For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాలకన్నా అధికంగా కాల్షియం కలిగివున్న ఆహార పదార్థాలు

పాలకన్నా అధికంగా కాల్షియం కలిగివున్న ఆహార పదార్థాలు.

|

" ఒక్క చుక్క కూడా మిగల్చకుండా, మొత్తం పాలన్నీ చిటికెలో తాగేయ్", ఈ మాట ప్రతి ఇంట్లోని పిల్లలకు వారి తల్లితండ్రులు చెప్పగా వినవచ్చేదే! అవునా, కాదా?

మన పెద్దలు, మనం తప్పక ప్రతిదినము ఒక్కసారైనా పాలు తాగేటట్టు చూసేవారు, ఎందుకంటే వాళ్లకు పాలు కాల్షియంతో పాటుగా అనేక పోషకాలతో నిండి ఉంటుందని తెలుసు.

ఎదిగే పిల్లలకు పోషకాలు అధికంగా అవసరమవుతాయి. పైగా, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల మరియు కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి.

7 Foods That Have More Calcium Than A Glass Of Milk!

కాల్షియం వంటి పోషకాల కొరత ఏర్పడితే, పిల్లలలో ఎముకల పెరుగుదల మందగిస్తుంది. పిల్లలు కురచగాతయారవుతారు. ఎముకలు బలహీనంగా మారడం వలన సులువుగా పగుళ్లు వచ్చి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి.

పిల్లలకు కాల్షియం అత్యంత ముఖ్యమైన పోషకం. దాని అర్ధం పెద్దలకు అస్సలు అవసరం లేదని కాదు.

నిజానికి, మన వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఎముకలు, కండరాలు ధృడంగా ఉండటానికి కాల్షియం ఎక్కువగా అవసరం అవుతుంది . ఎందుకంటే, వయస్సు పెరుగుతున్న కొద్దీ మన ఎముకలు, కండరాలలో పటుత్వం తగ్గుతూ వస్తుంది.

కాల్షియం వలన హృదయ ఆరోగ్యం మెరుగుపడడం, కేన్సర్ మరియు మధుమేహం వంటివి నివారింపబడడం, రక్తపోటు తగ్గడం, మొదలైన ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

మీ కొరకు , పాలకన్నా ఎక్కువగా కాల్షియం కలిగి ఉండే ఆహార పదార్థాలను గురించి ఇప్పుడు తెలియజేయబోతున్నాం. వీటిని మీ దైనందిన ఆహార ప్రణాళికలో భాగం చేసుకోండి.

1.సాల్మన్ చేప:

1.సాల్మన్ చేప:

చేపలు అత్యంత బలవర్ధకమైన ఆహారం. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.

సాల్మన్ చేప (మాగలు) లో ఇతర పోషకాలతో పాటు కాల్షియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. 170 గ్రాముల సాల్మన్ చేపలో 350 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది మన దైనందిన కాల్షియం అవసరాలకు సరిపోతుంది. అంతేకాకుండా, సాల్మన్ చేప వలన బరువు తగ్గడం, ఒత్తిడి తగ్గడం, చర్మ ఆరోగ్యం మెరుగుపరచడం, సహజంగా శక్తిని పెంచడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

 2. ఛియా విత్తనాలు:

2. ఛియా విత్తనాలు:

రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున, ఛియా విత్తనాలు ఈ మధ్య కాలంలో అధిక ప్రాముఖ్యతను పొందాయి. వీటిని సలాడ్లలో మరియు వివిధ వంటకాలలో వాడటం వలన వాటిలో పోషకాలు పెరుగుతాయి. వంద గ్రాముల ఛియా విత్తనాలలో 631 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది.ఇవి బరువు తగ్గడానికి, మెదడు పనితీరు మెరుగు పరచడానికి, జీవక్రియను వేగవంతం చేయడానికి, వంధ్యత్వ చికిత్సకు సహాయపడతాయి.

3. బాదం పప్పు

3. బాదం పప్పు

బాదం పప్పు ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో నిండి ఉన్న ఆహార పదార్థం అని మనకు తెలిసిందే! జీడిపప్పు, బాదంపప్పు, వాల్నట్లను మన దైనందిన ఆహార ప్రణాళికలో భాగం చేసుకోవాలి. ముప్పావు కప్పు బాదంపప్పులో 320 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. చాలామంది ప్రజలు, ముఖ్యంగా వేగన్ డైట్ లో ఉన్నవారు ఆవుపాలకు బదులుగా బాదంపాలు వినియోగిస్తారు. ఎందుకంటే, బాదంపాలలో కొవ్వులు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

4. పాలకూర

4. పాలకూర

ఆకుకూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలకూరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలను పురస్కరించుకుని, ఆకుకూరలకు రాజు అని చెప్పవచ్చు. పాలకూర లో కాల్షియం మెండుగా ఉంటుంది. ఒక కప్పు పాలకూరలో 394 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంతేకాక, పాలకూర, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడం, శక్తిని పెంచడం, జీర్ణశక్తిని పెంచడం, జీవక్రియను వేగవంతం చేయడం మొదలైన వాటిలో తోడ్పడుతుంది.

5. నారింజ రసం

5. నారింజ రసం

నారింజ రసం, ఆర్గానిక్ పళ్ళను వినియోగించి, పంచదార మరియు ఎటువంటి నిల్వకు ఉపయోగించే రసాయనాలు వినియోగించకుండా తయారు చేసి,పొద్దుట పూట తాగితే, ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుందని ముందే తెలిసిందే! అంతేకాక, దీనిలో కాల్షియం మెండుగా ఉంటుంది. ఒక గ్లాసుడు నారింజ రసంలో ,350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.

6. కాబూలీ శనగలు(ఛనా)

6. కాబూలీ శనగలు(ఛనా)

కాబూలీ సనగలను ఉపయోగించి పలు రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తారు. మనందరికీ ఎంతో ఇష్టమైన ప్రసిద్ధ 'ఛనా బతూరా' వీటితోనే చేస్తారు. వీటిలో ప్రోటీన్లు తో పాటుగా కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. ఒకటిన్నర కప్పుల కాబూలీ శనగలలో 350 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.


English summary

6 Foods That Have More Calcium Than A Glass Of Milk!

It's very important to have a balanced diet to maintain our health, the mineral Calcium is very much necessary for our bones and overall health. Our heart, nerves and muscles also require calcium to carry out their functions properly. These foods have more calcium than a glass of milk: Salmon, Ricotta Cheese, Chia Seeds,
Desktop Bottom Promotion