మీరు రోజూ గేదె పాలు, ఆవుపాలు తాగుతున్నారా? సోయాపాలు గురించి తెలిస్తే రోజూ వాటినే తాగుతారు

Written By:
Subscribe to Boldsky

ఒకప్పుడు పాలు అంటే ఆవు లేదా బర్రె నుంచి పిండుకున్నవే. మరిప్పుడో.. బోలెడన్ని రకాలు. సోయా, బాదాం, బియ్యపుపాలు, కొబ్బరిపాలు.. ఇలా పాలు వేర్వేరు రూపాల్లో అందుతోంది. ఆవు, గేదేపాలు, ఆవుపాలు అంటే పడనివారు చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు కూడా. ఎన్ని రకాలు ఉంటేనేం ఆరోగ్యానికి ఆవుపాలే మేలు అంటున్నారా? మీ అంచనా నిజమేకానీ.. సోయా గింజల నుంచి సేకరించిన పాలు కూడా దాదాపు ఇంతే మేలు చేస్తాయని అంటున్నారు మెక్‌గిల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.

పోషకాలు సమతులంగా ఉండే పాలు

పోషకాలు సమతులంగా ఉండే పాలు

గింజల, కాయల నుంచి సేకరించే రకరకాల పాలన్నింటిలోని పోషకాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని... అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉండే పాలు సోయా అని వారు చెప్పారు. సోయాలోని ఐసోఫ్లేవిన్స్‌ అనే రసాయనాలు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయన్నది తెలిసిన విషయమే. దీంతోపోలిస్తే బియ్యంతో చేసిన పాలు తీయగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం తక్కువేనని వీరి అధ్యయనంలో తెలిసింది.

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పసిపిల్లలకు అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఆసియాతోపాటు దక్షిణ అమెరికాలో ఎక్కువగా వినియోగించే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇక బాదాంపాలలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు బరువు తగ్గించుకునేందుకు భేషుగ్గా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తల అంచనా.

ఆవుపాల కన్నా, గేదెపాల కన్నా శ్రేష్ఠమైనవే

ఆవుపాల కన్నా, గేదెపాల కన్నా శ్రేష్ఠమైనవే

సోయాబీన్‌ పాలు ఆవుపాల కన్నా, గేదెపాల కన్నా శ్రేష్ఠమైనవే కాక చాలా చవక కూడా. పాలఫ్యాక్టరీలు పంపిణీ చేసే హోమోజినైజ్డ్‌ పాలతో పోలిస్తే సోయాబీన్‌ పాలు ఎంతో మెరుగు. ఈ పాలలో మన శక్తికీ, స్వస్థతకూ ఉపకరించే ఇనుము, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, విటమిన్‌-సి ఎంతో అధిక శాతంలోనూ, మన రక్త ప్రసరణ వ్యవస్థకు హానికలిగించే కొవ్వు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి.

240 గ్రాముల మాంసకృత్తులు

240 గ్రాముల మాంసకృత్తులు

ఒక కప్పు ఎండు సోయాబీన్లలో 240 గ్రాముల మాంసకృత్తులు లభిస్తాయి. మేకమాంసంలో 225, కాలేయంలో 180, చేపల్లో 175 గ్రాములు, జున్నులో 170, కోడిమాంసంలో 350 గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి. అంటే మాంసాహారం కన్నా సోయాబీన్‌ చాలా శ్రేష్ఠం. పైగా చవక. మన శరీరానికి అవసరమైన 14 అమినో ఆమ్లాలలో 10 ఆమ్లాలు సోయాలో లభిస్తాయి.

అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌

అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌

సోయాబీన్‌ పాలతో, ఆవుపాలతో చేసుకునే వంటకాలంటిన్నింటినీ, టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ, పన్నీరు, మిల్క్‌షేక్స్‌, ఐస్‌క్రీమ్‌, స్వీట్లు, బిస్కట్లు, కేకుల వంటివి చేసుకోవచ్చు. సోయాబీన్‌ పాలు, అధికరక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, కీళ్లనొప్పులు, ఆస్తమా, బ్రోంకైటిస్‌, సైనసైటిస్‌ సమస్యలు ఉన్నవారు కూడా ఈ పాలను నిస్సంకోచంగా వాడవచ్చు.

సోయా మిల్క్‌ పోషకాల గని

సోయా మిల్క్‌ పోషకాల గని

సోయా పాలను సోయాబీన్స్ నుంచి తయారు చేస్తారు. సోయా మిల్క్‌ను పోషకాల గని అని చెప్పవచ్చు. ఈ పాలలో మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు సంపూర్ణ పోషణను అందించడమే కాదు, పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి.

