంది. ఒక కప్పు సోంపు గింజల్లో, ఒక రోజుకు అవసరమయ్యే విటమిన్ సి లో 20% లభిస్తుంది.

9. ఋతుక్రమ లక్షణాలను మెరుగుపరుస్తుంది :

9. ఋతుక్రమ లక్షణాలను మెరుగుపరుస్తుంది :

ఋతుక్రమ లక్షణాలను మెరుగుపరచడానికి సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఋతుక్రమ లక్షణాలను నియంత్రిస్తుంది మరియు సరైన పద్దతిలో శరీరంలో హార్మోన్లు వ్యవహరించేలా చేసి ఋతుక్రమం సరైన పద్దతిలో అయ్యేలా చూస్తుంది. దీంతో ఇవి నొప్పి నివారిణిగా మరియు విశ్రాంతి కలిగించే పదార్థంలా కూడా ఉపయోగ పడుతుంది.

10. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

10. కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

వంటల్లో సోంపు గింజలు వాడటం వల్ల, మీ కళ్ళకు మంట కలగ కుండా కాపాడుతుంది. ఎందుకంటే, సోంపు గింజల్లో విటమిన్ సి మరియు ఎమినో ఆమ్లాలు అధిక శాతంలో ఉంటాయి. ఇవి మీ కళ్ళను రక్షిస్తాయి.

11. ఊపిరి సంబంధిత సమస్యలను నయం చేస్తుంది :

11. ఊపిరి సంబంధిత సమస్యలను నయం చేస్తుంది :

దగ్గు, ఛాతీ భాగంలో రక్తాధిక్యం మరియు బ్రోన్కైటిస్ ( శ్వాస నాళముల వాపు ) వంటి ఊపిరి సంబంధిత సమస్యలను దూరంచేయడానికి సోంపు గింజలు ఎంతగానో ఉపయోగ పడతాయి. ముక్కు మరియు గొంతులో ఉండే గళ్ళ మరియు శ్లేష్మాన్ని బయటకు పంపించి మిమ్మల్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి సోంపు గింజలు ఎంతగానో సహాయపడతి.

12. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

12. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

సోంపు గింజల్లో ఫెలినీయం అధికంగా ఉంటుంది. ఇది కాలేయంలో ఉండే ఎంజైములు బాగా పనిచేసేలా, వాటి యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది మరియు హానికర పదార్ధాలను పారద్రోలుతుంది. సోంపు టీ సేవించినా లేదా సోంపు గింజల్ని నమిలిన, మీ కాలేయం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ల భారిన పడకుండా కాపాడుతుంది.

English summary

12 Health Benefits Of Fennel Seeds

Fennel seeds or saunf, as it is commonly called, is useful for relieving many ailments ranging from congestion to diabetes. Fennel seeds contain powerful antioxidants and phytonutrients, which make them powerful and nutritious. Fennel seeds have high amounts of essential minerals like copper, potassium, zinc, vitamin C, iron, selenium, manganese and calcium.
Story first published:Friday, February 16, 2018, 18:22 [IST]
Desktop Bottom Promotion