ఫైబర్ పుష్కలం

ఫైబర్ పుష్కలం

సోయా మిల్క్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్)పై ప్రభావం చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువు తగ్గుతారు. హైబీపీని తగ్గిస్తుంది. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తుంది.

మొటిమలు, మచ్చలు పోతాయి

మొటిమలు, మచ్చలు పోతాయి

రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని సోయా మిల్క్ తగ్గిస్తుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నందున సోయా మిల్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సోయా పాలను తాగడం వల్ల చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం తన పూర్వ స్థితికి వస్తుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

శిరోజాల పెరుగుదల

శిరోజాల పెరుగుదల

సోయా మిల్క్‌లో ఉండే ప్రోటీన్లు శిరోజాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. కురులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

ఎముకలను దృఢంగా మారుతాయి

ఎముకలను దృఢంగా మారుతాయి

సోయా పాలలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగిన వారికి సోయా పాలను తాగిస్తే వారు త్వరగా కోలుకుంటారు. ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

చక్కని శక్తి

చక్కని శక్తి

శారీరక శ్రమ, వ్యాయామం ఎక్కువగా చేసే వారికి సోయా మిల్క్ చక్కని శక్తిని అందిస్తాయి. దీంతో త్వరగా రికవర్ అవుతారు. తిరిగి శక్తిని కూడదీసుకుని యాక్టివ్‌గా మారుతారు.

డిప్రెషన్‌ను పోగొడుతుంది

డిప్రెషన్‌ను పోగొడుతుంది

సోయా మిల్క్‌లో విటమిన్ బి6 సమృద్ధిగా ఉంటుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. డిప్రెషన్‌ను పోగొడుతుంది. సోయా పాలలో ఉండే మెగ్నిషియం ఫీల్ గుడ్ హార్మోన్ అయిన సెరటోనిన్‌ను వృద్ధి చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉంటారు. ఇంకా సోయా పాలు తీసుకునేవాపిలో హార్మోన్ల పనితీరు మెరుగ్గా వుంటుంది. దీంతో మెనోపాజ్ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపులో వుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సోయా పాల తయారీ ఇలా

సోయా పాల తయారీ ఇలా

ఒక కిలో సోయాబీన్లతో 8 లీటర్ల సోయా పాలు తయారవుతాయి. ఈ లెక్కన మీకు కావలసిన పాలకు సరిపోయే సోయాబీన్లు తీసుకోండి. తెల్లని సోయాబీన్ల కన్నా గోధుమ రంగు సోయాబీన్లను వినియోగించి తయారు చేసిన పాలు నాణ్యంగానూ, రుచిగానూ ఉంటాయి. మీరు తీసుకున్న సోయాబీన్లకు 5 రెట్ల పరిమాణంలో మంచినీళ్లు తీసుకుని వాటిని 8 గంటల పాటు నానబెట్టాలి. ఉదయం నీటిని ఒంచివేసి మంచినీళ్లతో బీన్సును మరో రెండు సార్లు శుభ్రం చేయాలి. నానబెట్టిన తరువాత పరిమాణంలో అవి రెట్టింపు అవుతాయి.

బాగా మరగించాలి

బాగా మరగించాలి

నానబెట్టిన బీన్సుకు మూడు రెట్ల పరిమాణంలో నీరు తీసుకుని బాగా మరగించాలి. అందులో కప్పు బీన్సుకు, ఒక టీ స్పూను చొప్పున సోడా ఉప్పు కలపాలి. ఆ తరువాత మరుగుతున్న నీళ్లలోనే బీన్సును తటాలున వేసి అయిదు నిమిషాలు నాననివ్వాలి. ఆ తరువాత నీటిని ఒంచివేసి బీన్సును మళ్లీ వేడినీటితో కడగాలి. మళ్లీ మరిగించిన నీటిలో సోడా ఉప కలిపి అందులో బీన్సును వేసి మరో అయిదు నిమిషాలు నాననివ్వండి.

సోయాగుజ్జును వడగట్టండి

సోయాగుజ్జును వడగట్టండి

మరోసారి వేడి నీటితో బీన్సును శుభ్రం చే యాలి. పై విధంగా శుభ్రం చేసిన ఒక కప్ బీన్సుకు నాలుగు లేక ఐదు కప్పుల మరుగుతున్న నీటిని కలపాలి. ఆపైన మిక్సీలో వేసి నాలుగు నిమిషాల పాటు అత్యధిక వేగంతో రుబ్బాలి. మిక్సీ పాత్ర పరిమాణాన్ని బట్టి, మీరు నానబె ట్టిన బీన్సు మోతాదును బట్టి ఈ ప్రక్రియను నాలుగైదు సార్లు చేయవలసి రావచ్చు. ఇప్పుడు పల్చని గుడ్డను నాలుగైదు పొరలుగా వేసి సోయాగుజ్జును వడగట్టండి.

మిగిలే ద్రవమే సోయా పాలు

మిగిలే ద్రవమే సోయా పాలు

వడగట్టిన తరువాత పాత్రలో మిగిలే ద్రవమే సోయా పాలు. గుడ్డ మీద మిగిలిన గుజ్జు వ్యర్థ పదార్థం కాదు. అందులో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ గుజ్జుతో వడలు, దోశలు, మురుకుల్లాంటివి చేసుకోవచ్చు. తయారైన సోయాబీను పాలను రెట్టింపు పరిమాణంలో ఉన్న పాత్రలో పోసి, గరిటెతో తిప్పుతూ, 15 నిమిషాలు అఽధిక వేడితో కాచి, ఆ తరువాత మరో 7 నిమిషాలు సన్నని సెగలో వేడి చేయాలి. ఈ ప్రక్రియకు పాలు పొంగకుండా కాచే పాత్రను కూడా వాడవచ్చు. ఈ పాలను ప్రతి వ్యక్తీ రోజుకు ఒక లీటరు చొప్పున వాడితే, పోషక లోపాలవల్ల వచ్చే వ్యాధులన్నింటినీ నిరోధించవచ్చు.

ఔషధ గుణాలు అపారం

ఔషధ గుణాలు అపారం

సోయాబీన్‌ పాలలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. సోయాబీను పాలు స్త్రీల నెలసరి సమస్యలను, స్త్రీల నెలసరి ముగింపు సమస్యలను, వక్షోజ క్యాన్యర్లను, స్త్రీ జననాంగ క్యాన్సర్లను నివారిస్తాయి. సోయాలో ఉన్న లెసితిన్‌ అనే పదార్థం కొలెస్ర్టాల్‌ను తగ్గించడంతో పాటు, గుండె గోడలకు పట్టిన గారను తొలగిస్తుంది. ప్రతినిత్యం సోయాపాలను ఉపయోగిస్తే 50 శాతం ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేసుకోవచ్చు.

సోయాపాల ఫ‌లూదా

సోయాపాల ఫ‌లూదా

అలాగే సోయాపాల ఫ‌లూదా కూడా తయారు చేసుకోవొచ్చు. కావల్సినవి.. సోయా పాలు - పావుకప్పు, మామిడిపండు గుజ్జు - కప్పు, పాలపొడి - నాలుగు చెంచాలు, మొక్కజొన్నపిండి - రెండున్నర చెంచాలు, వెన్నలేని పాల క్రీం - రెండు చెంచాలు (బజార్లో దొరుకుతుంది), చక్కెరపొడి - నాలుగు చెంచాలు, నానబెట్టిన సబ్జాగింజలు- రెండు చెంచాలు.

తయారీ ఇలా

తయారీ ఇలా

ఓ గిన్నెలో పాలపొడీ, మొక్కజొన్నపిండీ, రెండు చెంచాల సోయాపాలూ తీసుకుని పిండిలా కలిపి పెట్టుకోవాలి. మిగిలిన పాలను మరో గిన్నెలో తీసుకుని మరిగించుకోవాలి. అందులో పాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తరవాత దింపేయాలి. ఇది చల్లారాక మామిడిపండు గుజ్జూ, క్రీం, చక్కెరపొడీ వేసి బాగా కలపాలి.

డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి

డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి

ఓ అల్యూమినియం గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు గంటల తరవాత బయటకు తీసి మరోసారి మిక్సీ పట్టాలి. చిక్కగా అయిన ఈ మిశ్రమాన్ని గ్లాసులో తీసుకుని పైన సబ్జాగింజలు వేసుకుని తీసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే.. పైన మరికొంచెం మామిడిప గుజ్జూ, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్లాంటివి వేసుకోవచ్చు.

English summary

20 impressive benefits of soymilk

20 impressive benefits of soymilk
Story first published: Tuesday, May 8, 2018, 17:00 [IST]